మెగాస్టార్ చిరంజీవి, మలయాళ మెగాస్టార్ మోహన్ లాల్ కలిసి ఒకే చిత్రంలో నటించబోతున్నారు. బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘మెగా 158’ చిత్రంలో మోహన్ లాల్ ఒక కీలక పాత్రలో నటించనున్నట్లు తెలుస్తోంది. దీనిపై మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. గతంలో చిరు-బాబీ కాంబోలో వచ్చిన ‘వాల్తేరు వీరయ్య’ బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో, ఈ ‘మెగా 158’ చిత్రంపై భారీ అంచనాలు నె...
తమిళ హీరో శివకార్తికేయన్, డైరెక్టర్ సుధా కొంగర కాంబినేషన్లో ‘పరాశక్తి’ మూవీ తెరకెక్కుతోంది. ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం తొలుత ప్రకటించింది. అయితే, తాజాగా సినిమా విడుదల తేదీలో మార్పు చోటుచేసుకుంది. అనుకున్న సమయం కంటే నాలుగు రోజుల ముందే, అంటే జనవరి 10న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు మేకర్స్ ప్రకటించారు.
మోహన్‌లాల్ హీరోగా తెరకెక్కిన ‘వృషభ’ సినిమా ఈనెల 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా విడుదలపై నిర్మాత బన్నీ వాసు వివరణ ఇచ్చాడు. మూవీ నిర్మాణ సంస్థతో చేసుకున్న ఒప్పందం మేరకు, తప్పని పరిస్థితుల్లో రిలీజ్ చేస్తున్నట్లు తెలిపాడు. ఈ మూవీని తెలుగులో ‘గీతా ఆర్ట్స్’ డిస్ట్రిబ్యూషన్ చేయనుంది. కాగా, బన్నీ వాసు నిర్మించిన ‘ఈషా’ సినిమా కూడా ఈనెల 25న విడుదల కానుంది.
పవన్ కళ్యాణ్ నటించిన ‘తమ్ముడు’ మూవీలో ‘ట్రావెలింగ్ సోల్జర్’ పాట అప్పట్లో ఓ ట్రెండ్ సెట్ చేసిన విషయం తెలిసిందే. ఈ పాటలో పవన్ చేసే సాహసాలు అప్పట్లో యువతను ఆకట్టుకున్నాయి. అయితే, ఈ పాటతో పాటు అచ్యుత్‌తో పార్టీ జరిగే ఎపిసోడ్‌ను తీసేయాలని చిత్ర బృందం అనుకుందట. కానీ, పవన్ పట్టుబట్టడంతో వీటిని ఉంచారట. అలా పవన్ తీసుకున్న నిర్ణయాలు తమ్ముడు మూవీకి బాగా హెల్ప్ అయ్యాయి.
హీరోలు పవన్ కళ్యాణ్, జూ.ఎన్టీఆర్ పిటిషన్లపై ఢిల్లీ హైకోర్టులో విచారణ జరిగింది. తమ ఫొటోలు, వీడియోలు వాణిజ్య అవసరాలకు వాడుకోవడం.. తప్పుడు ప్రచారం చేయడం వల్ల తమ హక్కులకు భంగం వాటిల్లుతోందని పిటిషన్ వేశారు. ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, X, గూగుల్‌ను ప్రతివాదులుగా చేర్చారు. ఇరువైపు వాదనలు విన్న కోర్టు తదుపరి విచారణను 2026 మే 12వ తేదీకి వాయిదా వేసింది.
ఈ ఏడాది రూ.500 కోట్లు మార్కును దాటిన సినిమాలు ఐదు మాత్రమే ఉన్నాయి. అందులో బాలీవుడ్ స్టార్ హీరో రణ్వీర్ సింగ్ నటించిన ‘ధురంధర్’ నెం.1లో ఉంది. దాని తర్వాతి స్థానాల్లో ‘కాంతార: చాప్టర్1’ రూ.850 కోట్లు, ఛావా రూ.797 కోట్లు, సయారా రూ.579 కోట్లు కూలీ, రూ.514 ఉన్నాయి.
బాలీవుడ్ స్టార్ హీరో రణ్వీర్ సింగ్ నటించిన ‘ధురంధర్’ బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది. ఇప్పటివరకూ రూ.800 కోట్లకు పైగా వసూళ్లు సాధించినట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేశాయి. ఇలాగే మరో రెండు వారాలు కొనసాగితే రూ.1000 కోట్ల సాధించడం కష్టమేమీ కాదని తెలిపాయి. కొన్నేళ్లుగా సరైన హిట్లు లేక ఇబ్బంది పడుతున్న బాలీవుడ్ పరిశ్రమకు ఈ మూవీ కొత్త ఊపిరులూదింది.
