సినిమా ప్రదర్శనల పర్సంటేజీ వివాదం నేపథ్యంలో తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్ష పదవికి సునీల్ నారంగ్ రాజీనామా చేశాడు. కొందరు కార్యవర్గ సభ్యుల ఒత్తిళ్ల వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు లేఖలో పేర్కొన్నాడు. సింగిల్ స్క్రీన్ థియేటర్ల యాజమాన్యాలు, నిర్మాతల మధ్య నెలకొన్న వివాదం తీవ్ర చర్చనీయాంశంగా మారిన తరుణంలో ఆయన తప్పుకోవడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.