ఖమ్మం ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలకు స్వయం ప్రతిపత్తి (అటానమస్) హోదా లభించింది. కాకతీయ యూనివర్సిటీ అధికారులు ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు జారీ చేసి కళాశాల ప్రిన్సిపల్‌కు అందజేశారు. ఈ గుర్తింపుతో విద్యా ప్రమాణాలు మరింత మెరుగుపడటంతో పాటు విద్యార్థినులకు నాణ్యమైన విద్య అందే అవకాశాలు పెరుగుతాయని అధ్యాపకులు అభిప్రాయపడ్డారు.