తమిళనాడు సీఎం విజయ్‌ను హీరో విజయ్ ఆంటోనీ, దర్శకుడు ఆర్జే బాలాజీ వేర్వేరుగా కలిశారు. ఈ సందర్భంగా తీసుకున్న ఫొటోలను వారు SMలో పంచుకున్నారు. సీఎం విజయ్‌లోని పాజిటివిటీ, ఎనర్జీ ఎంతో స్ఫూర్తిదాయకమని, ఆయన సమాజంలో మంచి మార్పు తీసుకురావాలని ఆంటోనీ ఆకాంక్షించారు. విజయ్‌ను సీఎంగా కలవడం నమ్మశక్యంగా లేదని, ఆయన ప్రేమ, ప్రశాంతత ఎప్పటికీ మారలేదని బాలాజీ అన్నారు.
నందమూరి బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కాంబోలో రాబోతున్న ‘NBK-111’ నుంచి క్రేజీ అప్‌డేట్ వచ్చింది. జూన్ 10న బాలయ్య బర్త్‌డే సందర్భంగా ఈ మూవీ నుంచి ‘ఎక్స్‌ప్లోసివ్ అప్‌డేట్’ ఇవ్వనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ‘నో మోర్ వింటేజ్.. ఓన్లీ న్యూ ఏజ్’ అనే ట్యాగ్‌లైన్‌తో రిలీజ్ చేసిన పోస్టర్ SMలో వైరల్ అవుతోంది. దీంతో నందమూరి ఫ్యాన్స్ ఫుల్ ఖుష...
రామ్ చరణ్ ‘పెద్ది’ ప్రమోషన్స్ పూర్తి కాగానే ఓ చిన్న సర్జరీ చేయించుకోనున్నాడట. ఆ తర్వాత కొద్దిరోజులు విశ్రాంతి తీసుకుని, పూర్తిగా కోలుకున్నాక తన నెక్ట్స్ ప్రాజెక్ట్ ‘RC17’పై ఫోకస్ పెట్టనున్నాడట. సుకుమార్ దర్శకత్వంలో రానున్న ఈ సినిమాపై జూలైలో అధికారిక ప్రకటన రానుందట. ప్రస్తుతం సుకుమార్ ఈ మూవీ ఫైనల్ స్క్రిప్ట్ పనిలో బిజీగా ఉండగా.. దసరా తర్వాత ఇది పట్టాలెక్కనున్నట్లు టాక్.
పెద్ది’ ప్రమోషన్స్‌లో AR రెహమాన్ ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. తెల్లవారుజామున 5:30కే లేచి రెహమాన్ వర్క్ చేయడంపై బుచ్చిబాబు ప్రశంసించగా.. ‘సినిమా ఇండస్ట్రీ ప్రవహించే నీరు లాంటిది, పాత అవార్డులు చూసుకుంటే లాభం లేదు. ఇప్పుడు యూట్యూబ్ ఆడియన్స్ సాంగ్‌లో చిన్న హమ్మింగ్‌ను కూడా అబ్సర్వ్ చేస్తున్నారు, మనమూ అప్‌డేట్ అవ్వాలి’ అని తెలిపారు.
మరాఠీ నటి గిరిజా ఓక్ ఓ పాడ్‌కాస్ట్‌లో బ్లూ శారీలో కనిపించి ‘నేషనల్ క్రష్’గా వైరలయ్యారు. దీనిపై ‘భారత్ భాగ్య విధాత’ మూవీ ప్రమోషన్స్‌లో ఆమె స్పందిస్తూ.. అందం తన ఘనత కాదని, సోషల్ మీడియా ట్రెండ్స్‌కు అర్థం లేదని పేర్కొన్నారు. పక్కనే ఉన్న కంగనా రనౌత్ చమత్కరిస్తూ.. ‘నీ అందంతో మన సినిమాను ప్రమోట్ చెయ్’ అని విజ్ఞప్తి చేశారు.
‘ఉప్పెన’ విడుదల కాకముందే ‘పెద్ది’’కథను సిద్ధం చేసినట్లు దర్శకుడు బుచ్చిబాబు చెప్పాడు. ఈ సినిమాలోని అసలు ట్విస్ట్ రివీల్ కాకుండా ఉండేందుకు, ఏకంగా 50 నిమిషాల ముఖ్యమైన ఫుటేజీని ట్రైలర్ కోసం అస్సలు వాడలేదని తెలిపాడు. అందుకే ట్రైలర్‌లో కథను పూర్తిగా చెప్పలేకపోయామని, అయినా సినిమా ఖచ్చితంగా పెద్ద విజయం సాధిస్తుందనే నమ్మకంతో సరైన దారిలోనే వెళ్తున్నామని అన్నాడు.
బాలీవుడ్ హీరో అజయ్ దేవ్‌గణ్ నటిస్తున్న ‘దృశ్యం 3’ మూవీ షూటింగ్ పూర్తయినట్లు దర్శకుడు అభిషేక్ పాఠక్ తాజాగా ప్రకటించాడు. గత కొన్ని నెలలుగా చిత్ర బృందం ఎంతో కష్టపడి ఈ కథకు ప్రాణం పోసిందని తెలిపాడు. అయితే, హిందీ ప్రేక్షకులకు ఒక బిగ్ సర్‌ప్రైజ్ ఇస్తూ.. ఒరిజినల్ మలయాళ వెర్షన్‌తో పోలిస్తే, ఈ హిందీ చిత్రం ముగింపులో కొన్ని కీలక మార్పులు చేసినట్లు వెల్లడించాడు.
