• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »బ్రేకింగ్ న్యూస్

పిడుగు పాటు.. ముగ్గురు కూలీలు మృతి

AP: విజయనగరం రాజాం మండలం గెడ్డవలసలో విషాదం చోటుచేసుకుంది. పొలంలో పిడుగుపడి ముగ్గురు మహిళా కూలీలు మృతి చెందారు. మృతులు సత్తెమ్మ, రాజు, నర్సమ్మగా గుర్తించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

May 5, 2026 / 05:59 PM IST

భారీ పేలుడు.. 21 మంది మృతి

చైనా హునాన్ ప్రావిన్స్‌లోని బాణసంచా కర్మాగారంలో భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో 21 మంది మరణించగా.. 61 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఘటనాస్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

May 5, 2026 / 09:37 AM IST

ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన కారు.. ఇద్దరి మృతి

TG: సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ బైపాస్ రోడ్డుపై ప్రమాదం చోటుచేసుకుంది. ఆగి ఉన్న లారీని వెనక నుంచి ఢీకొట్టిన ఘటనలో ఇద్దరు మృతి చెందగా.. ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. మృతులను చేవెళ్ల వాసులుగా పోలీసులు గుర్తించారు. తుల్జాపూర్ నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

May 5, 2026 / 08:58 AM IST

ఇన్ స్టా రీల్ చూసి వంట.. నలుగురికి అస్వస్థత

KKD: SMలో వైరల్ గా మారిన వంటకాన్ని తిని కుటుంబం అస్వస్థకు గురైన ఘటన జల్లాలో చోటుచేసుకుంది. గండేపల్లి మండలం ఎర్రంపాలెంలో ఒక కుటుంబం ఇన్‌స్టా రీల్ చూసి ఉమ్మెత్త పువ్వుతో పప్పు వండుకుని తిన్నారు. అది తిన్న నలుగురు జయలక్ష్మి, గంగాభవాని, వీరలక్ష్మి, వీరబ్బులకు తీవ్ర వాంతులు అయ్యాయి. దీంతో వారిని కాకినాడ GGHక తరలించారు. ప్రస్తుతం వారి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు సమాచారం.

May 5, 2026 / 07:00 AM IST

తమ్ముడిపై సోదరి ఫిర్యాదు.. కేసు నమోదు

NLR: నెల్లూరు వేదాయపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో ఆస్తి వివాదం ఉద్రిక్తతకు దారితీసింది. సొంత తమ్ముడు ఇంటిపై దౌర్జన్యం చేస్తున్నాడని ఓ మహిళ సోమవారం రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇంట్లోకి చొరబడి వస్తువులను ధ్వంసం చేస్తూ తనపై దాడికి యత్నిస్తున్నాడని ఆమె తెలిపింది. అతనిపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరగా దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

May 5, 2026 / 06:20 AM IST

దారుణం.. కొడుకుతో కలిసి ప్రియుడి హత్య

TG: HYDలోని జీడిమెట్ల అంబేద్కర్‌నగర్‌లో దారుణం జరిగింది. కొడుకుతో కలిసి, ఓ మహిళ తన ప్రియుడిని హతమార్చింది. ఏపీలోని అన్నమయ్య జిల్లాకు చెందిన శివారెడ్డితో గత పదేళ్లుగా మహిళ సహజీవనం చేస్తోంది. 19 ఏళ్ల కుమారుడు కూడా వాళ్లతోనే ఉంటున్నాడు. ఈ క్రమంలో తల్లీ కొడుకులు మటన్ కొట్టే కత్తితో నరికి అతడిని హత్య చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

May 4, 2026 / 11:34 AM IST

లారీని ఢీకొట్టిన అంబులెన్స్.. నలుగురు మృతి

AP: తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఓ అంబులెన్స్ ఆగివున్న లారీని వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందగా.. ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. మృతులు వెస్ట్ బెంగాల్‌కు చెందినవారుగా పోలీసులు గుర్తించారు. పేషెంట్‌ను బెంగళూరు తీసుకెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

May 4, 2026 / 08:02 AM IST

మనస్థాపానికి గురై వివాహిత ఆత్మహత్య

SKLM: జి.సిగడాం మండలం ఆనందపురంలో కిమిడి రాజేశ్వరి (26) మనస్తాపంతో ఆత్మహత్య చేసుకుంది. భర్త మద్యం, బెట్టింగ్‌లకు బానిసై తరచూ గొడవలు జరిగేవి. వారం క్రితం పిల్లలతో తల్లిదండ్రుల ఇంటికి వచ్చిన ఆమె, ఆదివారం రాత్రి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. కుటుంబ సభ్యులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

