• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »సినిమా

నటుడు శివాజీపై గాయత్రి గుప్తా ఫైర్

టాలీవుడ్ యాక్ట్రెస్ గాయత్రి గుప్తా సంచలన వ్యాఖ్యలు చేసింది. ‘నేను చీర కట్టుకోవాలా వద్దా అనేది నా ఇష్టం. శివాజీ అన్నారని నేను చీర కట్టుకోను. నాకు ఏది కంఫర్టబుల్‌గా ఉంటే అదే వేసుకుంటా. పచ్చకామెర్లోడికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుంది. చూసే చూపులో లోపం పెట్టుకుని ఎదుటివారిని విమర్శించొద్దు’ అంటూ సమాధానం ఇచ్చింది. ఆమె వ్యాఖ్యలపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

April 29, 2026 / 12:16 PM IST

మరోసారి యష్ ‘టాక్సిక్’ రిలీజ్ వాయిదా

కన్నడ స్టార్ హీరో యష్ భారీ చిత్రం ‘టాక్సిక్’ విడుదల వాయిదా పడింది. ముందుగా ప్రకటించినట్లుగా జూన్ 4న విడుదల చేయలేకపోతున్నామని యష్ ప్రకటించాడు. ‘క్వాలిటీ విషయంలో రాజీ పడకుండా బెస్ట్ అవుట్‌పుట్ ఇచ్చేందుకు కృషి చేస్తున్నాం. అనివార్య కారణాల వల్ల వాయిదా వేస్తున్నాం’ అని చెప్పాడు. గీతూ మోహన్ దాస్ తెరకెక్కిస్తున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ రిలీజ్ తేదీని త్వరలో ప్రకటించనున్నారు.

April 29, 2026 / 12:09 PM IST

వెంకీ ‘ఆదర్శ కుటుంబం’లో వీరమల్లు బ్యూటీ

విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబోలో వస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఆదర్శ కుటుంబం’. ఈ సినిమాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘హరిహర వీరమల్లు’లో నటించిన పూజిత పొన్నాడ కీలక పాత్రలో కనిపించబోతుందట. కేవలం సోలో రోల్ మాత్రమే కాకుండా.. ఈ చిత్రంలో మరో ఇంట్రెస్టింగ్ యాక్టర్ నారా రోహిత్‌కు జోడీగా పూజిత కనిపించనుందని టాక్. ఈ సినిమా పూజితకు పెద్ద ప్లస్ అయ్యేలా ఉంది.

April 29, 2026 / 11:08 AM IST

ఓటీటీలోకి ‘డెకాయిట్’.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్!

టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో అడివి శేష్, మృణాల్ ఠాకూర్ కలిసి నటించిన క్రేజీ యాక్షన్ లవ్ స్టోరీ మూవీ ‘డెకాయిట్’. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులను భారీ ధరకు సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. తాజా సమాచారం ప్రకారం.. ఈ చిత్రం మే 8 నుంచి పాన్ ఇండియా భాషల్లో స్ట్రీమ్ కాబోతుంది. దీనిపై అధికారికంగా అనౌన్స్‌మెంట్ రావాల్సి ఉంది.

April 29, 2026 / 10:53 AM IST

నేడు హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పెళ్లి

టాలీవుడ్ నటుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కావ్య రెడ్డిల వివాహం తిరుమలలో ఇరుకుటుంబ సభ్యుల సమక్షంలో ఇవాళ జరగనుంది. సినీ ప్రముఖుల కోసం మే 1న హైదరాబాద్‌లో భారీ ఎత్తున రిసెప్షన్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. కాగా ఇప్పటికే శ్రీనివాస్ తన కుటుంబ సభ్యులతో కలిసి సినీ, రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖులను ఆహ్వానించిన విషయం తెలిసిందే.

