ATP: మంగళగిరిలోని టీడీపీ పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ వర్క్‌షాప్‌లో ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి, ఎమ్మెల్యే భూమ అఖిల ప్రియ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ తోటి మహిళా ఎమ్మెల్యేలతో కలిసి ఉత్సాహంగా సెల్ఫీ తీసుకున్నారు. ఈ ఫోటో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.
KKD: రాజమహేంద్రవరం నారాయణపురం ప్రాంతానికి చెందిన గుత్తుల అప్పయ్యమ్మ (70) రెండు రోజులుగా బయట తిరుగుతున్నారు. దీంతో స్థానికులు తొలుత ప్రభుత్వ ఆసుపత్రిలోని వన్ స్టాప్ సెంటర్‌కు, అనంతరం ప్రకాష్ నగర్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ప్రస్తుతం స్వర్ణాంధ్ర వృద్ధాశ్రమంలో ఆశ్రయం పొందుతున్నారు. ఈమె ఆచూకీ తెలిసినవారు పోలీసులను సంప్రదించాలని కోరారు.
TG: బీసీలకు న్యాయం జరగాలంటే దేశవ్యాప్తంగా కులగణన తప్పనిసరని ప్రభుత్వ సలహాదారు వి. హనుమంతరావు అన్నారు. మోదీ బీసీ అయి ఉండి కూడా ఆ వర్గానికి న్యాయం చేయలేదని ఆరోపించారు. కానీ రాహుల్ గాంధీ తన పాదయాత్రలో బీసీల వెనుకబాటుతనాన్ని గుర్తించి, వారి అసలు సంఖ్య తేల్చేందుకే కులగణనకు పట్టుబట్టారని, సీఎం రేవంత్ రెడ్డి కూడా బీసీల సమస్యలపై సానుకూలంగా ఉన్నారని ప్రశంసించారు.
SKLM: ఖరీఫ్ నాటికి రైతులకు విత్తనాలు అందుబాటులో ఉంచాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ వ్యవసాయ అధికారులను ఆదేశించారు. యూరియా కొరత రాకుండ ముందస్తు ప్రణాళిక తయారు చేసుకోవాలన్నారు. మంగళవారం కలెక్టరేట్‌లో సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. పచ్చి రొట్ట ఎరువులను ప్రోత్సహించాలని దీని వలన రసాయన ఎరువులను తగ్గించు కోవచ్చన్నారు.
VZM: గజపతినగరం మండలం మరుపల్లి గ్రామ శివార్లలోని మామిడి తోటలో పేకాట ఆడుతున్న వారిపై స్పెషల్ బ్రాంచ్, టాస్క్ ఫోర్స్ పోలీసులు రైడ్ చేశారు. పేకాట ఆడుతున్న 11మందిని అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుంచి బెట్టింగులకు వినియోగిస్తున్న రూ.1,73,830/- ల నగదు, 9 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లుగా జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ తెలిపారు.
TG: గ్రామీణ నిరుపేద కుటుంబాలకు ఉపాధి హామీ పథకం ఎంతో అండగా నిలుస్తోందని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు అన్నారు. ఈ పథకం ప్రారంభమై 20 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆయన మాట్లాడారు. ఉపాధి హామీ వల్ల పట్టణాలకు వలసలు తగ్గాయని, గ్రామాల్లోనే ఉపాధి లభించిందన్నారు. కార్మికుల సంక్షేమానికి, వారి సమస్యల పరిష్కారానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందన్నారు.
రోజంతా అలిసిపోయి పడుకునే బెడ్‌షీట్స్ శుభ్రత ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. నిద్రించేటప్పుడు శరీరం నుంచి రాలే చర్మ కణాలు, చెమట, జిడ్డు వల్ల కంటికి కనిపించని బ్యాక్టీరియా, డస్ట్ మైట్స్ చేరతాయి. ఇవి చర్మ అలర్జీలు, మొటిమలు, శ్వాసకోశ సమస్యలకు దారితీస్తాయి. అందుకే వారానికి ఒకసారి తప్పనిసరిగా బెడ్‌షీట్స్, దిండు కవర్లను మార్చాలి. వేడి నీటితో ఉతికి, ఎండలో ఆరబెట్టడం మంచిది.
FIFA ప్రపంచకప్ ఈనెల 11 నుంచి ప్రారంభం కానుంది. అమెరికా, మెక్సికో, కెనడా దేశాలు సంయుక్తంగా ఈ మెగాటోర్నీకి ఆతిథ్యం ఇస్తున్నాయి. మొత్తం 48 జట్లు పాల్గొంటున్న ఈ టోర్నీలో ఏ జట్టు విజేతగా నిలుస్తుందనే దానిపై ప్రముఖ అనలిటిక్స్ సంస్థ ‘ఆప్టా’ తన సూపర్ కంప్యూటర్ ద్వారా విశ్లేషణ జరిపింది. ఈసారి వరల్డ్ కప్ గెలిచే అవకాశాలు అత్యధికంగా స్పెయిన్ జట్టుకే ఉన్నట్లు పేర్కొంది.
