• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »బిజినెస్

ఆన్ జాబ్ ట్రైనింగ్ కేంద్రాల పరిశీలిన

E.G: వృత్తి విద్య (ఒకేషనల్) గ్రూపులకు సంబంధించి ఆన్ జాబ్ ట్రైనింగ్ (ఓజేటీ) నిర్వహిస్తున్న సెంటర్లను జిల్లా ఓజేటీ ఇన్స్ఫెక్షన్ బృందం గురువారం సందర్శించారు. ఎస్ఎన్ఎటీ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సీఎస్ఈ, ఈటీ, ఎంఎల్డీ, ఎంపీహెచ్ డబ్ల్యూ (ఫిమేల్) గ్రూపులకు సంబంధించి ఓజేటీ సెంటర్లను క్షుణ్ణంగా పర్యవేక్షించి విద్యార్థులతో మాట్లాడారు.

December 12, 2024 / 08:57 PM IST

వాయిదా పడిన డిగ్రీ పరీక్షలు ఎప్పుడంటే?

KDP: పలు కారణాలరీత్యా వాయిదా పడిన యోగివేమన విశ్వవిద్యాలయ అనుబంధ డిగ్రీ కళాశాలల సెమిస్టర్ల పరీక్షల కోసం కొత్త తేదీలను వైవీయూ సీఈ ఆచార్య కె.కృష్ణారావు వెల్లడించారు. ఈనెల 2 తేదీన జరగాల్సిన పరీక్షలు ఇదేనెలలో 23వ తేదీన నిర్వహిస్తామన్నారు. ఈ నెల 3 తేదీన జరగాల్సిన పరీక్ష 21వ తేదీ ఉంటుందని సీఈ తెలిపారు.

December 12, 2024 / 06:58 PM IST

వాయిదా పడిన డిగ్రీ పరీక్షలు ఎప్పుడంటే?

KDP: పలు కారణాలరీత్యా వాయిదా పడిన యోగివేమన విశ్వవిద్యాలయ అనుబంధ డిగ్రీ కళాశాలల సెమిస్టర్ల పరీక్షల కోసం కొత్త తేదీలను వైవీయూ సీఈ ఆచార్య కె.కృష్ణారావు వెల్లడించారు. ఈనెల 2 తేదీన జరగాల్సిన పరీక్షలు ఇదేనెలలో 23వ తేదీన నిర్వహిస్తామన్నారు. ఈ నెల 3 తేదీన జరగాల్సిన పరీక్ష 21వ తేదీ ఉంటుందని సీఈ తెలిపారు.

December 12, 2024 / 06:58 PM IST

23 ఉద్యోగాలకు దరఖాస్తులు

CTR: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ పరిధిలోని ఉమ్మడి చిత్తూరు జిల్లాలో గల ప్రభుత్వ ఆసుపత్రులలో వివిధ కాంట్రాక్ట్ ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు DMHO కార్యాలయం పేర్కొంది. 10 విభాగాలలో మొత్తం 23 ఉద్యోగాలు ఉన్నాయి. అర్హత, ఇతర 2 https://chittoor.ap.gov.in వెబ్ సెట్ చూడగలరు. దరఖాస్తులకు చివరి తేదీ డిసెంబర్ 13.

December 12, 2024 / 06:44 PM IST

23 ఉద్యోగాలకు దరఖాస్తులు

CTR: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ పరిధిలోని ఉమ్మడి చిత్తూరు జిల్లాలో గల ప్రభుత్వ ఆసుపత్రులలో వివిధ కాంట్రాక్ట్ ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు DMHO కార్యాలయం పేర్కొంది. 10 విభాగాలలో మొత్తం 23 ఉద్యోగాలు ఉన్నాయి. అర్హత, ఇతర 2 https://chittoor.ap.gov.in వెబ్ సెట్ చూడగలరు. దరఖాస్తులకు చివరి తేదీ డిసెంబర్ 13.