April 29, 2026 / 10:13 AM IST

అషురెడ్డి కేసు.. కొనసాగుతున్న విచారణ

TG: బిగ్‌బాస్ ఫేమ్, నటి అషురెడ్డి కేసులో విచారణ కొనసాగుతోంది. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ధర్మేంద్ర 3 రోజుల్లో లండన్ నుంచి HYDకు రానున్నారు. అయితే, అషురెడ్డి ఆడియోపై పోలీసులు ఫోకస్ పెట్టారు. బెదిరింపులకు పాల్పడినందుకు గానూ ఆమెపై మరో సెక్షన్ నమోదు చేశారు. ఇవాళ పోలీసుల ముందుకు ధర్మేంద్ర తండ్రి సత్యనారాయణ రానున్నారు. అయితే, అషురెడ్డి రూ.9.35 కోట్లు తీసుకుందని ఫిర్యాదు చేశారు.

April 29, 2026 / 09:40 AM IST

నిధి అగర్వాల్‌కు నెలకయ్యే ఖర్చు ఎంతంటే?

నిధి అగర్వాల్‌ పాన్‌ ఇండియా కథానాయకిగా రాణిస్తోంది. ఓ ఇంటర్వ్యూలో ఆమె తన నెలవారి ఖర్చుల గురించి ప్రస్తావించింది. ‘నా నెల ఖర్చు రూ. 5 లక్షలు. నా ట్రావెలింగ్, బస, డైట్, జిమ్ ట్రైనర్, పార్లర్‌ ఖర్చులకే రూ. 5 లక్షలు అవుతుంది. ఇవి కాకుండా మేకప్, హెయిర్‌స్టైలింగ్, ఫోటోస్‌ వంటి ఖర్చులు వేరు’ పేర్కొంది.

April 29, 2026 / 07:58 AM IST

‘పెద్ది’లో స్పెషల్ సాంగ్‌.. శ్రుతి భారీ రెమ్యునరేషన్?

రామ్ చరణ్ ‘పెద్ది’ సినిమాలో స్పెషల్ సాంగ్ చేస్తున్న శ్రుతి హాసన్ దాదాపు రూ.3.5 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు టాక్. జానీ మాస్టర్ కొరియోగ్రఫీలో తెరకెక్కుతున్న ఈ పాట షూటింగ్ మరో రెండు రోజుల్లో పూర్తికానుందని తెలుస్తోంది. హైదరాబాద్ శివార్లలో ఏర్పాటు చేసిన ఓ భారీ సెట్‌లో ప్రస్తుతం షూటింగ్ జరుగుతోంది. కాగా, ఈ మూవీ జూన్ 25న విడుదల కానున్న విషయం తెలిసిందే.

April 29, 2026 / 07:25 AM IST

ఏప్రిల్ 29: టీవీలలో సినిమాలు

స్టార్ మా: అర్జున్ రెడ్డి(9AM), బాక్(4PM); జీతెలుగు: కలిసుందాం రా!(9AM), ఘర్షణ(4:30PM); ఈటీవీ: ఎగిరే పావురమా(9AM); స్టార్‌మా మూవీస్: ప్రిన్స్(7AM), రౌడీ(9AM), S/O సత్యమూర్తి(12PM), పోలీసోడు(3PM), టిల్లు స్క్వేర్(6PM), రంగస్థలం(9PM); జీ సినిమాలు: ధీరుడు(7AM), గోదావరి(9AM), శివాజీ(12PM), రాక్షసి(3PM), నాపేరు సూర్య(6PM), చిరుత(9PM).

April 29, 2026 / 03:20 AM IST

‘ఖల్ నాయక్’ సీక్వెల్‌కు కొత్త డైరెక్టర్

బాలీవుడ్‌ సూపర్ హిట్ చిత్రం ‘ఖల్‌ నాయక్’ (1993) సీక్వెల్‌గా ‘ఖల్ నాయక్ రిటర్న్స్’ తెరకెక్కబోతోంది. అయితే, మొదటి భాగానికి దర్శకత్వం వహించిన సుభాష్‌ ఘాయ్‌ (81 ఏళ్లు), ఈ సీక్వెల్‌కు తాను దర్శకత్వం వహించడం లేదని స్పష్టం చేశాడు. దీంతో ఈ భారీ ప్రాజెక్టును తెరకెక్కించే బాధ్యతను ఏ దర్శకుడు చేపడతారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

April 28, 2026 / 09:13 PM IST

రామ్ చరణ్ స్థానంలోకి ధనుష్..!