కన్నడ స్టార్ హీరో శివ రాజ్‌కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. క్యాన్సర్ చికిత్సకు యూఎస్ వెళ్లిన రోజులను ఆయన గుర్తుచేసుకున్నాడు. వైద్యులు దేవుళ్లు లాంటి వారని పేర్కొన్నాడు. తన కొత్త సినిమా ’45’ ప్రమోషన్స్‌లో శివన్న ఈ వ్యాఖ్యలు చేశాడు. కాగా, క్యాన్సర్‌ను శివ రాజ్‌కుమార్ జయించిన తీరుపై ఓ డాక్యుమెంటరీ రానుంది.
నాగ చైతన్య, శోభిత ప్రేమ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. తాజాగా నాగ చైతన్య, తన భార్య శోభితతో పాటు ఆమె సోదరి సమంతతో కలిసి దిగిన ఓ ఫ్యామిలీ ఫోటో నెట్టింట సందడి చేస్తోంది. చైతూ మాజీ భార్య పేరు, మరదలి పేరు ఒకటే కావడంతో నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. ‘సమంత అనే పేరుతో చైతన్య జీవితానికి స్ట్రాంగ్ కనెక్షన్ ఉంది’ అని కామెంట్స్ చేస్తున్నారు.
నాగ చైతన్య, శోభిత ప్రేమ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. తాజాగా నాగ చైతన్య, తన భార్య శోభితతో పాటు ఆమె సోదరి సమంతతో కలిసి దిగిన ఓ ఫ్యామిలీ ఫొటో నెట్టింట సందడి చేస్తోంది. చైతూ మాజీ భార్య పేరు, మరదలి పేరు ఒకటే కావడంతో నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. ‘సమంత అనే పేరుతో చైతన్య జీవితానికి స్ట్రాంగ్ కనెక్షన్ ఉంది’ అని కామెంట్స్ చేస్తున్నారు.
‘నన్ను గెలిపించిన జనానికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నా’ అంటూ బిగ్ బాస్ 9 విన్నర్ కళ్యాణ్ పడాల భావోద్వేగానికి లోనయ్యాడు. ప్రియ, శ్రీజతో పాటు తనూజ సపోర్ట్ మరువలేనన్నాడు. ముఖ్యంగా తాను డల్ అయినప్పుడు తనూజనే ధైర్యం ఇచ్చి ముందుకు నడిపించిందని స్పెషల్‌గా థాంక్స్ చెప్పాడు. ‘మా అమ్మానాన్నలు కష్టపడి పెంచారు.. వాళ్లే నా బలం.. వాళ్లు లేకపోతే నేను లేను’ అని చెప్పాడు.
బిగ్ బాస్ చరిత్రలో సంచలనం నమోదైంది. సీజన్ 9 టైటిల్‌ను కామనర్ కళ్యాణ్ పగడాల దక్కించుకున్నాడు. గ్రాండ్ ఫినాలేలో సంజన, ఇమ్మాన్యుయేల్, డిమాన్ పవన్ ఎలిమినేట్ కాగా.. చివరికి తనూజ, కళ్యాణ్ మిగిలారు. హోరాహోరీ పోరులో కళ్యాణ్ విజేతగా నిలవగా, లేడీ ఫైటర్ తనూజ రన్నరప్‌గా సరిపెట్టుకుంది. ఓ సామాన్యుడు బిగ్ బాస్ కింగ్ అవ్వడం ఇదే తొలిసారి కావడంతో ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.
బిగ్‌బాస్ చరిత్రలో ఆసక్తికర సంఘటన జరిగింది. గతంలో ‘జై కిసాన్’ అంటూ రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ కప్పు కొడితే.. ఈ సీజన్లో ‘జై జవాన్’ అంటూ కళ్యాణ్ పడాల ‘బిగ్‌బాస్ 9’ టైటిల్ ఎగరేసుకెళ్లాడు. హౌస్‌లో మొదటినుంచి ఒక సైనికుడిలా పోరాడి, నిజాయితీగా ఆడి ప్రేక్షకుల ఓట్లు కొల్లగొట్టాడు. గ్రాండ్ ఫినాలేలో నాగార్జున చేతుల మీదుగా ట్రోఫీ అందుకున్నాడు.