• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆరోగ్యం

పుచ్చకాయతో ఆరోగ్య ప్రయోజనాలు

పుచ్చకాయ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇందులో సుమారు 92% నీరు ఉండటం వల్ల శరీరాన్ని డీహైడ్రేషన్ నుంచి కాపాడుతుంది. ఇందులోని ‘లైకోపీన్’ రక్తపోటును తగ్గించి, గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. పుచ్చకాయలో ఉండే విటమిన్ A, Cలు చర్మాన్ని కాంతివంతంగా, జుట్టును దృఢంగా మారుస్తాయి. ఇందులోని పీచు పదార్థం వల్ల మలబద్ధకం తగ్గుతుంది. అలాగే ఇది కంటి చూపును మెరుగుపరుస్తుంది.

February 22, 2026 / 01:20 PM IST

వీటిని తీసుకుంటే ఆరోగ్యం మీ సొంతం

పుచ్చకాయ తీసుకుంటే గుండె ఆరోగ్యాన్ని రక్షిస్తుంది. దోసకాయ బీపీని నియంత్రిస్తే, సిట్రస్ పండ్లు రక్తనాళాలను ఆరోగ్యంగా ఉంచుతాయి. బెర్రీలు, టొమాటోలు గుండె రక్షణకు, రక్తపోటు తగ్గింపునకు తోడ్పడతాయి. గుమ్మడి, సొరకాయ వంటి నీటి శాతం అధికంగా ఉండే కూరగాయలు హృదయనాళ ఆరోగ్యానికి అవసరమైన పోషకాలను అందిస్తాయి. వేసవిలో ఇవి శరీరానికి అద్భుతమైన మేలు చేస్తాయి.

February 22, 2026 / 12:30 PM IST

ఎక్కువ రోజులు బతకాలంటే..!

✦ ఫైబర్ ఎక్కువగా ఉండే కూరగాయలు, పండ్లు తినాలి✦ ఒకేసారి ఎక్కువగా కాకుండా ఎక్కువసార్లు తిన్నా సరే కొంచెం కొంచెం తినాలి✦ మజ్జిగ జీర్ణవ్యవస్థలో మంచి బ్యాక్టీరియాను తయారు చేస్తాయి✦ చికెన్, మటన్ బదులు చేపలు ఎక్కువగా తినాలి.✦ చక్కెర, ఉప్పు తగ్గించాలి. ఫలితంగా షుగర్, బీపీలకు దూరంగా ఉంటారు✦ రోజూ కనీసం 30 ని. పాటు వ్యాయామం చేయాలి 

February 22, 2026 / 11:46 AM IST

వేయించిన శనగల్లో పోషకాలెన్నో!

వేయించిన శనగల్లో పుష్కలంగా ప్రొటీన్లు, ఫైబర్ ఉంటాయి. ఇవి జీర్ణక్రియకు సహాయపడి మలబద్ధకాన్ని నివారిస్తాయి. క్యాలరీలు, ఫ్యాట్ తక్కువగా ఉండటంతో బరువు పెరగకుండా దోహదపడతాయి. కండరాలు, ఎముకల పనితీరును మెరుగుపరిచే కాల్షియం, మెగ్నీషియం శనగల్లో లభిస్తుంది. వీటిలో ఉండే విటమిన్-సి, యాంటీ ఆక్సిడెంట్లు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. అందుకే నిత్యం గుప్పెడు నోట్లో వేసుకొని పోషకాలను పొందండి.

February 22, 2026 / 10:40 AM IST

హై ప్రోటీన్ ‘పెసరపప్పు ఇడ్లీలు’

పెసరపప్పు ఇడ్లీలు అధిక ప్రోటీన్, తక్కువ కేలరీలు కలిగిన ఆరోగ్యకరమైన అల్పాహారం. ఇవి సులభంగా జీర్ణమవుతాయి. డయాబెటిస్ ఉన్నవారికి, గుండె ఆరోగ్యానికి చాలా మంచిది. పెసరపప్పులో ఉండే విటమిన్లు, ఖనిజాలు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ఆవిరిపై ఉడికించడం వల్ల ఈ ఇడ్లీలు కడుపుకు తేలికగా ఉంటాయి, త్వరగా జీర్ణమవుతాయి. తక్కువ కొవ్వు, కేలరీలు ఉండటం వల్ల బరువు తగ్గాలనుకునే వారికి ఉత్తమమైన ఆహారం.

