ఢిల్లీ ఎయిర్ పోర్టులో ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఢిల్లీ నుంచి కోల్‌కతా వెళ్లాల్సిన స్పైస్‌జెట్ ఫ్లైట్ ఆలస్యంగా బయలుదేరడంతో ప్రయాణికులు అసహనం వ్యక్తం చేశారు. ఉదయం 7:25 గంటలకు బయలుదేరాల్సిన విమానం రీషెడ్యూల్ చేసినట్లు స్పైస్‌జెట్ సిబ్బంది ప్రయాణికులకు సమాచారం ఇవ్వలేదు. దీంతో ప్రయాణికులు సిబ్బందితో వాగ్వాదానికి దిగారు.