WGL: నగరంలో మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలను బీజేపీ రాష్ట్ర నాయకులు ఎర్రబెల్లి ప్రదీప్ రావు తీవ్రంగా ఖండించారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ.. జై శ్రీరామ్ అంటే డబ్బులు పడతాయా? అనే వ్యాఖ్యలు హిందూ భావాలను అవమానించేలా ఉన్నాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. దేవాదాయ శాఖ మంత్రిగా ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సమంజసం కాదని అన్నారు.