February 22, 2026 / 07:56 AM IST

పశ్చిమోత్తానాసనం వల్ల కలిగే లాభాలు

పశ్చిమోత్తానాసనం (కూర్చుని ముందుకు వంగే ఆసనం) వెన్నెముకను సాగదీయడం, ఒత్తిడిని తగ్గిస్తుంది. ఈ ఆసనం పొత్తికడుపు అవయవాలను (కాలేయం, మూత్రపిండాలు, పేగులు) మసాజ్ చేస్తుంది. దీనివల్ల జీర్ణక్రియ మెరుగుపడి, మలబద్ధకం తగ్గుతుంది. క్రమం తప్పకుండా సాధన చేయడం వల్ల నిద్రలేమి సమస్య తగ్గి, మంచి నిద్ర పడుతుంది. వెన్నునొప్పి ఉన్నవారు ఈ ఆసనాన్ని నిపుణుల పర్యవేక్షణలో చేయాలి.

February 22, 2026 / 07:36 AM IST

భోజనం మానేయడం వల్ల బరువు తగ్గుతారా?

కొందరు బరువు తగ్గడానికి మధ్యాహ్న భోజనం లేదా డిన్నర్ మానేస్తుంటారు. అలా చేయడం మంచిది కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. భోజనం స్కిప్ చేయడం వల్ల బరువు తగ్గకపోగా పెరిగే ఛాన్స్ ఉంది. ఎక్కువ సేపు ఆకలితో ఉండటం వల్ల జీర్ణక్రియ నెమ్మదిస్తుంది. శరీరం కొవ్వును బర్న్ చేయడానికి బదులుగా నిల్వ చేస్తుంది. దీనివల్ల తాత్కాలికంగా బరువు తగ్గిన మళ్లీ వేగంగా పెరిగే ఛాన్స్ ఉందని చెప్పారు.

February 21, 2026 / 06:08 PM IST

మణికట్టు నొప్పిని తగ్గించే చిట్కాలు

మౌస్, కీబోర్డ్ నిరంతరం వాడేవారికి మణికట్టు నొప్పి వచ్చే అవకాశం ఉంది. అందుకే ప్రతి గంటకోసారి చేతులను నిటారుగా సాగదీయాలి. మణికట్టును నెమ్మదిగా గుండ్రంగా తిప్పితే బెటర్. పని మధ్యలో చిన్న బ్రేక్స్ తీసుకోవాలి. అరచేతిని గట్టిగా మూసి మళ్లీ పూర్తిగా తెరవాలి. ఇది వేళ్లు, మణికట్టు కండరాలకు బలాన్నిస్తుంది. ఇలా చేయడం వల్ల నరాలు ఒత్తిడికి గురవ్వకుండా మణికట్టు ఆరోగ్యంగా ఉంటుంది.

February 21, 2026 / 04:38 PM IST

నువ్వులతో అద్భుత ప్రయోజనాలు..!

నువ్వుల వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. వీటిలో కాల్షియం పుష్కలంగా ఉండటం వల్ల ఎముకలు దృఢంగా మారుతాయి. కీళ్ల నొప్పులతో బాధపడేవారు వీటిని తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఇవి రక్తహీనతను తగ్గించడమే కాకుండా, శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచి జలుబు, దగ్గు వంటి సమస్యలను నివారిస్తాయి. అలాగే, జీర్ణవ్యవస్థను మెరుగుపరచడంలో, గుండె జబ్బులను నివారించడంలో కీలక పాత్ర పోషిస్తాయి.

February 21, 2026 / 04:25 PM IST

ఖర్జూరాలతో ఆరోగ్య ప్రయోజనాలు

ఖర్జూర పండ్లలో శరీరానికి అవసరమైన విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల రక్తపోటు అదుపులో ఉండటమే కాకుండా గుండె ఆరోగ్యంగా ఉంటుంది. బరువు తగ్గాలనుకునే వారికి ఇవి మంచి ఎంపిక. ఎముకలు, దంతాల ధృఢత్వానికి, తక్షణ శక్తికి ఇవి తోడ్పడతాయి. శరీర రోగనిరోధక శక్తిని పెంచి, జీవక్రియను మెరుగుపరుస్తాయి. ఆరోగ్యకరమైన జీవనశైలికి ఖర్జూరాలు ఎంతో మేలు చేస్తాయి.

February 21, 2026 / 04:08 PM IST

మెరిసే చర్మం కోసం అరటిపండు!

అరటిపండు ఆరోగ్యానికే కాదు, సహజ సౌందర్యానికి అద్భుత ఔషధం. ఇందులో ఉండే విటమిన్ సి, పొటాషియం చర్మాన్ని మృదువుగా మార్చి మెరుపును ఇస్తాయి. బాగా పండిన అరటి గుజ్జును ఫేస్ ప్యాక్‌గా వాడితే ముడతలు, మృతకణాలు తొలగిపోతాయి. ఇది సహజ మాయిశ్చరైజర్‌గా పనిచేస్తూ మొటిమల మచ్చలను తగ్గించి, ముఖాన్ని తాజాగా ఉంచుతుంది.

February 21, 2026 / 03:12 PM IST

తిన్న వెంటనే.. ఇలా చేస్తున్నారా?

భోజనం చేసిన వెంటనే మనం చేసే కొన్ని తప్పులు జీర్ణవ్యవస్థను దెబ్బతీస్తాయి. తిన్న వెంటనే స్నానం చేస్తే రక్తప్రసరణ మారి అజీర్తి కలుగుతుంది. తిన్న వెంటనే నిద్రపోవడం వల్ల గ్యాస్ సమస్యలు వస్తాయి. టీ, కాఫీలు తాగితే పోషకాలు అందవు. అతిగా నీళ్లు తాగడం వల్ల జీర్ణరసాలు పలచబడతాయి. పండ్లు తింటే కడుపు ఉబ్బరం కలుగుతుంది. ధూమపానం చేస్తే తీవ్ర అనారోగ్యం కలుగుతాయి.

February 21, 2026 / 02:13 PM IST

చిన్నారుల్లో అకస్మాత్తు మార్పులు దేనికి సంకేతం?

చిన్నారుల్లో ఎనిమిది ఏళ్లలోపే శీఘ్ర రజస్వల లక్షణాలు కనిపిస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. రొమ్ముల పెరుగుదల, అకస్మాత్తుగా ఎత్తు పెరగడం, ముఖంపై మొటిమలు, శరీర వాసన మారడం వంటివి దీనికి ముఖ్య సంకేతాలు. జంక్ ఫుడ్, జీవనశైలి మార్పులే ఇందుకు ప్రధాన కారణం. పౌష్టికాహారం అందిస్తూ, ఇలాంటి మార్పులు గమనించిన వెంటనే వైద్యులను సంప్రదించాలని నిపుణులు సూచిస్తున్నారు.

February 21, 2026 / 01:42 PM IST

చెప్పులు లేకుండా పిల్లలను నడిపిస్తే..!

చిన్నప్పటి నుంచే పిల్లలను చెప్పులు లేకుండా నేలపై, పచ్చగడ్డిపై నడిపించడం కంటి ఆరోగ్యానికి ఎంతో మేలని నిపుణులు చెబుతున్నారు. ఇలా నడవడం వల్ల పాదాలపై ఒత్తిడి కలిగి కళ్లకు రక్తప్రసరణ మెరుగవుతుంది. పచ్చదనాన్ని చూడటం వల్ల కంటి కండరాలు రిలాక్స్ అవుతాయి. ఈ అలవాటు వల్ల జ్ఞాపకశక్తి, ఆలోచనా సామర్థ్యం పెరగడమే కాకుండా మానసిక ప్రశాంతత, మంచి నిద్ర కూడా లభిస్తాయి.

February 21, 2026 / 12:41 PM IST

మెరిసే చర్మ కోసం 4-2-4 రూల్‌

చర్మ సౌందర్యం కోసం 4-2-4 రూల్ ఒక అద్భుతమైన క్లెన్సింగ్ పద్ధతి అని నిపుణులు చెబుతున్నారు. 4 నిమిషాల పాటు ఆయిల్ క్లెన్సర్‌తో ముఖాన్ని మర్దన చేయాలి. ఇది తేమను అందిస్తుంది. ఆ తర్వాత వాటర్ బేస్డ్ క్లెన్సర్‌తో 2 నిమిషాలు మర్దన చేసి జిడ్డు, మలినాలను తొలగించాలి. అనంతరం ముందుగా 2 నిమిషాలు గోరువెచ్చని నీటితో, తర్వాత 2 నిమిషాలు చల్లటి నీటితో ముఖం కడుక్కోవాలి.

February 21, 2026 / 11:28 AM IST