• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »టెక్

రాకెట్ వేగంతో దూసుకెళ్లే కొత్త సూపర్ కారు

చైనా సంస్థ డ్రీమ్ టెక్నాలజీ ‘నెబ్యులా నెక్స్ట్01’ పేరుతో అద్భుతమైన సూపర్ కారును తీసుకొచ్చింది. ఇందులో రాకెట్ బూస్టర్లు ఉండటం వల్ల కేవలం 0.9 సెకన్లలోనే 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 550 కిలోమీటర్లు ప్రయాణించే ఈ కారులో అత్యాధునిక సెన్సార్లు, భద్రతా ఫీచర్లు ఉన్నాయి. ఇది భవిష్యత్తు వాహన రంగంలో సరికొత్త విప్లవం సృష్టించబోతోంది.

April 29, 2026 / 06:35 PM IST

యాపిల్ నుంచి ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్!

యాపిల్ కంపెనీ ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ సెగ్మెంట్‌లోకి అడుగుపెట్టనున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది చివర్లో ఐఫోన్ 18తో పాటు ఐఫోన్ ఫోల్డ్ పేరుతో యాపిల్ తన మొదటి ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ విడుదల చేయనున్నట్లు సమాచారం. ఈ ఫోన్‌కు సంబంధించిన కొన్ని డమ్మీ యూనిట్లు SMలో వైరల్ అవుతున్నాయి. అయితే, దీనిపై కంపెనీ మాత్రం ఎలాంటి అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు.

April 26, 2026 / 11:10 PM IST

స్నాప్‌చాట్‌కు పోటీగా ‘ఇన్‌స్టాంట్స్‌’

స్నాప్‌చాట్‌కు గట్టి పోటీ ఇచ్చేందుకు మెటా యాజమాన్యంలోని ఇన్‌స్టాగ్రామ్‌ ‘ఇన్‌స్టాంట్స్‌'(Instants) పేరుతో సరికొత్త క్విక్ ఫొటో షేరింగ్ యాప్‌ను లాంచ్ చేసింది. ప్రస్తుతం ఈ యాప్ స్పెయిన్, ఇటలీలోని ఆండ్రాయిడ్, ఐఓఎస్ యూజర్లకు మాత్రమే అందుబాటులోకి వచ్చింది. త్వరలోనే భారత్ సహా మిగతా దేశాల్లోనూ ఈ యాప్‌ను విడుదల చేసేందుకు కంపెనీ సిద్ధమవుతోంది.

April 25, 2026 / 11:55 AM IST

జియోలో సగం మంది 5జీ వినియోగదారులే

జియో ప్లాట్‌ఫామ్స్ 2025-26 మార్చి త్రైమాసికంలో రూ.7,935 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. వినియోగదారుల సగటు ఆదాయం(ARPU) రూ.214కు పెరగడం కంపెనీకి కలిసివచ్చింది. ప్రస్తుతం జియోకు 52.44 కోట్ల కస్టమర్లు ఉండగా, అందులో 26.8 కోట్లు(55%) మంది 5జీ వాడుతున్నారు. జియో ప్లాట్‌ఫామ్స్ ఐపీఓ/లిస్టింగ్ దిశగా స్థిరంగా సాగుతోందని ముకేశ్ అంబానీ తెలిపారు.

April 25, 2026 / 09:35 AM IST

ప్లాన్‌లు భారీగా పెంచే ఆలోచన లేదు: VI

వొడాఫోన్ ఐడియా(Vi) తమ టారిఫ్ ప్లాన్ల ధరలపై కీలక స్పష్టత ఇచ్చింది. రీఛార్జ్ ప్లాన్లను భారీగా పెంచే ఆలోచన ప్రస్తుతం లేదని, కేవలం స్వల్ప మార్పులు మాత్రమే ఉంటాయని కంపెనీ తెలిపింది. ఇటీవల ఎయిర్‌టెల్ తన ప్రీపెయిడ్ ప్లాన్ల ధరలను 4-5 శాతం పెంచడంతో, VI కూడా అదే బాటలో నడుస్తుందని వస్తున్న వార్తలకు దీనితో తెరపడింది. ఈ నిర్ణయం VI వినియోగదారులకు కొంత ఊరటనిచ్చే అంశం.

April 24, 2026 / 02:33 PM IST

TVS నుంచి కొత్త బైక్స్‌.. ధ‌ర‌ ఎంతంటే?

