హైదరాబాద్: 28°C
వార్తలు

నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం

AKP: పాయకరావుపేట పట్టణంలో ఇవాళ (మంగళవారం) విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని ఈఈ రామకృష్ణ తెలిపారు. రోడ్డు విస్తరణ పనులు చేపడుతున్న కారణంగా ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు విద్యుత్ సరఫరాను నిలిపివేస్తున్నట్లు తెలిపారు. స్థానిక మెయిన్ రోడ్డు, బృందావనం, పండరీపురం, కురుమల లేఅవుట్, రాజు గారి బీడు, న్యూ కాలనీ ఏరియాకు విద్యుత్ సరఫరా ఉండదన్నారు.