BDK: అశ్వరావుపేట మున్సిపల్ కమిషనర్ దిలీప్ రెడ్డి పట్టణ దుకాణదారులతో మంగళవారం సమావేశమయ్యారు. ప్రతి షాప్ వారు పరిశుభ్రత పాటించాలని, షాపులోని వ్యర్థాలు డస్ట్ బిన్లో వేయాలని సూచించారు. వాటిని స్వచ్ఛ ట్రాలీ వచ్చినప్పుడు అందులో వేయాలని తెలిపారు. దుకాణం ఎదుట చెత్తాచెదారం కనిపిస్తే జరిమానా విధిస్తామని అన్నారు.