OpenAI సంస్థ ChatGPT అట్లాస్ అనే కొత్త వెబ్ బ్రౌజర్‌ను తీసుకొచ్చింది. గూగూల్ క్రోమ్, యాపిల్ సఫారీలకు పోటీగా తీసుకొచ్చిన ఈ బ్రౌజర్ యూజర్ల సెర్చ్ హిస్టరీని బట్టి పర్సనలైజ్ అయిపోతుంది. ఇంకా వెబ్సైట్ సర్ఫింగ్ చేస్తున్నప్పుడే ‘Ask ChatGPT’పై క్లిక్ చేసి ఏం కావాలో అడిగే అవకాశమిస్తుంది. ప్రస్తుతం మ్యాక్ ఆపరేటింగ్ సిస్టమ్స్‌లో అందుబాటులో ఉంది.
భారత మార్కెట్లో జపనీస్ వాహన తయారీ కంపెనీ 2026 వెర్షన్ వెర్సిస్ 1100 కొత్త బైకును లాంచ్ చేసింది. దీని ధర రూ.19.79 లక్షలు (ఎక్స్‌షోరూమ్). ఈ అడ్వెంచర్ టూరర్ ఫిబ్రవరి 2025లో భారత్‌లో తొలిసారిగా వెర్సిస్ 1000 స్థానంలో లాంచ్ అయింది. ఇందులోని 1099 సీసీ లిక్విడ్-కూల్డ్, ఇన్-లైన్ ఫోర్ ఇంజన్.. 133 హెచ్‌పీ పవర్, 112 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.
TCS సహా ఇతర టెక్ సంస్థలు ఉద్యోగులను తొలగిస్తున్న తరుణంలో ఇన్ఫోసిస్ నియామకాల్లో కొత్త పద్ధతిని అమలు చేస్తోంది. ప్రతిభావంతుల కోసం వెతికే బాధ్యతను ఉద్యోగులకే అప్పగించింది. ఉద్యోగులు సిఫార్సు చేసే అభ్యర్థులను ఎంపిక చేసి, వారికి జాబ్ ఇవ్వాలని నిర్ణయించింది. సిఫార్సు చేసిన ఉద్యోగులకు ప్రోత్సాహకాలను (Incentives) కూడా అందించనున్నట్లు సమాచారం.
ఆసియాలోనే అతిపెద్ద టెలికాం, మీడియా, టెక్నాలజీ ఈవెంట్ ‘ఇండియా మొబైల్ కాంగ్రెస్ 2025’ 9వ ఎడిషన్ ప్రారంభమైంది. ఢిల్లీలోని యశోభూమి కన్వెన్షన్ సెంటర్లో ప్రధాని మోదీ ఈ ఈవెంట్‌ను ప్రారంభించారు. టెలీకమ్యూనికేషన్ల విభాగం(DoT),సెల్యూలర్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(COAI) సంయుక్త ఆధ్వర్యంలో ‘మార్పు దిశగా ఆవిష్కరణలు’ అనే థీమ్‌తో నిర్వహిస్తున్నారు.
ఇప్పటివరకు ఏదైనా అంశం గురించి తెలుసుకోవాలంటే వికీపీడియా సైట్‌పై ఎక్కువగా ఆధారపడతుంటాం. కానీ వికిపీడియాకు చెక్ పెట్టేందుకు ‘X’ అధినేత ఎలాన్ మస్క్ కొత్త ప్లాట్‌ఫామ్‌ను తీసుకొచ్చేందుకు సిద్ధమయ్యారు. దానికి ‘గ్రోకీపీడియా’ అనే నామకారణం కూడా చేశారు. దీని బీటా వెర్షన్ మరో రెండు వారాల్లో యూజర్లకు అందుబాటులోకి వస్తుందని ‘X’ వేదికగా ప్రకటించారు.
HYDకు చెందిన ఈక్వల్ సంస్థ అసిస్టెంట్ ‘ఈక్వల్ AI’ని అభివృద్ధి చేసింది. ఇది అపరిచిత, టెలిమార్కెటింగ్ కాల్స్‌ను నిరోధించి, వాటికి సమాధానం ఇస్తుంది. ఈక్వల్ AI మీ తరఫున కాల్ స్వీకరించి.. కాలర్‌ను, కాల్ అవసరాన్ని గుర్తించేందుకు మాట్లాడి.. ఆపైన కాల్‌ను కనెక్ట్ చేస్తుంది, మెసేజ్‌ను నోట్ చేసుకుంటుంది.
సైబర్ నేరాల కట్టడికి కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ (DoT) ‘TAF-COP’ వెబ్‌సైట్‌ను ప్రారంభించింది. ఈ సైట్ ద్వారా మీ పేరుపై ఉన్న మొబైల్ కనెక్షన్ల వివరాలు తెలుసుకోవచ్చు. వెబ్సైట్లో మీ నంబర్, ఓటీపీ ఎంటర్ చేస్తే మీ పేరు మీద ఎన్ని కనెక్షన్లు ఉన్నాయో చూపిస్తుంది. మీరు ఉపయోగించని నంబర్ ఉంటే, పక్కనే ‘Not My Number’ పై క్లిక్ చేసి ఫిర్యాదు చేయొచ్చు.
