MHBD: డోర్నకల్ నియోజకవర్గ పరిధిలోని సాగునీటి పారుదల శాఖ పనులను వేగవంతం చేసి, నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని MLA రామచంద్రు నాయక్ అధికారులను ఆదేశించారు. నియోజకవర్గ పరిధిలోని ఇరిగేషన్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. నియోజకవర్గంలో సాగుతున్న నీటి పారుదల పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు.