చాలా మందికి చిన్నతనంలోనే కంటి చూపు సమస్యలొస్తున్నాయి. ఎక్కువ స్క్రీన్ టైమ్, లో లైట్లో చదవడం, సరైన ఆహారం తీసుకోకపోవడం వంటివి దీనికి కారణాలు. కంటిచూపు మెరుగుపడాలంటే స్క్రీన్ టైమ్ తగ్గించుకోవడంతో పాటు సహజ కాంతి, మంచి వాతావరణంలో ఆడుకోవడం, సరైన ఆహారం తీసుకోవడం(క్యారెట్, పాలకూర, టమాట, బాదం), కంటి వ్యాయామాలు, రోజూ 8-10hrs నిద్రపోవడం వంటివి పాటించాలని నిపుణులు చెబుతున్నారు.
ఉదయం లేవగానే శరీరం బరువుగా అలసటగా ఉంటే అది ఆరోగ్య సంకేతం కావచ్చు. నిద్రలేమి, డీహైడ్రేషన్, విటమిన్ D లోపం, ఒత్తిడి కారణమై ఉండవచ్చని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా శీతాకాలంలో ఇది ఎక్కువగా కనిపిస్తుందని హెచ్చరించారు. సరిపడా నిద్ర, వ్యాయామం, ఉదయం ఎండలో ఉండటం, గోరువెచ్చని నీరు తాగడం వంటి జాగ్రత్తలు పాటిస్తే ఉపశమనం లభిస్తుంది. అయినా మార్పు లేకపోతే వైద్యుల సలహా తీసుకోవాలి.
వాము నీళ్లతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. గ్యాస్, అజీర్తి, కడుపు ఉబ్బరం, మలబద్ధకం వంటి సమస్యలను తగ్గించి జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. కీళ్ల నొప్పులు, వాపు తగ్గించడంతో పాటు మహిళలకు పీరియడ్స్ సమయంలో వచ్చే కడుపు నొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తుంది. జలుబు, దగ్గు వంటి శ్వాసకోశ సమస్యలను తగ్గిస్తుంది. బరువు తగ్గే అవకాశం ఉంటుంది. గుండె ఆరోగ్యానికి సహాయపడుతుంది.
తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగ వేళ చికెన్ ధరలు ఆకాశాన్నంటాయి. హైదరాబాద్ మార్కెట్లో కిలో లైవ్ బర్డ్ ధర రూ. 183 ఉంది. డ్రెస్డ్ చికెన్ కేజీ ధర రూ. 265, స్కిన్ లెస్ కేజీ ధర రూ.302గా ఉంది. 12 ఎగ్స్ ధర రూ.76గా ఉంది. దాదాపు తెలుగు రాష్ట్రాల్లో ఇవే ధరలు ఉన్నాయి. ప్రాంతాన్ని కేజీ మటన్ ధర రూ. 800 నుంచి రూ. 1200 వరకు ఉంది.
గర్భిణులు నువ్వులు తినకూడదని చెప్పడం ఒక అపోహ మాత్రమేనని వైద్యులు చెప్తున్నారు. నువ్వుల్లో ఉండే కాల్షియం, ఐరన్, ప్రోటీన్లు, గర్భధారణ సమయంలో తల్లికి, బిడ్డకు అవసరమైన పోషకాలను అందిస్తాయి. అందులోని ఫైబర్ కంటెంట్ జీర్ణక్రియకు మేలు చేస్తుంది. అయితే, వాటిని ఎక్కువ కాకుండా మితంగా మాత్రమే ఆహారంలో చేర్చుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
సెలవుల్లో ఎంజాయ్ చేయబోయి గుండెకు ముప్పు తెచ్చుకుంటున్నారా? రోజూ కదలని వారు హాలిడేస్‌లో ఒక్కసారిగా అతిగా శ్రమించడం గుండెపై తీవ్ర ఒత్తిడి పెంచుతుంది. పార్టీలు, మద్యం, జంక్ ఫుడ్, నిద్రలేమి తోడైతే బీపీ పెరిగి సడెన్ హార్ట్ ఎటాక్ వచ్చే అవకాశముంది. రొటీన్ మారడం వల్ల వచ్చే మానసిక ఒత్తిడి కూడా ప్రమాదకరమే. పండగ పూట ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలని డాక్టర్లు సూచిస్తున్నారు.
కొన్ని చిట్కాలతో నోటి అల్సర్లకు చెక్ పెట్టవచ్చు. నోటి అల్సర్ల దగ్గర కొద్దిగా తేనె రాస్తే మంచి ఫలితం ఉంటుంది. తేనెలో చిటికెడు పసుపు కలిపితే బెటర్. లవంగాలు నమిలిన లేదా లవంగాల నూనె సమస్య ఉన్న చోట రాసిన మంచి ఫలితం ఉంటుంది. రోజుకు 4-5సార్లు తులసి ఆకులను నమిలితే సమస్య తగ్గుతుంది. కొద్దిగా కొబ్బరి నూనెను అల్సర్ల దగ్గర రాస్తే ఉపశమనం కలుగుతుంది. పచ్చి కొబ్బరినీళ్లు ఎక్కువగా తాగాలి.
పిలవకుండానే ఎక్కడికైనా వెళ్లడం, అడగకముందే ఎక్కువగా మాట్లాడటం, నమ్మకూడని వారిని గుడ్డిగా నమ్మడం… ఈ మూడు లక్షణాలు ఉన్నవారే ‘మూర్ఖులు’ అని విదురుడు స్పష్టం చేశాడు. ఇలాంటి వారిని సమాజం చాలా చులకనగా చూస్తుంది. నలుగురిలో గౌరవం, విలువ కావాలనుకునేవారు కచ్చితంగా ఈ మూడు అలవాట్లకు దూరంగా ఉండాలి. అప్పుడే వ్యక్తిత్వం నిలబడుతుందని విదురనీతి చెబుతోంది.
