PDPL: సింగరేణి సంస్థ అభివృద్ధికి ఉద్యోగుల సమిష్టి కృషి అవసరమని ఆర్జీ-2 ఎస్వోటుజీఎం మాలోతు రాముడు అన్నారు. బుధవారం ఆర్జీ- 2లోని సీహెచ్‌పీ, ఏరియా వర్క్ షాప్‌లలో నిర్వహించిన మల్టీ డిపార్ట్మెంటల్ సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్వోటుజీఎం మాట్లాడుతూ.. ప్రతి ఉద్యోగి క్రమశిక్షణ అంకితభావంతో విధులు నిర్వహించాలని సూచించారు.