NGKL: నాగర్ కర్నూల్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో ఈరోజు రాత్రి సావిత్రిబాయి పూలే వర్ధంతి సందర్భంగా బహుజన టీచర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. జిల్లా గౌరవ అధ్యక్షులు కురుమూర్తి మాట్లాడుతూ.. ఆడపిల్లలు చదువుకుంటేనే సమాజం సంపూర్ణంగా బాగుంటుందని భావించి వారికోసం విద్యా అందించడంలో కృషి చేసిందన్నారు.