SDPT: ఉపాధి హామీ కూలీల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వీబీ-జీ రామ్-జీ చట్టం గ్రామీణ కూలీలకు ఎంతో ఉపయోగపడుతుందని మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు. సిద్దిపేటలో నిర్వహించిన ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడారు. గతంలో 100 రోజుల పనిదినాలను మాత్రమే కల్పించేవారని, ఇప్పుడు ఈ చట్టంతో 120 రోజులు వచ్చాయన తెలిపారు.
KMM: రానున్న పురపాలక ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మంలోని అన్ని మున్సిపాలిటీల్లో BRS జెండా ఎగరాలని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు KTR పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. శనివారం HYDలో నిర్వహించిన ఖమ్మం జిల్లా సన్నాహక సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ రెండేళ్ల పాలనలో పట్టణాలు అభివృద్ధికి ఆమడదూరంలో నిలిచాయని ధ్వజమెత్తారు.
NRPT: అనుమతులు లేకుండా అక్రమంగా మొరం తరలిస్తున్న ట్రిప్పర్ను ఊట్కూర్ మండల పోలీసులు పట్టుకున్నారు. శనివారం మధ్యాహ్నం ఊట్కూర్ చెక్ పోస్ట్ సమీపంలో పెట్రోలింగ్ చేస్తుండగా అనుమానాస్పదంగా కనిపించిన ట్రిప్పర్ను తనిఖీ చేశారు. వాహనాన్ని స్టేషన్కు తరలించి, డ్రైవర్ రాజేశ్, యజమాని భీమేష్పై కేసు నమోదు చేశామని ఎస్ఐ రమేష్ తెలిపారు.
MDK: మనోహరాబాద్ మండలం కోనాయపల్లి (పిటి) గ్రామానికి చెందిన రావెల్లి దుర్గయ్య చెరువులో మునిగి మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. కుటుంబీకుల దశదినకర్మ పురస్కరించుకుని చెరువులో స్నానం చేసేందుకు వెళ్లిన దుర్గయ్య కాలుజారి చెరువులో పడి మృతి చెందాడు. గజ ఈతగాల్ల సహాయంతో బయటకు తీసి పోస్టుమార్టం కోసం తరలించారు.
MDK: మనోహరాబాద్ మండలం కోనాయపల్లి (పిటి) గ్రామానికి చెందిన రావెల్లి దుర్గయ్య చెరువులో మునిగి మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. కుటుంబీకుల దశదినకర్మ పురస్కరించుకొని చెరువులో స్నానం చేసేందుకు వెళ్లిన దుర్గయ్య కాలుజారి చెరువులో పడి మృతి చెందాడు. గజ ఈతగాల్ల సహాయంతో బయటకు తీసి పోస్టుమార్టం కోసం తరలించారు.
NGKL: కల్వకుర్తి మండలంలోని మార్చల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జిల్లా ఎస్పీ సంగ్రామ్ సింగ్ పాటిల్ ఆదేశాల ప్రకారం కల్వకుర్తి ఎస్ఐ మాధవరెడ్డి శనివారం డ్రగ్స్ మరియు మత్తు పదార్థాల నష్టాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. అనంతరం విద్యార్థులకు అపరిచితుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఎవరైనా డ్రగ్స్ విక్రయాలకు పాల్పడితే వెంటనే డయల్ 100 ద్వారా సమాచారం ఇవ్వాలని సూచించారు.
NZB: మహిళా విద్యకు మార్గదర్శకురాలైన సావిత్రిబాయి ఫూలే ఆశయాలను యువత ఆదర్శంగా తీసుకోవాలని NZB రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి పిలుపునిచ్చారు. శనివారం జిల్లా బీసీ ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో జరిగిన సావిత్రిబాయి ఫూలే జయంతి సందర్భంగా ‘ఉద్యోగ-ఉపాధ్యాయ పురస్కారాలు-2026’ కార్య క్రమంలో MLA మాట్లాడారు.
