• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »బిజినెస్

పెరిగిన బంగారం, తగ్గిన వెండి ధరలు

హైదరాబాద్ మార్కెట్‌లో బంగారం ధరలు పెరిగాయి. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ.710 పెరిగి రూ.1,38,710కు చేరగా, 22 క్యారెట్ల పసిడి రూ.650 పెరిగి రూ.1,27,150 వద్ద కొనసాగుతోంది. అయితే వెండి ధర మాత్రం నిన్నటితో పోల్చితే పతనమైంది. కిలో వెండిపై ఏకంగా రూ.4,000 తగ్గి రూ.2,68,000కు చేరింది. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలు ఉన్నట్లు సమాచారం.

January 9, 2026 / 09:41 AM IST

BOIలో పోస్టులు.. గడువు ముగుస్తోంది!

బ్యాంక్ ఆఫ్ ఇండియా(BOI) 400 గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ పోస్టులకు దరఖాస్తులు స్వీకరిస్తోంది. డిగ్రీ అర్హత గల 20-28 ఏళ్ల అభ్యర్థులు ఈ నెల 12 వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థులు ముందుగా NATS పోర్టల్‌లో ఎన్‌రోల్ చేసుకోవాలి. ఆన్‌లైన్ పరీక్ష ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

January 9, 2026 / 06:23 AM IST

ఉండవల్లి సమావేశంలో లోకేశ్ కీలక ఆదేశాలు

GNTR: ఉండవల్లి వేదికగా గురువారం జరిగిన పార్టీ ముఖ్యనేతల సమావేశంలో నారా లోకేశ్ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. చంద్రబాబు నాయుడి నాయకత్వమే పార్టీకి శిరోధార్యమని, అందరూ ఒకే అజెండాతో సైనికుల్లా కదలాలని పిలుపునిచ్చారు. ప్రజాదర్బార్ల ద్వారా జనం చెంతకు చేరి, రాబోయే ఎన్నికల్లో రికార్డు విజయాన్ని నమోదు చేయడమే లక్ష్యంగా శ్రమించాలని కార్యకర్తలను లోకేశ్ కోరారు.

January 9, 2026 / 06:02 AM IST

జనరల్ నాలెడ్జ్

➢ భారతదేశంలో అత్యున్నత పౌర పురస్కారం ఏది?జవాబు: భారతరత్న➢ చైనా సముద్ర ఉష్ణమండల తుఫానుల పేరు ఏమిటి?జవాబు: టైపూన్➢ ఏ సవరణను భారత మినీ రాజ్యాంగం అని కూడా అంటారు?జవాబు: 42వ సవరణ➢ శ్వేత విఫ్లవం దేనికి సంబంధించింది?జవాబు: పాల ఉత్పత్తి

January 9, 2026 / 04:53 AM IST

మైక్రోసాఫ్ట్‌లో భారీగా లేఆఫ్స్.. క్లారిటీ

ప్రముఖ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ దాదాపు 22వేల మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు వార్తలొస్తున్నాయి. దీంతో ఉద్యోగులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఈ వార్తలపై మైక్రోసాఫ్ట్ చీఫ్ కమ్యూనికేషన్స్ ఆఫీసర్ ఫ్రాంక్ ఎక్స్ స్పందించారు. ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని.. 100 శాతం ఉద్యోగుల కోత అవాస్తవమని స్పష్టం చేశారు.

January 8, 2026 / 11:49 AM IST

వెండికి కూడా ‘హాల్‌మార్క్‌’ తప్పనిసరి?

బంగారంలాగే వెండి ఆభరణాలకు కూడా హాల్‌మార్క్‌ (Hallmark) తప్పనిసరి చేసే యోచనలో బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల వెండి ధరలు భారీగా పెరగడంతో నాణ్యత ప్రమాణాల కోసం ఈ నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. ప్రస్తుతం వెండిపై హాల్‌మార్క్‌ స్వచ్ఛందం మాత్రమే కాగా, త్వరలో నిబంధనలు మారే అవకాశం ఉంది.

January 7, 2026 / 11:23 AM IST

పోలీస్ అధికారులకు పలు సూచనలు చేసిన సీపీ

KMM: ఎవరైనా కోడి పందాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ మంగళవారం హెచ్చరించారు. సంక్రాంతి పండుగ సందర్భంగా కోడి పందేలు జరగకుండా తీసుకుంటున్న చర్యలలో భాగంగా గతంలో కోడిపందేలు, పేకాట స్థావరాలు నిర్వహించిన వారిని బైండోవర్ చేయాలని, అదేవిధంగా కౌన్సిలింగ్ నిర్వహించాలని పోలీస్ అధికారులకు ఆదేశించారు.

January 7, 2026 / 07:31 AM IST

ALERT: 16న బ్యాంకులకు సెలవు

AP: ఈనెల 16న కనుమ సందర్భంగా రాష్ట్రంలోని బ్యాంకులు, వాటి అనుబంధ సంస్థలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. బ్యాంకులకు ప్రభుత్వం ఇచ్చిన సెలవుల జాబితాలో జనవరి 16న సెలవు లేదు. అయితే, బ్యాంకు సంఘాల విన్నపం మేరకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. ఈ మేరకు సీఎస్ విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు. వారంలో 5 రోజుల పని దినాల కోసం ఈనెల 27న పలు బ్యాంకుల ఉద్యోగులు సమ్మె చేపట్టనున్నారు.