TVS టూవీలర్ మోటార్ కంపెనీ ‘టీవీఎస్ రైడర్ 125’ కొత్త మోడల్‌ను మార్కెట్‌లో విడుదల చేసింది. SXC DD, TFT DD పేరుతో రెండు వేరియంట్లలో రిలీజ్ చేసింది. ఇందులో కొత్తగా నైట్రో గ్రీన్ కలర్ కూడా లాంచ్ చేశారు. TVS డ్రమ్ బైక్స్ ఎక్స్‌షోరూం ధర రూ.82,860గా ఫిక్స్ చేశారు. ఈ బైక్స్ ధర ఒక్కో ప్రాంతంలో ఒక్కోలాగా ఉంటుంది. SXC DD బైక్ రూ.96,725, TFT DD బైక్ రూ.98,725 ఉంది.

April 24, 2026 / 12:50 PM IST

భారత్‌లో టెస్లా మోడల్ ‘వై ఎల్‌’ కారు విడుదల

ప్రముఖ కార్ల తయారీ కంపెనీ టెస్లా భారత్‌లో కొత్త విద్యుత్ కారును లాంచ్ చేసింది. YL పేరిట కొత్త మోడల్‌ను తీసుకొచ్చింది. దీని ధర రూ.61.99 లక్షలుగా కంపెనీ నిర్ణయించింది. అధిక వీల్‌బేస్, 6 సీటర్ కెపాసిటీతో వస్తోంది. సింగిల్ ఛార్జింగ్‌తో 681 కి.మీ. ప్రయాణించొచ్చని కంపెనీ పేర్కొంది. ఈ మోడల్‌ను చైనాలో విడుదల చేయగా అమెరికాలో ఇంకా లాంచ్ చేయకపోవడం గమనార్హం.

April 22, 2026 / 02:42 PM IST

రూ.40 వేలు పెరిగిన కార్ల ధరలు

ప్రముఖ కార్ల సంస్థ సిట్రోయెన్ తన ‘బసాల్ట్’ మోడల్ కార్ల ధరలను రూ.40,000 వరకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ముడిసరుకు ఖర్చులు పెరగడమే ఇందుకు ప్రధాన కారణమని కంపెనీ తెలిపింది. దీనివల్ల ఎంట్రీ లెవల్ వేరియంట్ ధర రూ.8.55 లక్షలకు చేరింది. ఇతర మోడళ్ల ధరలు కూడా వేరియంట్‌ను బట్టి ధరలు పెంచింది. కొత్తగా కారు కొనాలనుకునే వారు ఇప్పుడు మరికొంత అదనంగా ఖర్చు చేయాల్సి ఉంటుంది.

April 18, 2026 / 01:50 PM IST

ఒక్కసారి ఛార్జ్ చేస్తే 400 కి.మీల రేంజ్‌

సింపుల్ ఎనర్జీ ‘అల్ట్రా’ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను రూ.2.35L ధరతో లాంచ్ చేసింది. 400KMల IDC రేంజ్‌తో దేశంలోనే అత్యధిక మైలేజీని ఇచ్చే స్కూటర్‌గా నిలిచింది. 115 kmph టాప్ స్పీడ్ దీని ప్రత్యేకత. కేవలం 2.77 సెకన్లలోనే 40 కి.మీల వేగాన్ని అందుకుంటుంది. 7 అంగుళాల డిస్‌ప్లే, ట్రాక్షన్ కంట్రోల్ వంటి స్మార్ట్ ఫీచర్లు ఉన్న ఈ స్కూటర్ HYD, విజయవాడల్లో అందుబాటులో ఉంది.

April 17, 2026 / 05:00 PM IST

మారుతీ సుజుకి ‘ఇగ్నిస్’ కార్లు బంద్!

దేశీయ కార్ల తయారీ దిగ్గజం మారుతీ సుజుకి ‘ఇగ్నిస్’ ఉత్పత్తిని నిలిపివేసింది. అమ్మకాలు పడిపోవడం, డిమాండ్ తగ్గడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. నెల రోజులుగా ఈ కార్ల ఉత్పత్తి నిలిచిపోయిందని డీలర్లు చెబుతున్నారు. కొత్త బుకింగ్‌లను సైతం తీసుకోవట్లేదు. 2017లో విడుదలైన ఈ ప్రీమియం అర్బన్ కాంపాక్ట్ హ్యాచ్‌బ్యాక్ కారు ధర రూ.4.59 లక్షల నుంచి రూ.7.80 లక్షల మధ్య ఉండేది.

