AP: అనంతపురంలోని ఓ ప్రైవేటు వసతి గృహంలో డిగ్రీ రెండో సంవత్సరం చదువుతున్న నందిని(19) అనే విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. నార్పల మండలానికి చెందిన ఈమె, హాస్టల్ భవనం వద్ద శవమై కనిపించింది. తోటి విద్యార్థుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. ఇది ఆత్మహత్యా లేక మరేదైనా కారణమా అనే కోణంలో విచారిస్తున్నారు.