మయూరాసనం దీన్నే నెమలి భంగిమ అంటారు. ఇది పొత్తికడుపులో రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. కాలేయం, ప్లీహము, మూత్రపిండాలు మొదలైన ఉదర అవయవాలకు శక్తిని ఇస్తుంది. ఈ ఆసనం నిత్యం సాధన చేయడం వల్ల కడుపు సమస్యలు, పైల్స్ నుంచి ఉపశమనం పొందడంలో సహాయపడుతుంది. ఆకలిని మెరుగుపరచడానికి, పేగు కదలికలను సులభతరం చేయడానికి, మలబద్ధకాన్ని నివారించడానికి సహాయపడుతుంది.
ఆధునిక జీవనశైలిలో ఒత్తిడి అనేది ఒక భాగమైపోయింది. దీన్ని అధిగమించడానికి నిపుణులు ‘7-7-7 రూల్’ను సూచిస్తున్నారు. శరీర పునరుద్ధరణకు 7 గంటల నిద్ర అత్యవసరం. అలాగే, ఉదయం 7 గంటలలోపు నిద్రలేవాలి. ఇది ప్రకృతితో కనెక్ట్ అవ్వడానికి ఉత్తమ సమయం. అంతేకాకుండా, రాత్రి 7 గంటలలోపు భోజనం ముగించాలి. దీంతో జీర్ణక్రియ మెరుగుపడి, గాఢ నిద్ర పట్టేలా చేస్తుంది.
బాదం తినడం వల్ల బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. బాదంను కొంతమంది తినకూడదు. మూత్రపిండాల్లో రాళ్లు ఉన్నవారు, జీర్ణ సమస్యలు ఉన్నవారు, అధిక రక్తపోటు మందులు తీసుకునేవారు బాదం తక్కువగా తీసుకోవాలి. అలాగే కొంతమందికి బాదం తినడం వల్ల గ్యాస్, ఉబ్బరం, మలబద్దకం సమస్యలు రావచ్చు. చేదు బాదాలను ఎప్పుడూ తినకూడదు. వాటిలో సైనైడ్ ఉండి ఆరోగ్యానికి హానికరం చేస్తుందని నిపుణులు చెబుతున్నారు.
శీర్షాసనం చేయడం వల్ల ముఖ కాంతిని పెంచుతుంది. వృద్ధాప్య లక్షణాలను తగ్గించడంలో, ఒత్తిడివంటి లక్షణాలను ఎదుర్కోవడంలో కూడా సహాయపడుతుంది. ఈ ఆసనం చేస్తున్నప్పుడు నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ ఉండటం వల్ల ఒత్తిడి తగ్గిపోతుంది. తలలో రక్తప్రసరణ సక్రమంగా జరుగుతుంది. తలకు పోషకాలు, ఆక్సిజన్ సరిగ్గా అందుతాయి. జుట్టు కుదుళ్లకు తగిన పోషకాహారం అందించడం వల్ల జుట్టు రాలడం సమస్య దూరమవుతుంది.
ప్రతిరోజూ కొన్ని ఆహారాలు తింటే, చాలా సులభంగా బరువు తగ్గవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు. 1. నానబెట్టిన బాదం, వాల్‌నట్స్ 2. చియా విత్తనాల నీరు 3. ఉరిసి రసం 4. పసుపు, నల్ల మిరియాలు నీరు 5. బ్రెజిల్ గింజలు. ఈ ఐదింటిని ప్రతి రోజూ తినడం వల్ల డైటింగ్ చేయకుండానే బరువు తగ్గవచ్చని నిపుణులు తెలిపారు.
➛ నిద్రపోవడానికి గంట ముందే ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు దూరంగా ఉండాలి. వీటి నుండి వచ్చే ‘బ్లూ లైట్’ నిద్రకు కారణమయ్యే మెలటోనిన్ హార్మోన్ ఉత్పత్తిని తగ్గిస్తుంది.➛ పడుకునే ముందు పాదాలకు నూనెతో మర్దన చేసుకోవడం వల్ల రక్తప్రసరణ బాగా జరిగి, ఒత్తిడి తగ్గి త్వరగా నిద్ర పడుతుంది.➛ రాత్రి పడుకునే ముందు చిటికెడు పసుపు వేసిన గోరువెచ్చని పాలు తాగితే మంచి నిద్ర పడుతుంది.
కొన్ని చిట్కాలతో చేతులు పొడిబారడాన్ని తగ్గించుకోవచ్చు. చేతులు కడిగిన ప్రతిసారి, రాత్రి పడుకునే ముందు మాయిశ్చరైజర్ లేదా కొబ్బరి నూనె రాస్తే మంచిది. చల్లని వాతావరణంలో బయటకెళ్లేటప్పుడు గ్లవ్స్ వాడాలి. అలాగే ఎక్కువసేపు నీటిలో చేతులు నానితే చర్మం పొడిబారుతుంది. చేతులకు సన్‌స్క్రీన్ రాయడం వల్ల చర్మం దెబ్బతినకుండా ఉంటుంది.
చలికాలంలో గుండె ఆరోగ్యాంగా ఉండాలంటే ప్రతిరోజూ వ్యాయామాలు చేయాలి. చలి ఎక్కువగా ఉంటే బయటకు రాకుండా ఇంటి లోపల వ్యాయామం చేయడం అలవాటు చేసుకోవాలి. అలాగే, అకస్మాత్తుగా భారీ వ్యాయామాలు చేయకూడదు. సాధారణ గుండె వ్యాయామాలు చేయవచ్చు. గుండె ఆరోగ్యం కోసం రోజుకు 15 నుంచి 20 నిమిషాల వ్యాయామం సరిపోతుంది. వ్యాయామంతో పాటు యోగా, ప్రాణాయామం సాధన చేస్తే మంచిది.
