TG: ఏపీ DY. CM పవన్‌పై కాంగ్రెస్ MLC అద్దంకి దయాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల మధ్య పవన్ చిచ్చు పెట్టాలని చూస్తున్నారని మండిపడ్డారు. ఆయనతో చిచ్చుబుడ్డి వెలిగించాలని బీజేపీ చూస్తోందని, మోదీ వచ్చి వెళ్లాక టార్గెట్ తెలంగాణ అని బీజేపీ చెప్పినట్లు గుర్తుచేశారు. ఆవిర్భావ దినోత్సవం రోజు వైషమ్యాలు సృష్టించాలని చూస్తారా? రాష్ట్రం ప్రశాంతంగా ఉండటం ఇష్టం లేదా అని ప్రశ్నించారు.