NRML: జిల్లాలో మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడిన నిందితుడితో పాటు అతనికి సహకరించిన మహిళను పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. ప్రేమిస్తున్నానని నమ్మబలికి గత మూడు సంవత్సరాలుగా బాలికపై లైంగిక దాడికి పాల్పడిన సాహీల్ ఖురేషీపై పోక్సో కేసు నమోదు చేశారు. డీఎస్పీ శ్రీనివాస్ పర్యవేక్షణలో నిందితుడు సాహీల్ ఖురేషీతో పాటు రెహానాను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.