AP: పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ఆరేటినగర్లో ఘోర ప్రమాదం జరిగింది. డ్రైనేజీ క్లీన్ చేస్తుండగా అకస్మాత్తుగా విష వాయువులు లీకయ్యాయి. ఈ ప్రమాదంలో ఒక కార్మికుడు ఊపిరాడక అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఇద్దరి పరిస్థితి విషమంగా మారింది. బాధితులను చికిత్స నిమిత్తం వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.