VSP: ప్రపంచ సైక్లింగ్ దినోత్సవం సందర్భంగా విశాఖ రైల్వే డివిజన్ డీఆర్‌ఎం లలిత్ బోహ్రా ఈ-సైకిల్‌పై బుధవారం తన నివాసం నుంచి డివిజనల్ కార్యాలయానికి చేరుకుని పర్యావరణహిత రవాణాకు ప్రోత్సాహం అందించారు. గ్లోబల్ వార్మింగ్, వాతావరణ మార్పుల సవాళ్లను ఎదుర్కోవాలంటే ప్రతి ఒక్కరూ పర్యావరణ అనుకూల జీవనశైలిని అలవరచుకోవాలని సూచించారు.
BPT: ఆర్కే టౌన్షిప్ జూన్ 3న 1992లో స్థాపించి నేటికీ 34 వసంతాలు పూర్తయింది. ఈ సందర్భంగా.. చీరాల ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య కేక్ కటింగ్ నిర్వహించి హర్షాత్రేఖాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు వివిధ హోదాల్లో ఉన్న నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
ELR: ఈ నెల 5న ఉదయం 10:30 గంటలకు తాడేపల్లిగూడెం మండలం వెంకటరమణ గూడెం ఉద్యానవర్సిటీలో రైతు సదస్సు నిర్వహించనున్నట్లు ఉప కులపతి ధనుంజయరావు తెలిపారు. బుధవారం ఆయన మాట్లాడుతూ.. డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం విలేకరులు సమావేశం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా మంత్రి అచ్చెన్నాయుడు విచ్చేస్తారన్నారు. అలాగే పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారన్నారు.
PLD: విజయవాడ నుంచి అమరావతి వస్తున్న ఆర్టీసీ బస్సు పెద్దమ్మదూరు డౌన్ సమీపంలో ప్రయాణికులు దిగేందుకు ఆపారని, దిగుతున్న సమయంలోనే ముందుకు సాగే సరికి బాలుడు కిందపడి గాయాలయ్యాయని బంధువులు తెలిపారు. బస్సు ఆగకుండా వెళ్తుంటే, బాప్టిస్ట్ చర్చి సమీపంలో వారి బంధువులు అడ్డగించి డ్రైవర్‌ను పిలిచి మందలించారు. ప్రయాణికులు ఎక్కే సమయంలో దిగే సమయంలో గమనించాలని అన్నారు.
PLD: కోటప్పకొండలో నిర్వహిస్తున్న ఏఐవైఎఫ్ రాష్ట్రస్థాయి శిక్షణ తరగతుల్లో సీపీఐ జాతీయ కార్యదర్శి కే. రామకృష్ణ పాల్గొన్నారు. యువత సామాజిక, రాజకీయ అంశాలపై చైతన్యవంతంగా ఉండి ప్రజా సమస్యల పరిష్కారంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. నిరుద్యోగం, యువత సమస్యలపై ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టి సారించాలని కోరుతూ.. యువత పోరాట స్ఫూర్తితో ముందుకు రావాలని సూచించారు.
NLR: స్థానిక సంస్థ ఎన్నికల్లో ప్రతిపక్ష నాయకులు నిలబడడానికి భయపడేలా నాయకులు పనిచేయాలని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి టీడీపీ శ్రేణులకు సూచించారు. బుచ్చి టీడీపీ కార్యాలయంలో జరిగిన సమీక్ష సమావేశంలో ఆమె నాయకులకు దిశా నిర్దేశం చేశారు. అన్ని స్థానాలు ఏకగ్రీవంగా అయ్యేలా చూడాలని సూచించారు. నాయకులందరూ కలిసికట్టుగా పనిచేయాలని చెప్పారు.
సత్యసాయి: పుట్టపర్తి మున్సిపాలిటీ పరిధిలోని వెస్ట్ గేట్, తారకరామ నగర్ ప్రాంతాల్లో సాగుతున్న ఓటర్ మ్యాపింగ్ పురోగతిని కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ బుధవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా బీఎల్ఓ కే.లావణ్యతో మాట్లాడి యాప్‌లో వివరాల నమోదు విధానాన్ని అడిగి తెలుసుకున్నారు. ప్రక్రియను ఎలాంటి తప్పులు లేకుండా వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు.
