నయనికతో పెళ్లి తర్వాత ఇచ్చిన తొలి ఇంటర్వ్యూలో అల్లు శిరీష్ తన అన్నయ్య అల్లు అర్జున్ ఇచ్చిన సలహా గురించి చెప్పాడు. ‘పరిస్థితులు ఎప్పుడూ మన చేతుల్లో ఉండవు. ఫంక్షన్లో డ్రెస్సులు సరైన సమయానికి రాకపోవచ్చు. ఆలస్యం కావొచ్చు. ఇలాంటి చిన్న విషయాలకు ఒత్తిడికి లోనవ్వద్దు. ఇవి నీ జీవితంలోనే మధురమైన క్షణాలు, ఏమీ ఆలోచించకుండా పెళ్లిని ఎంజాయ్ చేయి’ అని బన్నీ చెప్పినట్లు తెలిపాడు.