TG: సీనియర్ పోలీస్ అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి నిర్వహించిన సమీక్షలో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎస్ఐ స్థాయి నుంచి నాన్-కేడర్ ఐపీఎస్ వరకు ప్రమోషన్ పొందిన అధికారులు.. ఆ తర్వాత ఖచ్చితంగా రెండేళ్లపాటు ఇతర విభాగాల్లో పనిచేయాలని సీఎం ఆదేశించారు. ఈ నూతన పోస్టింగ్ విధానంపై సమగ్రంగా అధ్యయనం చేసి నివేదిక సమర్పించాలని సీఎస్, డీజీపీలను రేవంత్ కోరారు.