April 17, 2026 / 08:13 AM IST

భారత్‌లోకి బర్గ్‌మన్ 400 గ్రాండ్ ఎంట్రీ

ముంబైలో జరిగిన ‘సుజుకి మాట్సురి 2026’ ఈవెంట్‌లో బర్గ్‌మన్ 400 మ్యాక్సీ స్కూటర్ భారత మార్కెట్‌లో మెరిసింది. 400cc పవర్‌ఫుల్ ఇంజిన్, డ్యూయల్ ఛానల్ ABS, ట్రాక్షన్ కంట్రోల్ వంటి ప్రీమియం ఫీచర్లతో ఇది రూపొందింది. అంతర్జాతీయ మార్కెట్లో ఇప్పటికే అందుబాటులో ఉన్న ఈ స్కూటర్‌ భారత్‌లో BMW C400 GT వంటి లగ్జరీ స్కూటర్లకు గట్టి పోటీ కానుంది.

April 15, 2026 / 02:00 PM IST

సరికొత్త 180cc ఇంజిన్‌తో VESPA సందడి

వెస్పా తన పాపులర్ ప్రిమవెరా, స్ప్రింట్ మోడళ్లలో పవర్‌ఫుల్ 180cc ఇంజిన్ వేరియంట్లను ఇండోనేషియాలో లాంచ్ చేసింది. వీటి ప్రారంభ ధర సుమారు రూ.2.99L. కొత్త ఐ-గెట్ ఇంజిన్‌తో ఇవి 15hp పవర్, 13.7Nm టార్క్‌ను అందిస్తాయి. కీ-లెస్ ఎంట్రీ, కలర్ డిజిటల్ క్లస్టర్, మియా కనెక్టివిటీ వంటి హైటెక్ ఫీచర్లు ఉన్నాయి. భారత్‌లో వీటి లాంచ్‌పై ఇంకా స్పష్టత లేదు.

April 15, 2026 / 01:27 PM IST

భారీ బ్యాటరీతో వివో T5 ప్రో..

స్మార్ట్‌ఫోన్ రంగంలో సరికొత్త రికార్డు సృష్టిస్తూ వివో తన ‘T5 ప్రో’ను విడుదల చేసింది. 9020 mAh భారీ బ్యాటరీతో వస్తుండటం దీని ప్రత్యేకత. గత ఏడాది వచ్చిన T4 ప్రోకు సక్సెసర్‌గా వచ్చిన ఈ మొబైల్ ప్రారంభ ధర రూ. 29,999 గా ఉంది.

April 15, 2026 / 01:20 PM IST

రెడ్‌మీ నుంచి ఎంట్రీ లెవల్ 5జీ స్మార్ట్‌ఫోన్

షావోమీ సంస్థ Redmi A7 Pro మొబైల్‌ను లాంచ్ చేసింది. గ్లోబల్ మార్కెట్‌లో ఎంట్రీ ఇచ్చిన ఈ ఫోన్.. భారత్‌లో ఈరోజు విడుదలైంది. 6,300mAh బ్యాటరీ, 32mp డ్యూయల్ కెమెరా, 6.9 అంగుళాల HD+ LCD స్క్రీన్, ఆక్టాకోర్ యూనిసోక్ టీ8300 ప్రాసెసర్, రివర్స్ వైర్డ్ ఛార్జింగ్ సదుపాయంతో ఈ ఫోన్ వస్తోంది. 4జీబీ+ 64జీబీ ఫోన్ ధర రూ.11,499.. 4జీబీ+ 128జీబీ ధర రూ.12,499గా నిర్ణయించారు.

April 13, 2026 / 04:07 PM IST

ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలుపై భారీగా సబ్సిడీ

ఢిల్లీ ప్రభుత్వం ఈవీలపై మూడేళ్ల పాటు సబ్సిడీ అందించనుంది. టూ వీలర్లపై మొదటి ఏడాది రూ.30 వేలు, ఈ-ఆటోలపై రూ.50 వేల వరకు, గూడ్స్ వాహనాలపై రూ.లక్ష వరకు నగదు ప్రోత్సాహకం లభిస్తుంది. ఈ సబ్సిడీ మొత్తం ప్రతి ఏడాది క్రమంగా తగ్గుతూ వస్తుంది. దీనికి తోడు పాత పెట్రోల్, డీజిల్ వాహనాలను తుక్కుగా మార్చి కొత్త ఈవీని కొంటే కార్లపై అదనంగా రూ.లక్ష వరకు భారీ రాయితీని ప్రభుత్వం కల్పించింది.

April 11, 2026 / 11:13 AM IST