NGKL: ఈనెల 28న నిర్వహించబోయే బక్రీద్ పండుగ సందర్భంగా జిల్లా సరిహద్దుల్లో మంగనూరు, మరికల్, కొట్ర జంక్షన్, మున్ననూర్, చారకొండలో చెక్ పోస్టులు ఏర్పాటు చేయడం జరిగిందని జిల్లా ఎస్పీ సంగ్రామ్ సింగ్ పాటిల్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. అక్రమంగా ఆవులను, దూడలను తరలించరాదని, ఎవరైనా తరలిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.