WNP: పెబ్బేరు మండలం రామమ్మపేట గ్రామానికి చెందిన పద్మమ్మ చిన్న రాయుడు గ్రామ సర్పంచ్‌గా ఏకగ్రీవమయ్యారు. ఆదివారం ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి ఏకగ్రీవ సర్పంచి పద్మమ్మను శాలువాలతో సన్మానించి అభినందించారు. రామమ్మ పేట గ్రామం ఏకగ్రీవమైనందున తన SDF నిధుల నుంచి రూ.20 లక్షలను ఇస్తానని గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని ఎమ్మెల్యే వారికి హామీ ఇచ్చారు.