KKD: జిల్లా ఉపాధి కార్యాలయంలో ఈ నెల 23న 200 ఉద్యోగాల భర్తీకి జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి శ్రీనివాసరావు బుధవారం తెలిపారు. ఇన్వోసోరీ సర్వీసెస్, బ్లూ ఓసాన్ పర్సనల్ ఎలైయట్ సంస్థల్లో వివిధ హోదాల్లో పనిచేసేందుకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. టెన్త్ నుంచి డిగ్రీ చదివిన అభ్యర్థులు ఆరోజు ఉదయం 10 గంటలకు హాజరు కావాలన్నారు.