త్రివిక్రమ్ దర్శకత్వంలో నితిన్, సమంత జంటగా నటించిన ‘అఆ’ విడుదలైన నేటికి 10 ఏళ్లు పూర్తయింది. మిక్కీ జె. మేయర్ అద్భుతమైన సంగీతం, త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్, సమంత ‘అనసూయ రామలింగం’ నటన ఈ సినిమాను బ్లాక్‌బస్టర్‌గా నిలిపాయి. సరిగ్గా పదేళ్ల క్రితం (2016 జూన్ 2న) విడుదలైన ఈ చిత్రం, ఇప్పటికీ టీవీల్లో వస్తే ఫ్యామిలీ ఆడియన్స్‌ను కట్టిపడేస్తూనే ఉంది.
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, జానీ కపూర్ జంటగా బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ ‘పెద్ది’. AR రెహమాన్ సంగీతం అందించిన ఈ మూవీ జూన్ 4న గ్రాండ్‌గా విడుదలవుతోంది. తాజాగా విడుదలైన ‘ది జర్ని ఆఫ్ పెద్ది’ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది. అనౌన్స్‌మెంట్ నుంచి షూటింగ్, ప్రమోషన్స్ వరకు సినిమా సృష్టించిన సంచలనాన్ని ఈ వీడియో అద్భుతంగా ఆవిష్కరించింది.
TGలో ‘పెద్ది’ మూవీకి ప్రభుత్వం టికెట్ ధరల పెంపునకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. జూన్ 4న విడుదల కానున్న ఈ మూవీ తొలిరోజు కేవలం ఒకే ఒక్క ప్రీమియర్ షోకు మాత్రమే ఈ అనుమతి లభించిందట. ఈ ప్రీమియర్ షో గరిష్ట టికెట్ ధర రూ.600గా నిర్ణయించినట్లు టాక్. అలాగే, వారం రోజుల వరకు మల్టీప్లెక్స్‌లలో రూ.150, సింగిల్ స్క్రీన్లలో రూ.100 అదనంగా పెంచుకోవడానికి అనుమతి ఇచ్చిందని సమాచారం.
వాల్ పోస్టర్ సినిమాస్ బ్యానర్‌పై సతీష్ జవ్వాజి దర్శకత్వంలో నాని హీరోగా ఓ మూవీ రాబోతుందని వార్తలొస్తున్నాయి. తాజాగా ఈ ప్రచారానికి నిర్మాణ సంస్థ బ్రేక్ వేసింది. ఈ వార్తలు పూర్తిగా అవాస్తవమని, నిరాధారమని కొట్టిపారేసింది. తమ మూవీల అప్‌డేట్స్‌ను కేవలం అధికారిక సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారానే ప్రకటిస్తామని, ఇలాంటి పుకార్లను నమ్మవద్దని ప్రేక్షకులను కోరింది.
బాలీవుడ్, టాలీవుడ్‌ల మధ్య తేడాలపై జాన్వీ కపూర్ మాట్లాడింది. టాలీవుడ్‌లో క్రియేటివిటీకి, పని గంటలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారని తెలిపింది. సౌత్ సెట్స్‌లో ప్రతి సీన్ అద్భుతంగా రావడం కోసం ఎంత సమయమైనా కేటాయిస్తారని పేర్కొంది. అదే హిందీలో XL షీట్లు, డెడ్‌లైన్లకే ప్రాధాన్యత ఉంటుందని, ఈ అతి జాగ్రత్త వల్ల క్రియేటివిటీ తగ్గుతుందని పేర్కొంది.
టాలీవుడ్‌లో దర్శకుడు గుణశేఖర్, మహేష్ బాబుల కాంబోలో వచ్చిన ‘ఒక్కడు’ సంచలన విజయం సాధించింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో గుణశేఖర్ ‘ఒక్కడు’పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘ఒక్కడు కథను మహేష్ బాబును మనసులో పెట్టుకుని రాసి ఉంటే.. అది మరో ‘సైనికుడు’ అయ్యేది’ అని ఆయన అన్నాడు. ‘సైనికుడు’ పరాజయం నేపథ్యంలో గుణశేఖర్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీ...
నిఖిల్ నటిస్తున్న హిస్టారికల్ మూవీ ‘స్వయంభూ’. ఇందులో కృష్ణన్ రామన్ పాత్ర కోసం ఆయన ప్రాణం పెట్టి పనిచేశాడు. ఈ పాత్ర కోసం నిఖిల్ ఏకంగా 45 రోజుల పాటు కత్తిసాము, కర్రసాము, విలువిద్య, మార్షల్ ఆర్ట్స్‌లో కఠోర శిక్షణ తీసుకున్నాడు. ప్రాక్టీస్ సమయంలో గాయాలైనా వెనకడుగు వేయకుండా శ్రమించాడు.
పవన్ కళ్యాణ్‌పై నిర్మాత బండ్ల గణేష్ ఒక ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు. ‘మీరంటే నాకిష్టం ఎంతంటే… గుండె కొట్టుకోవడం ఆగిపోవచ్చు, కానీ మీ మీదున్న అభిమానం మాత్రం ఆగదు. నా పేరు మరిచినా మిమ్మల్ని మరువను. మీరంటే చచ్చేంత ఇష్టం కాదు… చచ్చాక కూడా గుండెల్లో నిలిచే ఇష్టం’ అంటూ పవన్‌పై తనకున్న ప్రేమను భావోద్వేగంగా పంచుకున్నాడు.