December 12, 2024 / 06:44 PM IST

ప్రాథమిక పాఠశాల ఆకస్మిక తనిఖీ

PLD: సంతమాగులూరు మండలం ఏల్చూరు గ్రామంలో ప్రాథమిక పాఠశాలను గురువారం రాష్ట్ర చైల్డ్ వెల్ఫేర్ కమిషన్ సభ్యురాలు బత్తుల పద్మావతి ఆకస్మికంగా తనిఖీ చేశారు. మధ్యాహ్నం భోజనాన్ని పరిశీలించారు. విద్యార్థులకు 80 గుడ్లు మాత్రమే అందించగా రికార్డులో 113 గుడ్లు రాయటంపై ఆమె ఉపాధ్యాయులను ప్రశ్నించారు. ఇలాంటివి చేస్తే ఉపేక్షించేది లేదని పద్మావతి హెచ్చరించారు.

December 12, 2024 / 06:13 PM IST

‘కదిరిలో ప్రతి రోజూ పురుగుల అన్నం.. రోడ్డెక్కిన విద్యార్థులు’

ATP: కదిరిలో డిగ్రీ కళాశాల పక్కన ఉన్న గిరిజన గురుకుల పాఠశాలలో విద్యార్థలకు రోజు పురుగుల అన్నం పెడుతున్నారని విద్యార్థులు రోడ్డెక్కారు. STSN డిగ్రీ కాలేజీ వద్ద రోడ్డుపై బైఠాయించిన విద్యార్థులకు AISP నాయకులు మద్దతుగా నిలిచారు. నాయకుడు నరసింహ మాట్లాడుతూ.. విద్యార్థుల పట్ల చులకనగా వ్యవహరిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

December 12, 2024 / 05:29 PM IST

గ్రూప్-2పై TGPSC కీలక అప్‌డేట్

TG: గ్రూప్-2 పరీక్షలపై TGPSC కీలక అప్‌డేట్ ఇచ్చింది. అభ్యర్థుల ఇబ్బందులను పరిష్కరించేందుకు జిల్లాల వారీగా హెల్ప్‌ లైన్‌ నంబర్లను తీసుకొచ్చింది. ఈ మేరకు ఫోన్ నెంబర్లతో కూడిన జాబితాను https://www.tspsc.gov.in/ లో పొందుపర్చింది. ఈనెల 15, 16 తేదీల్లో గ్రూప్-2 పరీక్షలు నిర్వహించనున్నారు. హాల్​టికెట్లు డౌన్​లోడ్​ సమయంలో సాంకేతిక ఇబ్బందులు వస్తే 040-23542185, 040-23542187 నంబర్లకు సంప్ర...

December 12, 2024 / 05:14 PM IST

చాట్రయి విద్యార్థులకు అస్వస్థత

కృష్ణా: చాట్రాయి మండలం కోటపాడు ఎంపీయూపీ స్కూల్లో మధ్యాహ్నం భోజనం తిని విద్యార్థులు అస్వస్థతకు గురైన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చిది. విద్యార్థుల తల్లిదండ్రుల వివరాల మేరకు.. బుధవారం మధ్యాహ్నం పాఠశాలలో విద్యార్థులు భోజనం తిన్న తర్వాత 9 మంది తీవ్ర కడుపునొప్పికి గురయ్యారు. అనంతరం వారిని స్థానిక పీహెచ్‌సీకి తరలించారు.

December 12, 2024 / 04:14 PM IST

స్విగ్గీ కొత్త మెంబర్‌షిప్ ప్లాన్.. ప్రయోజనాలివే!

ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ కొత్త మెంబర్‌షిప్ ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. ‘ONE BLCK’ పేరిట తీసుకొచ్చిన ఈ ప్లాన్ ద్వారా సభ్యత్వం పొందాలంటే స్విగ్గీ నుంచి ప్రత్యేక ఆహ్వానం అందాల్సి ఉంటుంది. 3 నెలల ప్లాన్‌ ధర రూ.299గా ఉంది. ఈ సేవలతో ప్రతి ఫుడ్ ఆర్డర్‌పై ఫాస్ట్ డెలివరీ, ఆన్-టైమ్ గ్యారెంటీ, ఇన్‌స్టామార్ట్‌లో ఉచిత డెలివరీలు, డైన్‌అవుట్‌పై ప్రత...

