• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »క్రీడలు

మళ్లీ టాప్-10 లోకి పీవీ సింధు

గత కొంతకాలంగా ఫామ్ లేమితో సతమతమవుతున్న భారత స్టార్ షట్లర్ పీవీ సింధు ప్రస్తుతం మళ్లీ ఫామ్‌లోకి వచ్చినట్లు కనిపిస్తోంది. ఇండోనేషియా ఓపెన్ తొలి రౌండ్‌లో సింధు విజయం సాధించడంతో, తాజాగా విడుదల చేసిన బ్యాడ్మింటన్ ర్యాంకింగ్స్‌లో టాప్-10లోకి దూసుకొచ్చింది. 2023 అక్టోబర్ తర్వాత ఆమె టాప్-10 లోకి అడుగుపెట్టడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.

June 3, 2026 / 09:30 PM IST

కోహ్లీని గొడవ పడకుండా ఆపాను: రవిశాస్త్రి

మాజీ కోచ్ రవిశాస్త్రి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తన కోచింగ్ కెరీర్‌లో ఒకే ఒక్కసారి కోహ్లీని గొడవ పడకుండా అడ్డుకున్నట్లు తెలిపాడు. ‘2014 బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో మిచెల్ జాన్సన్‌తో కోహ్లీకి వాగ్వాదం జరిగింది. కోహ్లీ డ్రెసింగ్ రూమ్ వైపు వస్తూ.. జాన్సన్‌ను కోపంగా చూస్తూ కనిపించాడు. వెంటనే కోహ్లీని పిలిచి, బ్యాటింగ్‌పై దృష్టి పెట్టాలని చెప్పా’ అని పేర్కొన్నాడు.

June 3, 2026 / 09:15 PM IST

వైభవ్‌ కోసం క్యూ కట్టిన ఫ్యాన్స్

IPLలో దుమ్మురేపిన యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ ప్రస్తుతం బీహార్‌లోని తన ఇంటికి చేరుకున్నాడు. ఈ క్రమంలో వైభవ్‌ను చూడటానికి చుట్టుపక్కల ఊర్ల నుంచి అభిమానులు భారీగా క్యూ కట్టారు. తమ ప్రాంతానికి చెందిన ఆటగాడు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకోవడంతో, అతడితో సెల్ఫీలు, ఆటోగ్రాఫ్‌ల కోసం ఎగబడ్డారు. తనను కలిసేందుకు వచ్చిన అభిమానులందరితో వైభవ్ ఆప్యాయంగా సమయం గడిపాడు.

June 3, 2026 / 08:50 PM IST

కొత్త కెప్టెన్ కోసం బీసీసీఐ కసరత్తు..!

T20ల్లో కొత్త కెప్టెన్ ఎంపిక విషయంలో బీసీసీఐ తీవ్రంగా కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. బ్యాటింగ్‌లో ఘోరంగా విఫలమవుతుండటంతో సూర్యకుమార్‌ను కెప్టెన్సీ నుంచి తప్పించడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. దీంతో T20 కెప్టెన్సీ రేసులో శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్, సంజూ శాంసన్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. అయితే, ఇందులో శ్రేయస్ వైపే సెలక్షన్ కమిటీ మొగ్గు చూపినట్లు సమాచారం.

June 3, 2026 / 08:27 PM IST

సూర్యవంశీ ఎఫెక్ట్.. ట్రై సిరీస్‌కు భారీ క్రేజ్

భారత్, శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్-A జట్ల మధ్య ట్రై సిరీస్ జూన్ 9 నుంచి ప్రారంభం కానుంది. ఈ టోర్నీలో వైభవ్ సూర్యవంశీ కూడా పాల్గొంటుండటంతో టోర్నీకి ఊహించని స్థాయిలో ఆదరణ లభిస్తోంది. దీంతో సోనీ స్పోర్ట్స్ నెట్‌వర్క్ ఈ టోర్నీని ప్రత్యక్ష ప్రసారం చేయాలని నిర్ణయించింది. ఈ విషయాన్ని SM వేదికగా సోనీ వెల్లడించింది. ఈ టోర్నీలో భారత్-A కెప్టెన్‌గా తిలక్ వర్మ వ్యవహరించనున్నాడు.

