రూపాయి విలువ క్షీణిస్తున్న వేళ RBI కీలక నిర్ణయం తీసుకుంది. బ్యాంకింగ్ వ్యవస్థలోకి నగదు లభ్యతను పెంచేందుకు 5 బిలియన్ డాలర్ల విలువైన డాలరు-రూపాయి బై, సెల్ స్వాప్ వేలాన్ని చేపట్టనుంది. మే 26న ఈ వేలం నిర్వహించనున్నట్లు RBI తెలిపింది. ప్రస్తుత, మారుతున్న పరిస్థితుల్లో సమీక్షించాక మూడేళ్ల కాలపరిమితితో USD/INR బై/ సెల్ స్వాప్ వేలాన్ని నిర్వహించాలని నిర్ణయించినట్లు RBI పేర్కొంది.