వాము గింజల్లో ఉండే థైమాల్ అనే నేచురల్ ఆయిల్ జీర్ణరసాల ఉత్పత్తిని పెంచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఒక టీ స్పూన్ వాము గింజలను నీటిలో మరిగించి తాగితే గ్యాస్, బ్లోటింగ్ వంటి సమస్యలకు ఉపశమనం లభించే అవకాశం ఉంది. భోజనం చేసిన 30 నిమిషాల తర్వాత ఈ నీరు తీసుకోవడం వల్ల కడుపు భారంగా ఉండే సమస్య తగ్గుతుంది. లేదా పెరుగు నీటిని పలుచగా చేసి అందులో వేయించిన జీలకర్ర పొడి, అల్లం కలిపి తాగాలి.