KTM ఇండియా RC 160 బైక్‌లో ‘ఎలక్ట్రానిక్ ఆరెంజ్ మ్యాట్’, ‘సిరామిక్ వైట్ మ్యాట్’ అనే రెండు కొత్త రంగులను ప్రవేశపెట్టింది. పాత ధర రూ.1.85 లక్షలకే ఇవి లభిస్తాయి. 164.2cc ఇంజన్, ఆల్-ఎల్ఈడీ లైటింగ్, ఎల్‌సీడీ క్లస్టర్ వంటి ఫీచర్లలో ఎలాంటి మార్పు లేదు. యమహా R15 తో పోటీ పడుతున్న ఈ బైక్, దానికంటే సుమారు రూ.19,000 ఎక్కువ ధరకు అందుబాటులో ఉంది.
ఏప్రిల్ 1 నుంచి పెట్రోల్‌కు కనీసం 95 ఆక్టేన్ (RON) రేటింగ్ ఉండాలని కేంద్రం తప్పనిసరి చేసింది. 20% ఇథనాల్ బ్లెండింగ్ (E20) వల్ల ఇంధన నాణ్యత మెరుగుపడనుంది. ఇథనాల్ కలపడం వల్ల పెట్రోల్ ఆక్టేన్ స్థాయి 91-92 నుంచి 97-98 వరకు పెరుగుతుందని చమురు సంస్థలు తెలిపాయి. దీనివల్ల వాహన ఇంజన్ల పనితీరు మెరుగుపడటంతో పాటు పర్యావరణ కాలుష్యం కూడా తగ్గే అవకాశం ఉంది.
బజాజ్ ఆటో ఎండి రాజీవ్ బజాజ్ ట్రయంఫ్ 350cc బైక్‌లను ఏప్రిల్‌లో లాంచ్ చేయనున్నట్లు ధృవీకరించారు. ప్రస్తుత 400cc ఇంజిన్‌ను తగ్గించి ఈ కొత్త వెర్షన్ రూపొందిస్తున్నారు. దీనివల్ల 40% నుంచి 18% వరకు జీఎస్టీ తగ్గి, ధరలు మరింత పోటీగా ఉండనున్నాయి. ఇదే వ్యూహాన్ని KTM, Dominor మోడళ్లలోనూ అనుసరించే అవకాశం ఉంది. తక్కువ ధరలో ప్రీమియం బైక్ కోరుకునే వారికి ఇది గుడ్ న్యూస్.
మార్చిలో భారత ఆటోమొబైల్ రంగం కొత్త మోడళ్లతో కళకళలాడనుంది. రెనాల్ట్ డస్టర్(మార్చి 17) రీ-ఎంట్రీ ఇస్తుండగా, లగ్జరీ విభాగంలో మెర్సిడెస్ V-క్లాస్(మార్చి 2), ఆడి SQ8 పవర్ ప్యాక్డ్ పర్ఫార్మెన్స్‌తో వస్తున్నాయి. వీటితో పాటు స్కోడా కుషాక్ ఫేస్‌లిఫ్ట్, టొయోటా ఎబెల్లా EV SUVలు మార్కెట్లోకి వస్తాయి. బడ్జెట్ నుంచి లగ్జరీ వరకు కస్టమర్లకు భారీ ఆప్షన్లు అందుబాటులో ఉండనున్నాయి.
TG: రాష్ట్రంలో వాహన కొనుగోలుదారులకు అదనపు భారం పడనుంది. ప్రభుత్వం మార్చి 1 నుంచి రోడ్డు భద్రత సెస్ అమలు చేయాలని నిర్ణయించింది. ట్రాఫిక్ నిర్వహణ వ్యవస్థలను బలోపేతం చేయడం, రాష్ట్రవ్యాప్తంగా ప్రమాద నివారణ మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకుంది. మోటారు వాహనాల చట్టం యాక్ట్ 1963కు సవరణలు చేసిన నేపథ్యంలో ఈ కొత్త సెస్ అమల్లోకి రానుంది.
ప్రముఖ ఎలక్ట్రానిక్ సంస్థ శాంసంగ్ S26 సిరీస్ ఫోన్లను విడుదల చేసింది. గెలాక్సీ S26 అల్ట్రాతో పాటు S26, S26+ మోడళ్లను తీసుకొచ్చింది. గెలాక్సీ S26 అల్ట్రా స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జన్5, 5000mAH బ్యాటరీ వంటి ఫీచర్లు ఉన్నాయి. S26 అల్ట్రా (12GB+256GB వేరియంట్) ప్రారంభ ధర రూ.1,39,999, 12GB+512GB వేరియంట్ ధర రూ.1,59,999, 16GB+1TB వేరియంట్ ధర రూ.1,89,999గా నిర్ణయించారు.
ప్రముఖ కార్ల తయారీ సంస్థలు హ్యుందాయ్, కియా, BMW కొరియా భారీ రీకాల్ ప్రకటించాయి. తయారీ లోపాల కారణంగా అగ్నిప్రమాదాలు జరిగే అవకాశం ఉండటంతో 37 మోడళ్లకు చెందిన 1,07,158 వాహనాలను స్వచ్ఛందంగా రీకాల్ చేస్తున్నట్లు దక్షిణ కొరియా రవాణా మంత్రిత్వ శాఖ వెల్లడించింది. హ్యుందాయ్ 37,690, కియా 1,590, BMW కొరియా సంస్థ 520i, 320i సహా 32 మోడళ్లకు చెందిన 67,878 కార్లను రీకాల్ చేస్తోంది.
రాయల్ ఎన్‌ఫీల్డ్ దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా క్లాసిక్, రెట్రో స్టైల్ మోటార్‌సైకిళ్లకు ప్రసిద్ధి చెందిన ఐకానిక్ బ్రాండ్. ఈ కంపెనీ ఎలక్ట్రిక్ రంగంలోకి అడుగుపెట్టింది. తొలి ఈవీ సబ్ బ్రాండ్ Flying Flea. మొదటి మోడల్ Flying Flea C6.. 2026 మొదటి త్రైమాసికంలో లాంచ్ అవుతుందని అధికారికంగా ప్రకటించింది. రూ.2 లక్షల నుంచి రూ.2.5-3 లక్షల మధ్య ధర ఉండొచ్చని అంచనా.