PPM: కురుపాం మండలం మొండెంఖల్ వారపు సంతను ఎస్సై నీలకంఠరావు సందర్శించారు. ఈ సందర్భంగా సంతకు వచ్చిన మారుమూల గిరిజన ప్రజలకు అభయదయం 2.0, రోడ్డు భద్రత, మత్తు పదార్థాల వినియోగం వల్ల కలిగే అనర్థాలపై అవగాహన కల్పించారు. ప్రజలు నిబంధనలు పాటిస్తూ సురక్షితంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.