SRCL: ఘన, ప్లాస్టిక్ వ్యర్థాలపై అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా పర్యావరణ ఉత్సవాల్లో కింద ఘన వ్యర్థాల నిర్వహణ నియమాలు, 2026 ప్లాస్టిక్ వేస్ట్ నిర్వహణ, పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్రజలకు అవగాహన కల్పించే పోస్టర్లను మంగళవారం జిల్లా కలెక్టర్ గరిమ అగర్వాల్ ఆవిష్కరించారు.
పెద్ది’ ప్రమోషన్స్‌లో AR రెహమాన్ ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. తెల్లవారుజామున 5:30కే లేచి రెహమాన్ వర్క్ చేయడంపై బుచ్చిబాబు ప్రశంసించగా.. ‘సినిమా ఇండస్ట్రీ ప్రవహించే నీరు లాంటిది, పాత అవార్డులు చూసుకుంటే లాభం లేదు. ఇప్పుడు యూట్యూబ్ ఆడియన్స్ సాంగ్‌లో చిన్న హమ్మింగ్‌ను కూడా అబ్సర్వ్ చేస్తున్నారు, మనమూ అప్‌డేట్ అవ్వాలి’ అని తెలిపారు.
SRH మాజీ స్పీడ్‌స్టార్ సిద్ధార్థ్ కౌల్ ప్రస్తుతం చండీగఢ్‌లోని SBI బ్రాంచ్‌లో ఉద్యోగిగా విధులు నిర్వహిస్తున్నాడు. సాధారణంగా IPL ఆడిన క్రికెటర్లు లగ్జరీ లైఫ్ గడుపుతుంటే, సిద్ధార్థ్ ఇలా బ్యాంక్ ఉద్యోగిగా సాధారణ జీవితం గడపడం అందరినీ ఆకట్టుకుంటోంది. క్రీడా కోటా కింద అతడు ఈ ఉద్యోగం సాధించాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
ASF: ఈనెల 4, 6, 8, 10 తేదీల్లో గ్రామ, వార్డుల్లో సభలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్లు, SPలతో సమీక్ష నిర్వహించారు. ఆసిఫాబాద్ జిల్లాలో 335 గ్రామపంచాయతీలు, 2 మున్సిపాలిటీల్లో సభల నిర్వహణకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ హరిత అధికారులను ఆదేశించారు.
SDPT: బెజ్జంకి మండలానికి చెందిన పాడి రైతులు పుర్మ లచ్చిరెడ్డి, గుబిరే రాజయ్య మరణించడంతో వారి కుటుంబాలకు కరీంనగర్ డెయిరీ ఆధ్వర్యంలో రూ. 50 వేల చొప్పున ఇన్సూరెన్స్ చెక్కులను అందజేశారు. డెయిరీ ఛైర్మన్ చెల్మెడ రాజేశ్వర్ రావు చేతుల మీదుగా ఈ ఆర్థిక సహాయాన్ని పంపిణీ చేశారు. పాడి రైతుల కుటుంబాలకు ఈ బీమా సొమ్ము ఎంతో ఆర్థిక భరోసా కల్పిస్తుందన్నారు.
TG: పాలమూరు ప్రాంతంలోని పెండింగ్ సాగునీటి ప్రాజెక్టులను త్వరగా పూర్తి చేస్తామని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. సీఎం రేవంత్‌రెడ్డి రెండు రోజుల క్షేత్రస్థాయి పర్యటన నేపథ్యంలో ‘జలసౌధ’లో సన్నాహక సమావేశం నిర్వహించారు. సీఎం, డిప్యూటీ సీఎంలు ఈ నెల 4న హెలికాప్టర్ల ద్వారా ఏరియల్ సర్వే చేసి, సోమశిలలో సమీక్ష నిర్వహిస్తారని పేర్కొన్నారు.
ఆస్ట్రేలియాపై పాక్ బౌలర్లు రెండో వన్డేలోనూ చెలరేగారు. తొలి వన్డేలో ఆసీస్‌ను 200 పరుగులకే ఆలౌట్ చేసి గెలిచిన పాక్, రెండో వన్డేలోనూ ఆసీస్‌ను 231/9 పరుగులకే పరిమితం చేసింది. PAK బౌలర్లలో అఫ్రిది 3 వికెట్లు పడగొట్టగా.. హారిస్ రౌఫ్, మిన్హాస్, అబ్రార్ అహ్మద్ తలో 2 వికెట్లు తీశారు. ఇంగ్లిస్(51), గ్రీన్(53), రెన్‌షా(43) మినహా మిగతా బ్యాటర్లంతా ఘోరంగా విఫలమయ్యారు.