రామ్ చరణ్ హీరోగా, సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో ఒక చిత్రం తెరకెక్కబోతున్నట్లు ప్రచారం జరిగింది. అయితే, తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రంలో చరణ్ స్థానంలో కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్‌ను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. కొన్ని అనివార్య కారణాల వల్ల చరణ్ ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఒక పౌరాణిక గాథను విజువల్ వండర్‌గా ఈ చిత్రంలో ఆవిష్కరించబోతున్నారు.

April 28, 2026 / 08:37 PM IST

‘పెద్ది’ స్పెషల్ సాంగ్ విజువల్స్ లీక్

రామ్ చరణ్, జాన్వీ కపూర్ జంటగా దర్శకుడు బుచ్చిబాబు తెరకెక్కిస్తున్న చిత్రం ‘పెద్ది’. ప్రస్తుతం ఈ సినిమా ఆఖరి షెడ్యూల్ జరుపుకుంటోంది. తాజాగా ఈ స్పెషల్ సాంగ్ చిత్రీకరణ హైదరాబాద్‌లో జరుగుతుండగా, దానికి సంబంధించిన కొన్ని విజువల్స్ లీక్ అయ్యాయి. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, శృతి హాసన్ డాన్స్ రిహార్సల్స్ చేస్తున్న ఈ వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి.

April 28, 2026 / 07:16 PM IST

‘ఆదర్శ కుటుంబం’ షూటింగ్ అప్‌డేట్

వెంకటేష్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం ‘ఆదర్శ కుటుంబం’. తాజాగా ఈ సినిమా షూటింగ్ అప్‌డేట్ వచ్చింది. మలక్‌పేట మెట్రో స్టేషన్‌లో కీలకమైన ఫైట్ సీక్వెన్స్‌ను పూర్తి చేసుకున్నట్లు చిత్ర బృందం తెలిపింది. కామెడీ-యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ సినిమా.. ఈ ఏడాది ఆగస్టు లేదా అక్టోబర్‌లో విడుదల కానుంది.

April 28, 2026 / 06:44 PM IST

బాక్సాఫీస్ వద్ద ‘మైఖేల్’ సునామీ

పాప్ లెజెండ్ మైఖేల్ జాక్సన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన బయోపిక్ ‘మైఖేల్’ బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా విడుదలైన కేవలం నాలుగు రోజుల్లోనే ఈ చిత్రం రూ. 2,000 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. మైఖేల్ జాక్సన్ మేనల్లుడు జాఫర్ జాక్సన్‌ను తెరపై చూస్తుంటే సాక్షాత్తు మైఖేల్ జాక్సనే మళ్లీ తిరిగి వచ్చాడా అన్నట్లుగా ఉందంటూ ప్రశంసల వర్షం కురుస్తోంది.

April 28, 2026 / 06:22 PM IST

రజినీకాంత్‌ సినిమాలో బసిల్‌ జోసెఫ్‌?

కమల్ హాసన్ నిర్మాణంలో రజినీకాంత్, ‘డాన్’ ఫేమ్ సిబి చక్రవర్తి కాంబోలో ‘తలైవార్ 173’ సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. ఈ మూవీలో మలయాళ నటుడు బసిల్ జోసెఫ్ కీలక పాత్ర పోషించనున్నట్లు టాక్. ఇటీవల ఒక వేడుకలో త్వరలోనే ఓ పెద్ద తమిళ ప్రాజెక్ట్ గురించి ప్రకటిస్తానని బసిల్ చెప్పడంతో, అది రజినీ సినిమానే అని ఫ్యాన్స్ ఫిక్స్ అయ్యారు. ఇందులో ఆయన రజినీకి కుమారుడిగా కనిపిస్తారని సమాచారం.

April 28, 2026 / 05:38 PM IST