January 7, 2026 / 07:17 AM IST

తిరుపతి IITలో ఉద్యోగావకాశాలు

TPT: ఏర్పేడు వద్ద ఉన్న తిరుపతి IITలో ప్రాజెక్టు అసోసియేట్-01 పోస్టుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. BSc డిగ్రీ ఇన్ సైన్స్/ డిప్లొమా / B.Tech పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులు. దరఖాస్తులకు చివరి తేదీ జనవరి 09. మరిన్ని వివరాలకు https://www.iittp.ac.in /Project_Positions వెబ్ సైట్ చూడాలి.

January 7, 2026 / 07:00 AM IST

CSLలో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల

కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్(CSL)లో 210 వర్క్‌మెన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అభ్యర్థులు టెన్త్‌తోపాటు సంబంధిత ట్రేడ్‌లో ITI పాసై ఉండాలి. కేటగిరీల వారీగా గరిష్ఠ వయో పరిమితి 45 ఏళ్ల వరకు ఉంది. ఈనెల 23 వరకు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు. రాత పరీక్ష, ప్రాక్టికల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

January 7, 2026 / 06:48 AM IST

డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడిన 13 మందికి జైలు శిక్ష

PDPL: గోదావరిఖనిలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడిన వారికి కోర్టు శిక్షలు విధించింది. మంగళవారం ట్రాఫిక్ పోలీసులు పట్టుకున్న 13 మందిని మేజిస్ట్రేట్ దుర్వ వెంకటేష్ ముందు హాజరుపరచగా, 12 మందికి రూ.28 వేల జరిమానా విధించారు. రెండోసారి పట్టుబడిన వ్యక్తికి 5 రోజుల జైలు శిక్ష పడిందని, ట్రాఫిక్ సీఐ రాజేశ్వరరావు తెలిపారు.

January 7, 2026 / 04:09 AM IST

TGSRTCలో ఉద్యోగాలు.. అప్లై చేశారా?

TG: రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో ఖాళీగా ఉన్న 198 ట్రాఫిక్ సూపర్‌వైజర్ ట్రైనీ, మెకానికల్ సూపర్‌వైజర్ ట్రైనీ పోస్టుల భర్తీకి దరఖాస్తు ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతోందని TSPRB ఛైర్మన్ వీవీ శ్రీనివాస్ రావు తెలిపారు. వీటికి జనవరి 20 వరకు ఆన్ లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చని పేర్కొన్నారు. ఎట్టిపరిస్థితుల్లోనూ గడువు పొడిగించబడదని స్పష్టం చేశారు.

January 6, 2026 / 08:53 PM IST

ఆధార్ వినియోగదారులకు ALERT

ఆధార్ PVC కార్డు పొందేందుకు చెల్లించాల్సిన ధరను పెంచినట్లు ఉడాయ్ ప్రకటించింది. కార్డు ఫీజును రూ.50 నుంచి రూ.75కి పెంచినట్లు తెలిపింది. జనవరి 1 నుంచి ఈ ధర అమల్లోకి వచ్చినట్లు చెప్పింది. myAadhaar వెబ్‌సైట్ లేదా mAadhaar మొబైల్ యాప్ ద్వారా చేసే అన్ని కొత్త అభ్యర్థనలకు ఈ ధర వర్తిస్తుందని తెలిపింది. 2020 నుంచి కార్డు ధరలను పెంచడం ఇదే తొలిసారి.

January 6, 2026 / 08:31 PM IST

RBIలో ఉద్యోగాలు.. మరికొన్ని గంటలే ఛాన్స్

RBIలో 93 కాంట్రాక్ట్(ఫుల్ టైమ్) ఉద్యోగాలకు అప్లై చేయడానికి గడువు ఈ రోజుతో ముగుస్తోంది. పోస్టును బట్టి BSc, MSc, BE, BTech, MTech, CA, MCA, PhD, CMA, MBA, LLB, LLM ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. జాబ్ నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. 

January 6, 2026 / 10:16 AM IST

బీ ఫార్మసీ విద్యార్థులకు గుడ్‌న్యూస్

TG: ప్రైవేట్ ఫార్మసీ కాలేజీల్లో చదివే ఫస్టియర్ విద్యార్థులకు ఊరట లభించింది. గతేడాది నవంబర్‌లో ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధుల కోసం ప్రైవేట్ కాలేజీలు బంద్ చేపట్టగా..  JNTU పరీక్షలను వాయిదా వేయలేదు. దీంతో వేల మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. వారికి ఈనెల 27, 29న ఫస్టియర్ 2వ సెమిస్టర్ రెగ్యులర్, ఫస్ట్ సెమిస్టర్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తామని JNTU ప్రకటించింది.

January 6, 2026 / 06:50 AM IST