NLG: త్రిపురారం మండల కేంద్రంలోని విద్యుత్ సబ్స్టేషన్ వెనుక ఉన్న ఒక బావిలో గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్యమవ్వడం తీవ్ర కలకలం రేపింది. స్థానికులు ఇచ్చిన సమాచారంతో ఘటన స్థాలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని వెలికితీశారు. మృతురాలి వివరాలు ఇంకా తెలియరాలేదు. పోలీసులు కేసు నమోదు చేసుకుని, మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.