NRML: తెలంగాణ దినోత్సవం సందర్భంగా నిర్మల్ కలెక్టరేట్లో అటవీ శాఖ ఏర్పాటు చేసిన ప్రదర్శన స్టాల్ ప్రజలను విశేషంగా ఆకట్టుకుంది. పర్యావరణ పరిరక్షణ, అడవుల పెంపుదలపై అవగాహన కల్పించడమే లక్ష్యంగా ఈ స్టాల్ను తీర్చిదిద్దారు. అడవుల్లోని అరుదైన ఔషధ మొక్కలు, వృక్ష సంపద, పర్యావరణ సమతుల్యతను వివరించే నమూనాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.