సమయం లేదనో, ఇతర కారణాల వల్ల కొంతమంది గబగబా భోజనం చేస్తుంటారు. ఇలా త్వరత్వరగా తినడం వల్ల ఆహారంతో పాటు గాలి కూడా కడుపులోకి వెళ్లి గ్యాస్, అజీర్తి వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అందుకే ఆహారాన్ని నెమ్మదిగా నమిలి తినడం చాలా ముఖ్యం. అలా చేస్తేనే పదార్థం రుచిని ఆస్వాదించడంతో పాటు జీర్ణవ్యవస్థ కూడా చురుగ్గా ఉంటుంది. దీంతో ఆహారం పరిమితి దాటకుండా జాగ్రత్త పడవచ్చు.
కీరదోస తినడం వల్ల శరీరానికి ఎన్నో ప్రయోజనాలుంటాయని నిపుణులు సూచిస్తున్నారు. ఇది తక్కువ క్యాలరీలు కలిగి ఉండి, నీటితో సమృద్ధిగా ఉండటం వల్ల శరీరాన్ని డీహైడ్రేషన్‌కు గురి కాకుండా చేస్తుంది. ఎముకల దృఢత్వాన్ని కాపాడుతుంది. గుండె ఆరోగ్యాన్ని సంరక్షిస్తుంది. క్యాన్సర్ బారిన పడే ప్రమాదాన్ని తగ్గిస్తుంది. రక్తంలో షుగర్ లెవెల్స్‌ను క్రమబద్ధీకరిస్తుంది.
ఒత్తయిన జుట్టు కోసం కొన్ని చిట్కాలు పాటించాలని నిపుణులు చెబుతున్నారు. కోడిగుడ్డులోని తెల్లసొన కుదుళ్లకు పట్టించి అరగంట తర్వాత తలస్నానం చేయాలి. 10గంటలు నీటిలో నానబెట్టిన మెంతులను పేస్ట్‌లా చేసుకుని జుట్టుకు అప్లై చేసి 30-40నిమిషాల తర్వాత కడగాలి. సహజసిద్ధంగా తయారుచేసిన ఉసిరి, శీకాకాయ పొడులను వాడాలి. ఉల్లిరసం, కలబంద, ఆముదం వంటి వాటితో కుదుళ్లను మర్దన చేయాలి.
పరగడుపున కొబ్బరినూనెతో పుక్కిలించడం వల్ల వ్యర్థాలు తొలగిపోతాయి. ఫ్రిజ్‌లో పెట్టిన టీ బ్యాగులను కళ్లపై పెట్టుకోవడం వల్ల ట్యాన్, డార్క్ సర్కిల్స్ తగ్గుతాయి. ఒక టీ స్పూన్ చక్కెర నోట్లో వేసుకుని చప్పరిస్తే ఎక్కిళ్లు తగ్గుతాయి. ఉల్లిగడ్డ రసాన్ని కుదుళ్లకు పట్టించి కాసేపు ఉంచితే చుండ్రు, జుట్టు రాలే సమస్యలు తగ్గుతాయి. దంతాలు పసుపు పచ్చగా ఉన్నవారు రోజుకో యాపిల్ తింటే మంచిది.
నమ్మకూడని వారిని నమ్మడం ఎంత ప్రమాదమో.. మిత్రుడిని అతిగా నమ్మడం కూడా అంతే ప్రమాదమని విదురుడు హెచ్చరించాడు. ఒకవేళ భవిష్యత్తులో ఆ మిత్రుడితో వైరం వస్తే.. మీ రహస్యాలన్నీ బయటపెట్టి, మీ పతనానికి కారణమవుతాడు. అందుకే స్నేహంలో కూడా ఓ కంట కనిపెడుతూ, రహస్యాల విషయంలో ఒక హద్దులో ఉండటమే మంచిది.
ఒక పేద కట్టెలు కొట్టుకునే వ్యక్తి గొడ్డలి పొరపాటున నదిలో పడిపోయింది. నదీ దేవత ప్రత్యక్షమై బంగారు, వెండి గొడ్డళ్లు చూపించినా, అతను తన ఇనుప గొడ్డలే కావాలని నిజాయితీగా చెప్పాడు. అతని నిజాయితీకి మెచ్చిన దేవత మూడు గొడ్డళ్లను బహుమతిగా ఇచ్చింది.నీతి: కష్టకాలంలో కూడా నిజాయితీగా ఉంటే, ఆ దైవమే మనల్ని కాపాడుతుంది.
అత్యంత ఖరీదైన సుగంధ ద్రవ్యాల్లో కుంకుమ పువ్వు ఒకటి. ఇది ఎక్కువగా ఇరాన్, గ్రీస్, మొరాకో, స్పెయిన్, కశ్మీర్, ఇటలీలో ఉత్పత్తి అవుతుంది. కుంకుమపువ్వును వాడటం వల్ల శరీరానికి మేలు కలుగుతుంది. క్యాన్సర్ కణాలను నాశనం చేయడంలో సహాయపడుతుంది. జలుబు, జ్వరం వంటి వాటితో బాధపడే వారికి పాలల్లో కలిపిన కుంకుమపువ్వును నుదిటిపై రాయాలి. ఇలా చేయడం వల్ల ఆయా సమస్యల నుంచి త్వరగా ఉపశమనం కలుగుతుంది.