PPM: మక్కువ మండలం మావుడి గ్రామ సమీపంలో ఏనుగుల గుంపు సంచరిస్తున్నటు అటవీశాఖ అధికారులు గురువారం ఉదయం తెలిపారు. గజరాజుల కదలికలను అటవీశాఖ సిబ్బంది నిరంతరం గమనిస్తున్నట్లు అధికారులు తెలిపారు. పొలాల వద్ద రైతులు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. పంటలకు నష్టం కలగకుండా ఏనుగులను అటవీ ప్రాంతానికి మళ్లించాలని స్థానికులు కోరుతున్నారు.