అనంతపురం ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో ప్రస్తుత విద్యా సంవత్సరానికి అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశాల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. రాయలసీమలోని పురాతన కళాశాలల్లో ఒకటైన ఈ కళాశాల BA, BSc, BCom వంటి వివిధ కోర్సులను అందిస్తోంది. ఆసక్తి గల విద్యార్థులు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని కళాశాల యాజమాన్యం కోరింది.
అమాయకులను లక్ష్యంగా చేసుకుని సైబర్ మోసగాళ్లు రెచ్చిపోతున్నారు. SBI పేరిట ఖాతాదారులకు APK ఫైల్స్‌ని పంపి దాన్ని డౌన్లోడ్ చేసుకుని.. దాంట్లో ఆధార్ వివరాలను అప్లోడ్ చేయాలని, లేదంటే SBI యోనో యాప్ బ్లాక్ అయిపోతుందంటూ ఓ మెసేజ్ నెట్టింట ప్రచారం అవుతోంది. దీనిపై స్పందించిన PIB ఫ్యాక్ట్ చెక్ విభాగం.. అవి పూర్తిగా నకిలీవని ప్రజలకు సూచించింది.
ఈ నెల 17 నుంచి జరగాల్సిన గ్రూప్-D పరీక్షలు వాయిదా పడ్డినట్లు RRB ప్రకటించింది. నూతన షెడ్యూల్ ప్రకారం ఈ పరీక్షలను ఈ నెల 17 నుంచి 2026 జనవరి 16 వరకు నిర్వహిస్తామని తెలిపింది. పరీక్ష సెంటర్, డేట్ వివరాలు రేపటి నుంచి వెబ్సైట్లో అందుబాటులో ఉంచినట్లు చెప్పింది. పరీక్షలకు 4 రోజుల ముందు నుంచి కాల్ లెటర్స్ డౌన్ లోడ్ చేసుకోవచ్చని పేర్కొంది.
బాలల దినోత్సవం సందర్భంగా BSNL విద్యార్థుల కోసం స్పెషల్ ప్లాన్‌ను తీసుకొచ్చింది. నవంబర్ 14 నుంచి డిసెంబర్ 13 వరకు యాక్టివేట్ చేసుకోవచ్చు. రోజుకు రూ.8.96(రూ.251/28 రోజులు) వ్యయంతోనే వాయిస్ కాలింగ్, డేటా, SMS సేవలను అందించడం ఈ ప్లాన్ ప్రత్యేకత. ఇందులో అన్లిమిటెడ్ కాలింగ్‌తోపాటు 100GB హై స్పీడ్ డేటా, రోజుకు 100 SMSలు లభిస్తాయి.
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఇవాళ ఉదయం నష్టాలతో ప్రారంభమయ్యాయి. నిఫ్టీ 62 పాయింట్లు తగ్గి 25,952కు చేరింది. సెన్సెక్స్ 185 పాయింట్లు నష్టపోయి 84,764 వద్ద ట్రేడవుతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.88.70గా ఉంది.
బంగారం ధరలు ఇవాళ భారీగా తగ్గాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,740 తగ్గి రూ.1,23,660కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేట్ రూ.1,600 తగ్గి రూ.1,13,350 పలుకుతోంది. అలాగే, కిలో వెండి ధర రూ.3,000 తగ్గి రూ.1,70,000లకు చేరింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలు ఉన్నాయి.
AP: పదో తరగతి పరీక్షలను మార్చి 16 లేదా 21 నుంచి నిర్వహించేందుకు విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. ఆ రెండు తేదీల ప్రకారం టైం టేబుళ్లను రూపొందించి ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. ఈసారి 6.50 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాసేందుకు వీలుగా 3,500 సెంటర్లను సిద్ధం చేస్తున్నారు. 35వేల మంది ఇన్విజిలేటర్లు, స్క్వాడ్ సిబ్బంది ఎంపిక ప్రక్రియ మొదలైంది.
TG: ఇంటర్ పూర్తిచేసిన విద్యార్థులకు అందించే నేషనల్ మెరిట్ స్కాలర్ షిప్ దరఖాస్తుల గడువును ఈనెల 30 వరకు పొడిగించినట్లు TGBIE ప్రకటించింది. ఫ్రెష్, రెన్యూవల్ రెండింటికీ వర్తిస్తుంది. 2025 పరీక్షల్లో టాప్ 20 పర్సంటైల్‌లో ఉన్న విద్యార్థులు ఫ్రెష్ దరఖాస్తు చేసుకోవచ్చు. గతంలో స్కాలర్ షిప్ పొందినవారు 2025-26 విద్యాసంవత్సరానికి scholarships.gov.in ద్వారా రెన్యూవల్ చేసుకోవచ్చు.
AP: ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌ను ఇంటర్మీడియట్ బోర్డు విడుదల చేసింది. ఈ క్రమంలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు ఫిబ్రవరి 23 నుంచి మార్చి 24 వరకు జరగనున్నాయి. అలాగే, సెకండ్ ఇయర్ పరీక్షలు ఫిబ్రవరి 24న ప్రారంభమై మార్చి 23న ముగియనున్నాయి. కాగా, పరీక్షలకు సంబంధించిన పూర్తి షెడ్యూల్‌ను బోర్డు అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది.
TG: గిగ్ వర్కర్స్ బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. మొదటిసారి గిగ్ కార్మికులకు ప్రత్యేక ఐడీని రూపొందించనున్నారు. వారి సంక్షేమం, రిజిస్ట్రేషన్, నిధుల పర్యవేక్షణ కోసం ఒక ప్రత్యేక రాష్ట్ర బోర్డును ఏర్పాటు చేస్తారు. సామాజిక భద్రత కోసం రాష్ట్ర బోర్డు ఏర్పాటు చేయనుంది. పని భద్రత కోసం తొలగించే ముందు కనీస నోటీస్ పీరియడ్ తప్పనిసరి చేసింది.
నేషనల్ మెరిట్ స్కాలర్‌షిప్‌పై తెలంగాణ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ బోర్డు కీలక ప్రకటన చేసింది. 2025-26 విద్యా సంవత్సరానికి గానూ తాజా, రెన్యూవల్ దరఖాస్తులకు చివరి తేదీని నవంబర్ 30 వరకు పొడగిస్తున్నట్లు ప్రకటించింది. దరఖాస్తులను scholarships.gov.in వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో సమర్పించాలి. ఎంపికైన అభ్యర్థుల వివరాలకు tgbie.cgg.gov.inను చూడండి.
TG: మెడికల్&హెల్త్ సర్వీస్ రిక్రూట్మెంట్ బోర్డు 1,260 ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్-2 పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల లిస్టును విడుదల చేసింది. 24,045 మంది దరఖాస్తు చేయగా, 23,323 మంది పరీక్ష రాశారు. కాగా, స్పోర్ట్స్ కోటా సెలక్షన్ లిస్టును సెపరేట్‌గా విడుదల చేస్తామని వెల్లడించింది. దివ్యాంగుల కోటాలో దరఖాస్తుదారులు లేకపోవడంతో 2 పోస్టులు ఖాళీగా ఉన్నాయని పేర్కొంది.
ఇవాళ బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో నిన్నటితో పోలిస్తే 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.110 తగ్గి 1,24,970కి చేరుకుంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.100 తగ్గి రూ.1,14,550గా పలుకుతోంది. మరోవైపు వెండి ధర సైతం కిలోపై రూ.2,000 తగ్గి రూ.1,73,000కు చేరుకుంది. తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ప్రధాన నగరాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.