MHBD: తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా నెల్లికుదురు మండలంలోని శ్రీరామగిరి గ్రామపంచాయతీ కార్యాలయం ఆవరణలో స్థానిక సర్పంచ్ మాదరి ప్రశాంత్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ… అమరుల త్యాగాల ఫలితమే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని, అమరవీరుల త్యాగాలు తెలంగాణ చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోయాయని అన్నారు.