December 12, 2024 / 02:32 PM IST

అంగన్వాడి కేంద్రంలో రాష్ట్ర ఫుడ్ కమిషన్ ఛైర్మన్ తనిఖీ

ATP: ఓబులదేవరచెరువు మండలంలోని గౌనిపల్లి గ్రామంలో ఉన్న అంగన్వాడి కేంద్రాన్ని రాష్ట్ర ఫుడ్ కమిషన్ ఛైర్మన్ విజయ ప్రతాప్ రెడ్డి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అంగనవాడి కేంద్రంలోని రికార్డులను పరిశీలించారు. అనంతరం విద్యార్థులకు అందించే పౌష్టిక ఆహార నాణ్యతను పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ.. చిన్నారులకు సకాలంలో పౌష్టిక ఆహారాన్ని అందజేయాలని ఆదేశించారు.

December 12, 2024 / 01:53 PM IST

మల్లవల్లి పారిశ్రామికవాడలో 30వేల ఉద్యోగాలు

కృష్ణా: మల్లవల్లి పారిశ్రామిక వాడలో 400 కంపెనీలు ప్రారంభించడం ఖాయమని ఎమ్మెల్యే యార్లగడ్డ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆయన గురువారం మీడియాతో మాట్లాడారు. మల్లవల్లి పారిశ్రామిక వాడలో 30 వేల ఉద్యోగాలు వస్తాయని సీఎం చంద్రబాబు అసెంబ్లీ వేదికగా చెప్పారన్నారు. ఎయిర్ పోర్డు, రైల్వే స్టేషన్, బందరు పోర్టుకు దగ్గరలో ఉన్న ఏకైక పారిశ్రామిక వాడ ఇదేనన్నారు.

December 12, 2024 / 01:52 PM IST

‘పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలి’

PLD: పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని రోటరీ క్లబ్ ఆఫ్ మాచర్ల సభ్యులు అన్నారు. గురువారం హరితోత్సవం సందర్భంగా ఎస్‌కేవీఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పట్టణంలోని పలు కళాశాల విద్యార్థులు చేత మొక్కలు నాటించారు. ఈ సందర్భంగా రోటరీ క్లబ్ సభ్యులు మాట్లాడుతూ.. పర్యావరణాన్ని పరిరక్షించేందుకు మొక్కలు నాటి పెంచే బాధ్యత తీసుకోవాలన్నారు. 

December 12, 2024 / 01:49 PM IST

ఢిల్లీలో టెస్లా కార్ల షోరూం!

ప్రముఖ కార్ల తయారీ కంపెనీ టెస్లా త్వరలోనే భారత్‌లో అడుగుపెట్టబోతుంది. ఢిల్లీలో షోరూం ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. షోరూం ఏర్పాటుకు అనువైన స్థలం కోసం ఢిల్లీలోని ప్రముఖ రియల్ ఎస్టేట్ కంపెనీలతో సంప్రదింపులు చేస్తున్నారట. కాగా, భారత్‌లో ఎలాన్ మస్క్ రూ.25వేల కోట్ల పెట్టుబడులు పెట్టబోతున్నారని ఈ ఏడాది ప్రారంభంలో వార్తలు వచ్చాయి.

December 12, 2024 / 01:19 PM IST

ప్రపంచ ధనవంతుల్లో మస్క్ రికార్డ్

టెస్లా అధినేత ఎలాన్ మస్క్ సరికొత్త రికార్డు సృష్టించాడు. వ్యక్తిగత సంపాదనలో తొలిసారిగా 400 బిలియన్ డాలర్ల క్లబ్ లోకి దూసుకుపోయాడు. ప్రపంచంలో ఇప్పటివరకు ఇంత సంపాదించిన వ్యక్తి లేరు. తాజాగా స్పేస్ ఎక్స్ లోని అంతర్గత వాటా విక్రయించడంతో.. ఆయన సంపాదన దాదాపు 50 బిలియన్ డాలర్లు పెరగడంతో.. 439.2 బిలియన్ డాలర్లకు చేరిందని బ్లూమ్ బర్గ్ బిలియనీర్స్ సూచీ ప్రకటించింది.

December 12, 2024 / 12:59 PM IST