MBNR: విద్యాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తుందని MLA యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. బీఈడీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్‌లో మహబూబ్ నగర్ జిల్లా కేంద్రానికి చెందిన ఉత్తంకుమార్ రెడ్డి, మహమ్మద్ ముజాహిద్‌లు అత్యుత్తమ ర్యాంకులు సాధించారు. దీంతో వారిని గురువారం జిల్లా కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో ఘనంగా సత్కరించి అభినందించారు.