వాణిజ్య సిలిండర్ల కొరత కారణంగా ముంబైలో 20 శాతం హోటళ్లు, రెస్టారెంట్లు మూతపడ్డాయి. ఈ మేరకు ముంబై హోటల్ అండ్ రెస్టారెంట్ అసోసియేషన్ వెల్లడించింది. పరిస్థితి ఇలాగే కొనసాగితే రాబోయే రెండు రోజుల్లో నగరంలోని సగం హోటళ్లు మూతపడుతాయని పేర్కొంది. ఢిల్లీ, బెంగళూరులో ఇప్పటికే కొన్ని హోటళ్లలో వంటగ్యాస్ అందుబాటులో లేక తాత్కాలికంగా మూసివేస్తున్నారు.