AP: పర్యాటక శాఖ ‘హాలిడే ఇన్ AP’ పేరుతో సరికొత్త కార్యక్రమాన్ని చేపట్టింది. ఇందులో భాగంగా పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ టూరిజం ఆపరేటర్లు, స్టేక్ హోల్డర్స్, ట్రావెల్ ఏజెన్సీలతో కీలక సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో టూరిజం ప్రమోషన్, పర్యాటకుల సౌకర్యాలు, పర్యాటక రంగ అభివృద్ధిపై ఈ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు.