ఆస్ట్రేలియాపై పాక్ బౌలర్లు రెండో వన్డేలోనూ చెలరేగారు. తొలి వన్డేలో ఆసీస్‌ను 200 పరుగులకే ఆలౌట్ చేసి గెలిచిన పాక్, రెండో వన్డేలోనూ ఆసీస్‌ను 231/9 పరుగులకే పరిమితం చేసింది. PAK బౌలర్లలో అఫ్రిది 3 వికెట్లు పడగొట్టగా.. హారిస్ రౌఫ్, మిన్హాస్, అబ్రార్ అహ్మద్ తలో 2 వికెట్లు తీశారు. ఇంగ్లిస్(51), గ్రీన్(53), రెన్‌షా(43) మినహా మిగతా బ్యాటర్లంతా ఘోరంగా విఫలమయ్యారు.
MNCL: జన్నారం అటవీ డివిజన్ పరిధిలోని జన్నారం రేంజ్ ఎఫ్ఆర్‌వోగా బాబా ఖదీర్ వలి బాధ్యతలు చేపట్టారు. మంగళవారం జన్నారం మండల కేంద్రంలోని ఎఫ్ఆర్‌వో కార్యాలయంలో ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా నూతన ఎఫ్ఆర్‌వో మాట్లాడుతూ.. అడవులు, వన్యప్రాణుల సంరక్షణకు అధిక ప్రాధాన్య ఇస్తానని తెలిపారు. ప్రజలు కూడా అటవీశాఖ అధికారులకు సహకరించాలని ఆయన కోరారు.
జగిత్యాల జిల్లా ధరూర్ క్యాంప్ ఇరిగేషన్ చీఫ్ ఇంజినీర్ కార్యాలయంలో ఎన్టీపీఏగా బదిలీపై వచ్చిన కొలుగురు వెంకటేశ్వరరావు మంగళవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా కార్యాలయ ఉద్యోగులు, ఉద్యోగ సంఘాల నాయకులు ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. నూతన బాధ్యతల్లో విజయవంతంగా పనిచేయాలని ఆకాంక్షించారు.
SRD: కంగ్టి మండలంలో మంగళవారం రాత్రి తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షం కురిసింది. ఉదయం అంతా ఎండ తీవ్రతతో పొడిగా ఉన్నప్పటికీ, సాయంత్రం వేళకు ఆకాశంలో మబ్బులు కమ్ముకుని వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. అనంతరం కురిసిన వర్షం వల్ల రోడ్లన్నీ జలమయమయ్యాయి. గత కొన్ని రోజులుగా తీవ్రమైన ఎండలు, ఉక్కపోతతో ఇబ్బంది పడుతున్న స్థానిక ప్రజలు ఈ వర్షంతో వేడిమి నుండి ఉపశమనం పొందారు.
కోనసీమ: మైనర్లు వాహనాలు నడుపుతూ తనిఖీలలో పట్టుబడితే వారి తల్లిదండ్రులు కౌన్సిలింగ్‌కు హాజరు కావాల్సిందేనని జిల్లా రవాణా అధికారి దేవిశెట్టి శ్రీనివాసరావు హెచ్చరించారు. మంగళవారం 17 సంవత్సరాల యువకుడు ట్రాక్టర్ డ్రైవింగ్ చేస్తూ పట్టు బడ్డ కేసులో మైనర్ తండ్రికి ఆయన కౌన్సిలింగ్ నిర్వహించారు. ట్రాక్టర్‌కు రూ.40 వేలు అపరాధ రుసుము విధించినట్లు తెలిపారు.
KDP: ప్రొద్దుటూరులో 6 మంది క్రికెట్ బుకీలను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి రూ.2.20 లక్షల నగదు, ల్యాప్ టాప్, 10 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు ప్రొద్దుటూరు ASP విభుకృష్ణ తెలిపారు. ఆయన మంగళవారం తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. నిందితులకు చెందిన 16 బ్యాంకు అకౌంట్లలోని రూ.4.14 లక్షలు ఫ్రీజ్ చేశామన్నారు.
MLG: ఏటూరునాగారం మండల కేంద్రంలో తెలంగాణ ఉద్యమ సమయంలో మహిళలు విశేష పాత్ర పోషించారు. ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం ఐటీడీఏ కార్యాలయం ఎదుట రోడ్డుపై వంటా-వార్పు నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. సామూహిక భోజనాలు చేస్తూ తెలంగాణ ఆకాంక్షను చాటిచెప్పిన మహిళలు, పార్టీలకు అతీతంగా ఉద్యమంలో పాల్గొని రాష్ట్ర సాధనకు మద్దతు తెలిపారు. ఆనాటి జ్ఞాపకాలు నెమరువేసుకున్నారు.
PDPL: రామగుండం నియోజకవర్గంలోని పాలకుర్తి, అంతర్గాం మండలాల అభివృద్ధి పనులు, ప్రజా సమస్యలు, సంక్షేమ పథకాల అమలుపై ఎన్టీపీసీ మిలీనియం హాల్లో ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రజలకు నాణ్యమైన సేవలు అందించాలని, సమస్యల పరిష్కరానికి చర్యలు చేపట్టాలని ఆయన అధికారులను ఆదేశించారు.
MHBD: తొర్రూరులోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం(కేజీబీవీ)లో అదనపు వసతుల నిర్మాణ పనులకు పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి శంకుస్థాపన చేశారు. విద్యార్థినులకు మెరుగైన విద్యా వాతావరణం కల్పించేందుకు ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోందని, ప్రభుత్వం విద్యా రంగ అభివృద్ధికి కట్టుబడి ఉందని అన్నారు.
ATP: అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లో రేపు పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ (APSDMA) ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. ఈ సందర్భంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. ఉరుములు, మెరుపులు వచ్చే సమయంలో చెట్లు, విద్యుత్ స్తంభాలు, శిథిలావస్థ భవనాల కింద నిలబడవద్దని హెచ్చరించారు.
KKD: వేసవి తీవ్రత, భానుడి భగభగలకు పిఠాపురంలో కొబ్బరి బొండాలకు గిరాకీ విపరీతంగా పెరిగింది. మంగళవారం మార్కెట్లో గతంలో రూ.20 నుంచి రూ.30 పలికిన బొండం ధర ప్రస్తుతం రూ.50 నుంచి రూ. 70 వరకు చేరింది. రూ.80 అమ్మే కొబ్బరి నీళ్ల బాటిల్ ధర ఏకంగా రూ.120 నుంచి రూ. 140 కి పెరిగింది. ఎండల నుంచి ఉపశమనం కోసం కొబ్బరి నీళ్లు తాగేందుకు ఆసక్తి చూపడంతో డిమాండ్ పెరిగింది.
KMR: ప్లాస్టిక్ పైపుల ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటన భిక్కనూరు మండలం జంగంపల్లి శివారులోని హరిహర పాలిమర్స్ ఫ్యాక్టరీలో మంగళవారంచోటుచేసుకుంది. జంగంపల్లి గ్రామం నుంచి దోమకొండ వెళ్లే దారిలో హరిహర పాలిమర్స్ స్క్రాప్ ఫ్యాక్టరీ ఉంది. సుమారు రూ.కోటి వరకు నష్టం జరిగినట్టు బాధితులు పేర్కొంటున్నారు.
KDP: జమ్మలమడుగులో మంగళవారం జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే చదిపిరాళ్ల ఆదినారాయణ రెడ్డితో కలిసి పర్యటించారు. ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల, నాక్ సెంటర్ భవనాలను స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్ నిర్వహణకు అనుకూలతలపై పరిశీలించారు. అనంతరం ఆర్డబ్ల్యూఎస్ కార్యాలయం, వాటర్ టెస్టింగ్ ల్యాబ్, జమ్మలమడుగు ఏరియా ఆసుపత్రిని సందర్శించారు.
TG: ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ప్రభుత్వం మార్చి 6 నుంచి జూన్ 12 వరకు 99 రోజుల ‘ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక’ను అమలు చేస్తోందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. అమరవీరులకు నివాళులర్పించి, జాతీయ జెండాను ఆవిష్కరించిన మంత్రి, ప్రభుత్వ సేవలను ప్రజలకు మరింత చేరువ చేయడమే ఈ కార్యక్రమ ఉద్దేశమన్నారు. ఈ వేడుకల్లో కలెక్టర్, ఎస్పీతో కలిసి ఆయన పాల్గొన్నారు.
KNR: చిగురుమామిడి మండలంలోని లంబాడిపల్లి గ్రామ ప్రాథమిక పాఠశాలలో మంగళవారం ఎంఈవో జయప్రద, ఉపాధ్యాయులు, గ్రామస్థుల సమక్షంలో ఇంటరాక్టివ్ డిజిటల్ ప్యానెల్ బోర్డును ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాల బలోపేతానికి గ్రామస్థులు ముందుకు వచ్చి రూ. లక్ష విరాళాలు సేకరించి ఇవ్వడం సంతోషం అని అన్నారు.