SS: కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మోసం చేసిందని ఆరోపిస్తూ పరిగి మండల కేంద్రంలోని వైఎస్సార్ సర్కిల్ వద్ద వైసీపీ ఆధ్వర్యంలో గురువారం నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా మండల కన్వీనర్ నరసింహమూర్తి ఆధ్వర్యంలో ‘వెన్నుపోటుకు రెండేళ్లు’ మేనిఫెస్టో కరపత్రాలను దహనం చేసి ప్రభుత్వ వైఫల్యాలను నిరసించారు.