E.G: గోపాలపురం మండలం కొవ్వూరుపాడు గ్రామంలో వైసీపీ సీనియర్ నాయకుడు వేగివాడ బాబీకి చెందిన పొలంలోని వాటర్ ట్యాంక్ ట్రాక్టర్, గెస్ట్ హౌస్‌కు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. ఈ ఘటనలో లక్షల రూపాయల ఆస్తి నష్టం వాటిల్లింది. ఈ విషయం తెలుసుకున్న మాజీ హోం మంత్రి తానేటి వనిత బుధవారం బాబీతో పాటు ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు.
ASR: అనంతగిరి మండలం కొండిబ పంచాయతీలో 32 జట్లతో నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్ బుధవారం ముగిసింది. ఈ సందర్భంగా స్థానిక ఎస్సై కే. శంకర్రావు విజేతలకు బహుమతులు అందజేశారు. అనంతగిరి జట్టు ప్రథమ స్థానం (రూ.15 వేలు), సాడ జట్టు ద్వితీయ స్థానం (రూ.10 వేలు) సాధించాయి. యువత వ్యసనాలకు దూరంగా ఉండి క్రీడా స్ఫూర్తితో ముందుకు సాగాలని ఎస్సై సూచించారు.
CTR: కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రజలను మోసం చేసిందని పూతలపట్టు వైసీపీ ఇంఛార్జ్ సునీల్ కుమార్ ఆరోపించారు. బంగారుపాళ్యంలో వెన్నుపోటుకు రెండేళ్లు పోస్టర్‌ను బుధవారం ఆయన ఆవిష్కరించారు. ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రభుత్వం ప్రజలను మోసం చేసినట్లు తెలిపారు. చంద్రబాబుకు మోసపూరిత హామీలు ఇవ్వడం అలవాటేనని ఆయన చెప్పారు.
AKP: టీడీపీ నాయకులు, కార్యకర్తలు స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధం కావాలని టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి లాలం కాశీనాయుడు, కోటవురట్ల మండల టీడీపీ అధ్యక్షుడు లింగన్నాయుడు పిలుపునిచ్చారు. జల్లూరులో క్లస్టర్ -1 పరిధిలో పార్టీ శ్రేణులతో బుధవారం సమావేశం నిర్వహించారు. స్థానిక ఎన్నికల్లో అందరూ సమిష్టిగా పనిచేయాలని సూచించారు.
PPM: జియ్యమ్మవలస మండల కేంద్రంలో క్లస్టర్, యూనిట్, బూత్ ఇంఛార్జ్‌ల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఉమ్మడి విజయనగరం జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ డొంకాడ రామకృష్ణ, అరకు పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి దత్తి లక్ష్మణ్‌రావు, మండల పార్టీ అధ్యక్షుడు జోగి భుజంగరావు హాజరయ్యారు. ఇందులో పార్టీ బలోపేతం, క్షేత్రస్థాయి కార్యాచరణపై చర్చించారు.
NLR: దగదర్తి మండలం చెన్నూరు సమీపంలోని కావలి కాలువలో ఈతకు వెళ్లిన ముగ్గురిలో ఒకరు గల్లంతైన సంఘటన బుధవారం చోటుచేసుకుంది. స్థానికుల సమాచారం మేరకు.. ఈత కొట్టేందుకు కాలువలోకి దిగిన ముగ్గురిలో, ఇద్దరు యువకులు సురక్షితంగా బయటపడ్డారు. ఒక యువకుడు గల్లంతయ్యాడు. ఆ యువకుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
కృష్ణా: గుడ్లవల్లేరులో స్వచ్ఛ రథం నిరంతరం తిరుగుతూ ఇంటింటి చెత్త సేకరణ కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహిస్తోంది. గ్రామ ప్రజలు తడి చెత్త, పొడి చెత్తను వేర్వేరుగా విభజించి స్వచ్ఛ రథానికి అందించాలని గ్రామపంచాయతీ అధికారులు సూచించారు. వీధులు పరిశుభ్రంగా ఉండేందుకు ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా చెత్తను రోడ్లపై, కాలువల్లో వేయకుండా స్వచ్ఛ రథానికి అందించాలన్నారు.
NDL: డోన్ పట్టణంలోని YSR కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఈ రోజు వెన్నుపోటుకు రెండేళ్లు అనే పోస్టర్ ఆవిష్కరించారు. మాజీ సీఎం జగన్ పిలుపు మేరకు రాష్ట్రంలో చేపట్టబోతున్న వెన్ను పోటుకు రెండేళ్లు అనే కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌ను డోన్ YSR కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో YSR కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.