ప్రధాని మోదీ స్వదేశీ SM ప్లాట్‌ఫామ్‌లను ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు. దీంతో తమిళనాడుకు చెందిన ‘అరట్టై(Arattai)’ మెసేజింగ్ యాప్ ట్రెండింగ్‌లో నిలిచింది. ‘అరట్టై’ అంటే ‘సాధారణ చాట్’ అని అర్థం. ఈ యాప్‌కు రోజుకు 3 లక్షల మంది కొత్త యూజర్లు వస్తున్నారు. భవిష్యత్తులో ఈ స్వదేశీ యాప్ WhatsAppకు గట్టి పోటీ ఇస్తుందని టెక్ నిపుణులు భావిస్తున్నారు.
ప్రధాని మోదీ స్వదేశీ SM ప్లాట్‌ఫామ్‌లను ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు. దీంతో తమిళనాడుకు చెందిన ‘అరట్టై(Arattai)’ మెసేజింగ్ యాప్ ట్రెండింగ్‌లో నిలిచింది. ‘అరట్టై’ అంటే ‘సాధారణ చాట్’ అని అర్థం. ఈ యాప్‌కు రోజుకు 3 లక్షల మంది కొత్త యూజర్లు వస్తున్నారు. భవిష్యత్తులో ఈ స్వదేశీ యాప్ WhatsAppకు గట్టి పోటీ ఇస్తుందని టెక్ నిపుణులు భావిస్తున్నారు.
దసరా పండగ సీజన్‌ను దృష్టిలో పెట్టుకొని ఓలా ఎలక్ట్రిక్ ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది. నవరాత్రుల సందర్భంగా ఓలా మూరత్ మహోత్సవ్ కింద ఎస్1 స్కూటర్లు, రోడ్‌స్టర్ ఎక్స్ మోటర్‌సైకిళ్ల ప్రారంభ ధరను రూ.49,999గా నిర్ణయించింది. ఈ తొమ్మిది రోజులపాటు ఈ ధరలు అందుబాటులో ఉంటాయని కంపెనీ పేర్కొంది.
ఎలక్ట్రిక్ కార్లను మార్కెట్లోకి అందుబాటు ధరలో తీసుకురావాలనే లక్ష్యంతో ఫోక్స్‌వ్యాగన్ కొత్త ఎలక్ట్రిక్ కాంపాక్ట్ SUV ‘ఐడీ. క్రాస్’ నమూనాను ఆవిష్కరించింది. అంతర్జాతీయంగా ఈ కారును 2026 వేసవిలో విడుదల చేసే అవకాశం ఉంది. దీని ధర సుమారు రూ.25-27Lగా ఉండవచ్చని అంచనా. చైనా కంపెనీల నుంచి వస్తున్న పోటీని ఎదుర్కోవడానికి ఈ మోడల్ సహాయపడుతుందని ఫోక్స్‌వ్యాగన్ భావిస్తోంది.
అపర కుబేరుడు ఎలాన్ మస్క్ భారత్‌లో జూలై 15 నుంచి తన టెస్లా కార్ల అమ్మకాలను ప్రారంభించారు. Y మోడల్ కార్లకు 600 ఆర్డర్లు వచ్చినట్లు బ్లూమ్‌బెర్గ్ నివేదించింది. ఈ మోడల్ ఈవీ ధర రూ.59 లక్షల నుంచి రూ.68 లక్షల వరకు ఉంది. కేవలం రూ.30 లక్షల నుంచి రూ.40 లక్షల లోపే భారత కంపెనీలు హైఎండ్ ఈవీ అందిస్తున్నాయి. దీంతో వినియోగదారులు టెస్లా వైపు ఆసక్తి కనబర్చడం లేదని తెలుస్తోంది.
భారత మార్కెట్లో గుర్తింపు పొందిన రెనాల్ట్ కార్ల కంపెనీ కొత్త సంవత్సరంలో బంపర్ ఆఫర్ ప్రకటించింది. తమ వాహనాలపై 3 సంవత్సరాలు లేదా లక్ష కిలోమీటర్ల వారంటీ ప్లాన్ తీసుకొచ్చింది. కస్టమర్లు తమ వారంటీని 4, 5, 6 లేదా ఏడేళ్లపాటు పొడిగించుకోవచ్చు. ఇది లక్ష కి.మీ., 1.20, 1.40 కి.మీ. లేదా అపరిమిత కిలోమీటర్ల వరకు అందుబాటులో ఉంటుంది. క్విడ్, కైగర్, ట్రైబర్ మోడళ్లను విక్రయిస్తోంది.
ప్రైవేట్ టెలికాం దిగ్గజం ఎయిర్టెల్ సేవల్లో ఇవాళ అంతరాయం ఏర్పడింది. సాంకేతిక కారణాలతో AIRTEL మొబైల్, ఎయిర్టెల్ బ్రాడ్ బ్యాండ్ సేవలు దేశవ్యాప్తంగా నిలిచిపోయాయి. దీంతో వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సోషల్ మీడియా వేదికగా తమ అసహనాన్ని వెళ్లగక్కారు. గుజరాత్లో వినియోగదారులు ఎక్కువగా ప్రభావితం అయినట్లు తెలుస్తోంది. మరి మీక్కూడా అంతరాయం ఏర్పడిందా..?