ఆరోగ్యంగా ఉండాలంటే ఎత్తుకు తగిన బరువు ఉండటం తప్పనిసరి. దీనిని బాడీ మాస్ ఇండెక్స్ ఆధారంగా లెక్కిస్తారు. 5 అడుగుల ఎత్తున్న పురుషులు 50-55kgs, మహిళలు 45-50kgs ఉండాలి. అదే 5.5ft ఎత్తున్న అబ్బాయిలు 60-65, అమ్మాయిలు 55-60 కిలోలు, 6ft ఎత్తున్న మెన్స్ 75-82, ఉమెన్స్ 69-74 కిలోల మధ్య ఉండటం ఉత్తమం. అధిక బరువు గుండె జబ్బులు, మధుమేహానికి దారితీస్తుందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు.
➠ నిద్రలేవగానే రెండు గ్లాసుల గోరువెచ్చని నీళ్లు తాగాలి.➠ 10-20 నిమిషాలు నడక, యోగా చేయడం వల్ల రక్త ప్రసరణ పెరిగి ఉత్సాహంగా ఉంటారు.➠ కొద్దిసేపు ధ్యానం చేయడం లేదా శ్వాస వ్యాయామాలు చేయడం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది.➠ ఆరోగ్యకరమైన అల్పాహారం తీసుకుంటే జీవక్రియకు చాలా ముఖ్యం. కొద్దిసేపు సూర్యరశ్మిలో ఉంటే వల్ల విటమిన్ డి లభిస్తుంది. ఇది మానసిక ఆరోగ్యానికి మంచిది.
బాలాసనం చేయడం వల్ల ఒత్తిడి, ఆందోళన తగ్గి.. మనస్సు ప్రశాంతంగా మారుతుంది. వెన్నెముక, తుంటి, తొడ కండరాలకు మంచి సాగుదల లభించి వెన్నునొప్పి తగ్గుతుంది. రక్త ప్రసరణ మెరుగుపడి జీర్ణక్రియ సక్రమంగా ఉంటుంది. అలసటను తగ్గించి, శరీరానికి విశ్రాంతినిస్తుంది. ఏకాగ్రతను పెంచి, శ్వాసను మెరుగుపరుస్తుంది. ఇది అన్ని వయసుల వారికి సులభంగా చేయగల ఒక పునరుద్ధరణ భంగిమ.
కంప్యూటర్లు, మొబైల్ ఫోన్ల వాడకం వల్ల కంటిపై ఒత్తిడి పెరుగుతోంది. కంటి చూపును మెరుగుపరుచుకోవడానికి ఈ ఆహారం తీసుకోవాలి.క్యారెట్లు: ఇందులోని ‘విటమిన్ ఏ’ కంటి చూపుకు చాలా అవసరం.ఆకుకూరలు: వీటిలోని లూటిన్, కళ్లను సూర్యరశ్మి నుంచి వచ్చే హానికర కిరణాల నుంచి రక్షిస్తుంది.నట్స్: బాదం, వాల్‌నట్స్ వంటి గింజల్లో ఉండే విటమిన్-E కంటి కణాలు దెబ్బతినకుండా చూస్తుంది.
కొందరు డిప్రెషన్‌లోకి వెళ్లి సూసైడ్ చేసుకోవాలని అనుకుంటారు. ఈ థాట్స్ DECలో ఎక్కువగా వస్తాయని ఓ అధ్యయనంలో వెల్లడైంది. తెల్లవారుజామున 4-6 గంటల సమయంలో అధికంగా వస్తాయట. జూన్ నెలలో ఇలాంటి కేసులు తక్కువ నమోదు అవుతాయట. మెదడులో సెరెటోనిన్ లాంటి హార్మోన్లు పెరగడం వల్ల, మానసిక కారణాలు, ఆ మనిషి వ్యక్తిత్వం కారణంగా ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు.
బత్తాయి జ్యూస్‌లో విటమిన్ సి, పొటాషియం, కాల్షియం వంటి పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఈ జ్యూస్ తాగడం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది. రోగ నిరోధకశక్తి పెరుగుతుంది. శరీరం హైడ్రేట్ అవుతుంది. జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది. గుండె జబ్బులు దరిచేరవు. చర్మం, జుట్టు సమస్యలు దూరమవుతాయి. మలబద్ధకం, గ్యాస్, ఎసిడిటీ వంటి సమస్యలు తగ్గుతాయి. కంటి చూపు, దంతాల ఆరోగ్యం మెరుగుపడుతుంది.
కొత్త ఏడాదిలో అనవసరపు ఖర్చులు తగ్గించి, మనకు మేలు చేసే వాటిపైనే డబ్బు వెచ్చించాలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా ప్రయాణ భద్రత కోసం నాణ్యమైన హెల్మెట్, రెగ్యులర్ హెల్త్ చెకప్స్, పోషకాహారం కోసం ఖర్చు చేయాలన్నారు. శారీరక, మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ.. తప్పనిసరిగా జీవిత, ఆరోగ్య బీమా తీసుకోవాలని కోరారు. ఆరోగ్యం, భద్రతే అసలైన సంపద అని గుర్తుచేశారు.