MDK: తన తల్లి అదృశ్యమైందని మద్దూరి నవీన్ చారి శనివారం రామాయంపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. రామాయంపేట మున్సిపల్ పరిధికి చెందిన మద్దూరి మురళి భార్య లక్ష్మీ (58) ఈ నెల 9వ తేదీన ఇంటి నుండి బయటకు వెళ్లిన తర్వాత తిరిగి రాలేదు. కుమారుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
SRPT: పార్టీ పటిష్టతకు బూత్ కమిటీలే పునాది అని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ ఓ. శ్రీనివాసరెడ్డి అన్నారు. శనివారం సూర్యాపేటలో జిల్లా అధ్యక్షురాలు చల్ల శ్రీలతరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ‘బూత్ నిర్మాణ అభియాన్’లో ఆయన పాల్గొన్నారు. జిల్లాలోని 1,205 బూత్ కమిటీలను పకడ్బందీగా పునర్నిర్మించాలని, మోదీ ప్రభుత్వ పథకాలను ఇంటింటికీ చేరవేయాలని దిశా నిర్దేశం చేశారు.
BHPL: జిల్లా కేంద్రంలోని MLA క్యాంప్ కార్యాలయంలో ఇవాళ హుజురాబాద్ ఆర్సీ రిపోర్టర్ ఇప్పకాయల సాగర్, జిల్లా బ్యూరో జోడు ప్రదీప్ ఆధ్వర్యంలో ‘ప్రజా ప్రతిభ’ నూతన సంవత్సర క్యాలెండర్ను MLA గండ్ర సత్యనారాయణ రావు ఆవిష్కరించారు. MLA గండ్ర మాట్లాడుతూ.. ప్రజా సమస్యల పై మరిన్ని వార్తలు అందించి ప్రభుత్వాలకు, ప్రజలకు వారధిగా ఉండాలని సూచించారు.
SRD: సంగారెడ్డి పట్టణంలో ట్రాఫిక్ సీఐ రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో వాహన తనిఖీలు శనివారం నిర్వహించారు. హెల్మెట్ ధరించని ఎనిమిది మంది వాహనదారులకు జరిమానా విధించారు. ఆయన మాట్లాడుతూ.. బైక్ పై ప్రయాణించేవారు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు. మరోసారి పట్టి పడితే కఠిన తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
BHPL: మున్సిపాలిటీ పరదిలోని 1వ వార్డు సెగ్గెంపల్లి, గడ్డిగానిపల్లిలో ఇవాళ BRS పట్టణ అధ్యక్షుడు కటకం జనార్దన్ ఆధ్వర్యంలో బస్తీ బాట కార్యక్రమం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా మాజీ MLA గండ్ర వెంకటరమణారెడ్డి హాజరై, మాట్లాడారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో BRS పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో BRS శ్రేణులు తదితరులు ఉన్నారు.
KMR: మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ సత్తాచాటి పూర్వ వైభవాన్ని తీసుకురావాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పారు. శనివారం టీఎస్పీఎస్సీ మాజీ సభ్యురాలు, BRS మహిళా రాష్ట్ర నాయకురాలు సుమిత్రానంద్ తానోబా మర్యాదపూర్వకంగా కలిశారు. కామారెడ్డి జిల్లాలో నాలుగు మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్ జెండా ఎగురుతుందన్నారు.
కొండమల్లేపల్లి పంచాయతీ ఎన్నికల్లో ఓ వార్డు సభ్యుడు తనకే ఓటు వేయాలని ఓటుకు 2 తులాల వెండి విగ్రహాన్ని అందజేసి ఓటు వేయాలని ప్రమాణం చేయించుకున్నాడు. అనంతరం విగ్రహాలు ఇచ్చిన వ్యక్తినే ఓటర్లు గెలిపించారు. విగ్రహాలు ఇటీవల పరీక్షించగా నకిలీవని బయటపడ్డాయి. ఓటు కోసం నమ్మించి మోసం చేసిన ప్రజాప్రతినిధులను, ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని కోరారు.
MDK: పాపన్నపేట మండలం కొత్తపల్లి శివారు, అనంతపద్మనాభ స్వామి ఆలయం సమీపంలో చిత్తు బొత్తు ఆడుతున్న ఆరుగురిని పోలీసులు అరెస్టు చేసినట్లు ఎస్పీ డివి శ్రీనివాసరావు తెలిపారు. అరెస్టయినవారిలో అరిగళ్ళ చిన్ని, బందెల్ గోపాల్, ఉప్పరి వీరేశం, ఉప్పరి రమేష్, సాలె రాములు, నాగజోల రమేష్ ఉన్నారు. వారిని పట్టుకుని రూ.31,433 నగదు మరియు ఐదు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు.