ఓలా ఎలక్ట్రిక్ తమ త్రైమాసిక ఫలితాలను విడుదల చేసింది. 2025-26 ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికానికి రూ.500 కోట్ల ఏకీకృత నికర నష్టాన్ని నమోదు చేసింది. 2024-25లో ఇదే సమయంలో రూ.870 కోట్లతో పోలిస్తే 42.5% నష్టం తగ్గుముఖం పట్టింది. సమీక్షా త్రైమాసికంలో కార్యకలాపాల ద్వారా వచ్చే ఆదాయం రూ.265 కోట్లుగా నమోదైంది. గతేడాది ఇదే సమయంలో ఆదాయం రూ.611 కోట్లతో పోలిస్తే 56.62% తగ్గింది.