తమిళనాడు సీఎం విజయ్‌ను హీరో విజయ్ ఆంటోనీ, దర్శకుడు ఆర్జే బాలాజీ వేర్వేరుగా కలిశారు. ఈ సందర్భంగా తీసుకున్న ఫొటోలను వారు SMలో పంచుకున్నారు. సీఎం విజయ్‌లోని పాజిటివిటీ, ఎనర్జీ ఎంతో స్ఫూర్తిదాయకమని, ఆయన సమాజంలో మంచి మార్పు తీసుకురావాలని ఆంటోనీ ఆకాంక్షించారు. విజయ్‌ను సీఎంగా కలవడం నమ్మశక్యంగా లేదని, ఆయన ప్రేమ, ప్రశాంతత ఎప్పటికీ మారలేదని బాలాజీ అన్నారు.
సత్యసాయి: లేపాక్షి మండలంలోని కంచి సముద్రం నుంచి కర్ణాటకకు వెళ్లే ప్రధాన రహదారి భారీ గుంతలతో ప్రమాదకరంగా మారిందని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు. రహదారి దుస్థితితో వాహనదారులు, విద్యార్థులు, రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఈ సమస్యపై సీపీఎం ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. రహదారిని వెంటనే మరమ్మతు చేయాలని నాయకులు డిమాండ్ చేశారు.
PLD: ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) కార్యక్రమాన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని పార్టీ శ్రేణులు సమన్వయంతో పనిచేయాలని పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు పిలుపునిచ్చారు. TDP కేంద్ర కార్యాలయంలో తిరుపతి, చిత్తూరు, రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
KKD: మహిళలపై అత్యాచారాలు, గృహహింస, పోక్సో కేసుల నియంత్రణకు ‘ఆపరేషన్ దండాయన’ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు SP బిందు మాధవ్ తెలిపారు. మంగళవారం SP కార్యాలయంలో ఇందుకు సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించారు. మహిళలపై జరిగే నేరాల్లో 60 రోజుల్లోనే చార్జిషీట్ దాఖలు చేయడం, సంచలన కేసులను ఫాస్ట్ ట్రాక్ కోర్టులకు బదిలీ చేసి నిందితులకు త్వరగా శిక్షలు పడేలా చూస్తామన్నారు.
E.G: గోదావరి పుష్కరాలు-2027ను ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి అధికారులను ఆదేశించారు. సీఎం చంద్రబాబు నాయుడు నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ అనంతరం కలెక్టర్ సమీక్ష నిర్వహించి ఖాళీ స్థలాల గుర్తింపు, 16 పుష్కర్ నగర్‌ల లేఅవుట్లు, ట్రాఫిక్ మళ్లింపు మార్గాల ప్రణాళికలను తక్షణం సిద్ధం చేయాలన్నారు.
ATP: అమరావతిలో సీఎం చంద్రబాబు నాయుడిని రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత మర్యాదపూర్వకంగా కలిశారు. నియోజకవర్గ పరిధిలోని పలు పెండింగ్ అభివృద్ధి పనుల పురోగతిని ఆమె ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. రాప్తాడు పరిధిలో సాగునీరు, తాగునీటి సమస్యల పరిష్కారంతో పాటు మౌలిక సదుపాయాల కల్పనకు నిధులు మంజూరు చేయాలని ఆమె సీఎంకు వినతిపత్రం సమర్పించారు.
WGL: నల్లబెల్లి (M)లోని రంగాపురంలో షార్ట్ సర్క్యూట్‌తో మిర్యాల పెద్దన్న ఇల్లు దగ్ధమైంది. విషయం తెలుసుకున్న జనతా ట్రస్ట్ ఛైర్మన్ డా. గోగుల రాణా ప్రతాప్ రెడ్డి మిత్ర బృందంతో బాధితులను పరామర్శించారు. 50 కిలోల బియ్యం, నిత్యావసరాలు, బట్టలు అందజేశారు. ట్రస్ట్ సభ్యులు, గ్రామ పెద్దలు, యువకులు పాల్గొన్నారు.
CTR: జిల్లాలో మాత, శిశు మరణాలను పూర్తిగా నివారించేలా అధికారులు చర్యలు చేపట్టాలని కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశించారు. జిల్లా కలెక్టరేట్లో వైద్య అధికారులతో మంగళవారం ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. మాత, శిశు మరణాల నివారణకు తీసుకోవాల్సిన చర్యలు, మెరుగైన వైద్య సేవలు అందేలా చూడటంపై అధికారులకు ఆయన సూచనలు ఇచ్చారు.
