IPL 2026లో ముంబై ఎట్టకేలకు మరో విజయం సాధించింది. అహ్మదాబాద్ మ్యాచులో GTపై 99 రన్స్ తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత ముంబై 199/5 స్కోర్ చేయగా.. లక్ష్యచేధనలో గుజరాత్ బ్యాటర్లలో సుందర్(26) మినహా ఎవరూ 2 పదుల స్కోర్ చేయలేదు. MI బౌలర్లలో అశ్వనీ కుమార్ 4, శాంట్నర్, ఘజన్ఫర్ చెరో 2, బుమ్రా ఒక వికెట్ తీశారు. టోర్నీలో తమ తొలి పోరు గెలిచిన MI.. ఆపై వరుసగా 4 ఓడిన సంగతి తెలిసిందే.