June 3, 2026 / 07:17 PM IST

సౌరవ్ గంగూలీకి భద్రత తగ్గింపు

టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీకి బెంగాల్ ప్రభుత్వం భద్రతను తగ్గించింది. ఇటీవల జరిగిన సమీక్ష తర్వాత ఆయన సెక్యూరిటీని ‘జెడ్’ కేటగిరీ నుండి ‘వై’ కేటగిరీకి మారుస్తూ కొత్త సర్కారు నిర్ణయం తీసుకుంది. 2023లో పెంచిన భద్రతను ఇప్పుడు మళ్లీ తగ్గించారు. అయితే వీఐపీ ప్రోటోకాల్ ప్రకారం గంగూలీకి అవసరమైన పోలీస్ ప్రొటెక్షన్ మాత్రం కొనసాగుతుంది.

June 3, 2026 / 05:25 PM IST

ఫ్యాన్స్‌కు స్మృతి మంధాన స్పెషల్ రిక్వెస్ట్

మహిళల T20 ప్రపంచ కప్ ఈనెల 12 నుంచి ప్రారంభం కానుంది. ఈ టోర్నీలో భారత్ తన తొలి మ్యాచ్‌లోనే చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో జూన్ 14న తలపడనుంది. ఈ నేపథ్యంలో స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన మాట్లాడుతూ.. కేవలం IND-PAK మ్యాచ్‌కు మాత్రమే కాకుండా, టోర్నీ మొత్తానికి హైప్ తీసుకురావాలని కోరింది. కాగా, భారత్‌తో పాటు గ్రూప్-Aలో AUS, PAK, SA, BAN, నెదర్లాండ్స్ ఉన్నాయి.

June 3, 2026 / 04:51 PM IST

2027 ఐపీఎల్‌కు ప్యాట్ కమిన్స్ దూరం..?

ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ కీలక వ్యాఖ్యలు చేశాడు. వచ్చే ఏడాది యాషెస్ సిరీస్, వన్డే ప్రపంచకప్, WTC ఫైనల్ వంటి మెగా టోర్నీలు ఉన్న నేపథ్యంలో.. ఏదో ఒక దానికి విరామం ఇవ్వక తప్పదని కమిన్స్ చెప్పాడు. అయితే, ODI WC, టెస్టు మ్యాచ్‌లకే తన తొలి ప్రాధాన్యత ఉంటుందని తెలిపాడు. దీంతో 2027లో అతడు IPL ఆడటం అనుమానంగా మారింది.

June 3, 2026 / 03:45 PM IST

టీమిండియా కొత్త కోచ్‌గా ఆశిష్ నెహ్రా?

టీమిండియా టీ20 జట్టుకు కొత్త కోచ్‌ను నియమించబోతున్నారంటూ ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సంజయ్ మంజ్రేకర్ మాట్లాడుతూ.. ఒకవేళ కొత్త కోచ్‌ను తీసుకోవాలనుకుంటే, అందుకు ఆశిష్ నెహ్రా సరైన వ్యక్తని సూచించాడు. నెహ్రా క్రికెట్‌ను చాలా సూక్ష్మంగా అంచనా వేస్తాడన్నాడు. అంతేకాకుండా, GT జట్టును హెడ్‌కోచ్‌గా విజయవంతంగా నడిపించిన అనుభవం కూడా ఉందన్నాడు.

June 3, 2026 / 03:29 PM IST

చరిత్ర సృష్టించిన టీమిండియా కెప్టెన్‌

భారత మహిళా క్రికెట్‌ జట్టు కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్ సరికొత్త చరిత్ర సృష్టించింది. ఇంగ్లండ్‌తో జరిగిన మూడో టీ20లో ఆమె బరిలోకి దిగడం ద్వారా అంతర్జాతీయ క్రికెట్‌లో 368వ మ్యాచ్ పూర్తి చేసుకుంది. తద్వారా అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన మహిళ క్రికెటర్‌గా సుజీ బేట్స్‌(367) రికార్డును హర్మన్ బ్రేక్ చేసింది.

June 3, 2026 / 02:58 PM IST

రిటైర్మెంట్ ప్రకటించిన RCB కోచ్

RCB స్ట్రెంగ్త్ అండ్ కండిషనింగ్ కోచ్ బాసు శంకర్ రిటైర్మెంట్ ప్రకటించాడు. అతడు 8 ఏళ్ల పాటు స్ట్రెంగ్త్ అండ్ కండిషనింగ్ కోచ్‌గా తన సేవలను అందించాడు. ప్లేయర్ల ఫిట్‌నెస్ పెంపొందించడంలో అతడి పాత్ర చాలా కీలకం. గతంలో అతడు భారత క్రికెట్‌లో యో-యో టెస్టును ప్రాచుర్యంలోకి తీసుకువచ్చాడు. కాగా, శంకర్ రిటైర్మెంట్‌పై RCB ఓ భావోద్వేగ పోస్ట్‌ను ‘X’లో షేర్ చేసింది.

June 3, 2026 / 02:32 PM IST

టీమిండియా న్యూజిలాండ్ టూర్ ఖరారు

టీమిండియా అక్టోబర్ 22 నుంచి డిసెంబర్ 1 వరకు 40 రోజులు న్యూజిలాండ్‌లో పర్యటించనుంది. ఇందులో భాగంగా 5 T20లు, 5 ODలు, 2 టెస్టు మ్యాచుల్లో ఇరు జట్లు తలపడనున్నాయి. మొత్తంగా 12 మ్యాచులు జరగనున్నాయి. OCT 22న T20, NOV 4న వన్డే, NOV 19 నుంచి టెస్ట్‌ సిరీస్‌లు ప్రారంభం కానున్నాయి. భారత్‌ చివరిసారిగా 2019-20 సీజన్‌లో న్యూజిలాండ్‌లో పర్యటించింది.

June 3, 2026 / 12:28 PM IST

వైభవ్ సూర్యవంశీపై IIM అధ్యయనం

IPLలో అదరగొట్టిన 15 ఏళ్ల క్రికెట్ సంచలనం వైభవ్ సూర్యవంశీపై IIM ఇండోర్ ప్రత్యేక అధ్యయనం నిర్వహించనుంది. చిన్న వయసులోనే అసాధారణ విజయాలు సాధించే బాల మేధావులపై ఖ్యాతి, ఒత్తిడి ఎలాంటి ప్రభావం చూపుతుందనే అంశంపై ఈ పరిశోధన సాగనుంది. వారి ప్రాక్టీస్, మనస్తత్వం, కోచ్‌లు, తల్లిదండ్రుల సహకారం వంటి విషయాలను పరిశీలిస్తామని IIM డైరెక్టర్ హిమాంశు రాయ్ తెలిపారు.

June 3, 2026 / 09:50 AM IST

వైభవ్‌తో ఎండార్స్‌మెంట్‌.. రూ.2 కోట్లు డిమాండ్!

IPLలో అత్యధిక పరుగులతో సంచలనం సృష్టించిన 15 ఏళ్ల కుర్రాడు వైభవ్ సూర్యవంశీ బ్రాండ్ వాల్యూ విపరీతంగా పెరిగింది. అతను వచ్చే వేలంలోకి వస్తే రూ.20 కోట్లు పలుకుతాడని అంచనా. గతంలో కాంప్లాన్, రెడ్‌బుల్ బ్రాండ్లకు రూ.కోటి చొప్పున తీసుకున్న వైభవ్, ఇప్పుడు ఒక్కో ఎండార్స్‌మెంట్‌కు రూ.1.5-2 కోట్లు డిమాండ్ చేస్తున్నాడట. ప్రస్తుతం అతని తండ్రే ఈ డీల్స్ చూస్తున్నారు.

June 3, 2026 / 07:56 AM IST

ఆఫ్ఘాన్‌ సిరీస్.. కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్?

ఆఫ్ఘానిస్థాన్‌తో జరగబోయే టీ20 సిరీస్‌తో శ్రేయస్ అయ్యర్, భువనేశ్వర్ కుమార్ టీమిండియాలోకి రీఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఈ సిరీస్‌లో కెప్టెన్‌గా శ్రేయస్ వ్యవహరించే అవకాశం ఉండగా.. ఇషాన్‌ కిషన్‌కు వైస్‌ కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించవచ్చని సమాచారం. ఇక యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి ఈ సిరీస్‌లో చోటు దక్కడం ఖాయంగా కనిపిస్తోంది.

June 2, 2026 / 09:55 PM IST