అంతర్గం మండలం గోలివాడ గ్రామ శివారులోని గోదావరి నదిలో సుమారు 45–50 ఏళ్ల వయస్సు గల గుర్తుతెలియని మగ వ్యక్తి మృతదేహం లభ్యమైంది. మృతుడు లైట్ పింక్ రంగు ఫుల్ షర్ట్, ఆకుపచ్చ రంగు ప్యాంటు ధరించి ఉన్నాడు. ఇతని వివరాలు తెలిసిన వారు అంతర్గం పోలీసులకు సమాచారం అందించాలని ఎస్‌ఐ కోరారు. సంప్రదించవలసిన నంబర్: 8712656527.
ASR: ఓటరు జాబితాలో పెండింగ్లో ఉన్న ఎలెక్టోరల్ మ్యాపింగ్‌ను త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత సిబ్బందిని కొయ్యూరు మండల తహసీల్దార్ పీ.మురళీ బాబు ఆదేశించారు. స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో ఉన్న సమావేశ మందిరంలో బూత్ స్థాయి అధికారులు, సూపర్వైజర్లతో మంగళవారం సమావేశం నిర్వహించారు. అంతేకాకుండా SIRను వేగవంతం చేయాలని సూచించారు.
MHBD: బయ్యారం మండలంలోని సంతులాల్ పోడు తండా వద్ద ఇల్లందు–మహబూబాబాద్ రహదారిపై మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ద్విచక్ర వాహనదారుడు గోగినేని బాబురావు (82) మృతి చెందాడు. గార్ల మండలం ముల్కనూరు గ్రామానికి చెందిన ఆయనను కంటైనర్ లారీ ఢీకొట్టడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
AKP: మలేరియా మహోత్సవాల్లో భాగంగా నాతవరంలో మంగళవారం పీహెచ్‌సీ నుంచి బస్టాండ్ వరకు అవగాహన ర్యాలీ నిర్వహించారు. మలేరియా నివారణ, నియంత్రణపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ నినాదాలు చేశారు. జ్వరం, చలి, తలనొప్పి లక్షణాలు కనిపిస్తే వెంటనే రక్త పరీక్షలు చేయించుకోవాలని వైద్యాధికారి డాక్టర్ ప్రసన్నకుమార్ సూచించారు. పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలన్నారు.
AP: కొన్ని జిల్లాల్లో పిడుగులు పడే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ రెడ్ అలర్ట్ జారీ చేసింది. అల్లూరి, తూ.గో, ఏలూరు, కృష్ణా, GNT, పల్నాడు, NTR జిల్లాల్లో పిడుగులు పడే అవకాశం ఉందని హెచ్చరించింది. పలు చోట్ల 50-60 KM వేగంతో గాలులు వీచే ప్రమాదం ఉందని పేర్కొంది. చెట్లు, విద్యుత్ స్తంభాలు, హోర్డింగుల వద్ద ప్రజలు ఉండొద్దని, సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని APSDMA సూచించింది.
ఆఫ్ఘానిస్థాన్‌తో జరగబోయే టీ20 సిరీస్‌తో శ్రేయస్ అయ్యర్, భువనేశ్వర్ కుమార్ టీమిండియాలోకి రీఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఈ సిరీస్‌లో కెప్టెన్‌గా శ్రేయస్ వ్యవహరించే అవకాశం ఉండగా.. ఇషాన్ కిషన్‌కు వైస్ కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించవచ్చని సమాచారం. ఇక యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి ఈ సిరీస్‌లో చోటు దక్కడం ఖాయంగా కనిపిస్తోంది.
ADB: ఇటీవల కురిసిన వర్షానికి పలువురి ఇల్లు కూలిపోవడంతో బాధితులకు ఇందిరమ్మ ఇల్లు మంజూరయ్యేలా కృషి చేస్తామని టీపీసీసీ ఉపాధ్యక్షురాలు, ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్లమెంట్ ఇంఛార్జ్ ఆత్రం సుగుణ హామీ ఇచ్చారు. మంగళవారం నార్నూర్ మండలం పుసిగూడలో పర్యటించారు. బాధితుల ఇళ్లను పరిశీలించి పూర్తి వివరాలను సేకరించారు.