May 4, 2026 / 07:37 AM IST

జిల్లాలో దంపతుల దారుణ హత్య

SKLM: చిల్లంగి అనుమానంతో భార్యాభర్తల హత్య కలకలం రేపింది. చినరాజపురంలో సవర ఇల్లంగో (55), జ్యోతి (50)లను తోటయ్య కత్తితో హత్య చేశాడు. తన కుటుంబ సభ్యుల అనారోగ్యానికి చేతబడి కారణమని భావించినట్టు సమాచారం. ఘటనను గోప్యంగా ఉంచి దహనానికి యత్నించినా, కుమారుడు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో బయటపడింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

April 29, 2026 / 05:16 PM IST

తాడిపత్రిలో అగ్నిప్రమాదం

ATP: తాడిపత్రి పట్టణంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. స్థానిక ఒక గుజరీ దుకాణంలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో లోపల ఉన్న సామాగ్రి మొత్తం అగ్నికి ఆహుతైంది. ప్రమాద సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.

April 29, 2026 / 04:20 PM IST

కరెంట్ షాక్‌తో వలస కూలీ మృతి

NLR: ఆత్మకూరులో విషాద ఘటన జరిగింది. అల్లూరి జిల్లాకు చెందిన రాంప్రసాద్ (20) ఆత్మకూరుకు వలస వచ్చాడు. వింజమూరు మండలం నల్లగొండ్లలో కరెంట్ పనుల కోసం బుధవారం వెళ్లాడు. ఈక్రమంలో యువకుడికి విద్యుత్ షాక్ తగిలి గాయాలయ్యాయి. ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతిచెందాడు. పనికి పిలిపించిన కాంట్రాక్టర్ తమను పట్టించుకోలేదని రాంప్రసాద్ వెంట వచ్చిన యువకులు వాపోయారు.

April 29, 2026 / 04:10 PM IST

సాఫ్ట్‌వేర్ సీతారాం సూసైడ్ కేసులో కీలక పరిణామం

సాఫ్ట్‌వేర్ సీతారాం సూసైడ్ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ క్రమంలో ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. మృతుడి భార్య రేణుక, ఆమె ప్రియుడు రమణతో పాటు శ్రవణ్‌ను అరెస్ట్ చేశారు. భార్య రేణుక ముగ్గురితో అక్రమ సంబంధం పెట్టుకుందని, ఫిబ్రవరిలో సీతారాం.. హుస్సేన్‌సాగర్‌లో దూకి ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే.

April 29, 2026 / 04:02 PM IST

జంట హత్యల కలకలం

AP: శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండలంలో జంట హత్యలు కలకలం సృష్టించాయి. చినరాజపురంలో దంపతులు దారుణహత్యకు గురయ్యారు. సవర ఇల్లంగో(55), భార్య జ్యోతి(45)ని గొడ్డలితో నరికి కోటయ్య అనే వ్యక్తి హత్య చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

April 29, 2026 / 08:10 AM IST

విశాఖ ఎక్స్‌ప్రెస్‌లో వివాహితపై అత్యాచారం

AP: విశాఖ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణించిన వివాహితపై అత్యాచారం జరిగింది. ఈనెల 26న విశాఖ నుంచి నడికుడికి భర్తతో కలిసి మహిళ ప్రయాణం చేసింది. ఈ క్రమంలో జనరల్ బోగీలోని దంపతులను AC బోగీలో ఖాళీ ఉందని చెప్పి నిందితుడు తీసుకెళ్లాడు. భర్త టాయిలెట్స్ వద్ద కూర్చోగా.. భార్యను AC కూపేలోకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. దంపతుల ఫిర్యాదుతో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

April 29, 2026 / 07:56 AM IST

గుత్తి మండలంలో విషాదం

ATP: గుత్తి మండలంలో విషాదం చోటుచేసుకుంది. మండల పరిధిలోని బేతాపల్లి గ్రామంలో భోయగడ్డ శ్రీనివాసులు అనే వ్యక్తి తన ఇంటి పనులు చేస్తుండగా ప్రమాదవశాత్తు పైనున్న విద్యుత్ తీగలు తగిలి అపస్మారక స్థితిలో పడిపోయాడు. గమనించిన కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం గుత్తి ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు శ్రీనివాసులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు.

April 28, 2026 / 06:20 PM IST